Naga Vamsi Comments On Vijay Deverakonda: విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘కింగ్డమ్'(Kingdom Movie) నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలై డివైడ్ టాక్ ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఫస్ట్ హాఫ్ అద్భుతంగా ఉన్నప్పటికీ, సెకండ్ హాఫ్ వీక్ స్క్రీన్ ప్లే తో తేలిపోవడం తో ఈ చిత్రానికి డివైడ్ టాక్ వచ్చింది. ఎమోషనల్ సన్నివేశాలు సరిగా పండలేదు. గౌతమ్ సినిమాల్లో గుండెల్ని పిండేసే ఎమోషన్స్ ఉంటాయి. కానీ ఇందులో ఒక్కటంటే ఒక్క ఎమోషన్ సన్నివేశం కూడా పండలేదు. అందుకే ఆడియన్స్ కి కనెక్ట్ కాలేదు. అయితే విడుదలకు ముందు మంచి అంచనాలు ఏర్పాటు చేసుకున్న సినిమా కావడం తో, అమెరికా నుండి అనకాపల్లి వరకు ఓపెనింగ్స్ అదిరిపోయాయి. విజయ్ దేవరకొండ కెరీర్ లోనే ఈ చిత్రం భారీ ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా నిలబడబోతుంది. ఈ సందర్భంగా మేకర్స్ ఈరోజు సాయంత్రం ఒక ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేశారు.
Also Read: ఇండియాతో కటీఫ్.. పాకిస్తాన్ తో దోస్తీ.. దెబ్బకొట్టిన ట్రంప్.. కారణం ఇదే
ఈ ప్రెస్ మీట్ లో నిర్మాత నాగవంశీ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. సినిమా కి మంచి పాజిటివ్ టాక్ వచ్చిందని, చాలా ప్రాంతాల్లో మొదటి రోజే 50 శాతం కి పైగా బ్రేక్ ఈవెన్ మార్కుని ఈ చిత్రం అందుకోబోతుందని, ప్రస్తుతం ఉన్న లెక్కల ప్రకారం ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా 35 నుండి 40 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబడుతుందని చెప్పుకొచ్చాడు. సోమవారం సాయంత్రం గ్రాండ్ గా ఈ సినిమాకు సంబంధించిన సక్సెస్ మీట్ ని ఏర్పాటు చేయబోతున్నట్టు చెప్పుకొచ్చాడు. మొన్న ఎలాగో మూవీ టీం మొత్తం పవన్ కళ్యాణ్ గారిని కలిశారు కదా, సక్సెస్ మీట్ కి కూడా పవన్ కళ్యాణ్ గారిని అతిథిగా పిలుస్తారా అని అడిగిన ప్రశ్నకు, అలాంటిదేమి లేదండి, ప్రస్తుతానికి ఈయనే (విజయ్ దేవరకొండ) మా పవన్ కళ్యాణ్ అంటూ చెప్పుకొచ్చాడు. పవన్ కళ్యాణ్ ని విజయ్ దేవరకొండ తో పోల్చడం పై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నిర్మాత నాగవంశీ పై ఫైర్ మీద ఉన్నారు. సోషల్ మీడియా లో బాగా వైరల్ అవుతున్న ఆ వీడియో ని మీరు కూడా చూడండి.
#VijayDeverakonda is the New #PawanKalyan
– #NagaVamsi at #Kingdom success press meet! pic.twitter.com/7ZqK60dgwh
— Censor Talk (@TheCensorTalk) July 31, 2025