Aryan Kelvin Instagram success: సోషల్ మీడియా చూడడం వేరు.. సోషల్ మీడియా ద్వారా పేరు తెచ్చుకోవడం వేరు. అలా నేటి కాలంలో చాలామంది సోషల్ మీడియాని ఉపయోగించి సెలబ్రిటీలుగా మారిపోతున్నారు. ప్రపంచం మొత్తం సోషల్ మీడియా చుట్టూ తిరుగుతున్న నేపథ్యంలో.. కార్పొరేట్ సంస్థలు.. సోషల్ మీడియాలో ఫేమస్ అయిన వారితో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయి. అటువంటి వారికి విరివిగా అవకాశాలు ఇస్తున్నాయి. అందుకోసమే నేటి కాలంలో చాలామంది సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వడానికి తాపత్రయపడుతున్నారు.
మనదేశంలో సోషల్ మీడియాను ఉపయోగించే వారి సంఖ్య భారీగానే ఉంటుంది. సోషల్ మీడియా ద్వారా సెలబ్రిటీలు అయిన వారు కూడా చాలామంది ఉన్నారు. ఒక్కసారి సెలబ్రిటీ హోదా వచ్చిన తర్వాత వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే డబ్బుకు డబ్బు.. పేరుకు పేరు వస్తాయి. పైగా నేటి కాలంలో సోషల్ మీడియా ద్వారా డబ్బులు సంపాదించేవారు పెరిగిపోయారు. కేవలం సృజనాత్మకతను ఆసరాగా తీసుకొని.. సోషల్ మీడియాలో చాలామంది ఫేమస్ అవుతున్నారు.
మనదేశంలో సోషల్ మీడియా ద్వారా సెలబ్రిటీలు అయిన వారు చాలామంది ఉన్నారు. ఆ జాబితాలో ఇతడికి ముందు వరసలో చోటు ఉంటుంది. అతడి పేరు ఆర్యన్ కెల్విన్. ఇతడిది జార్ఖండ్ రాష్ట్రంలోని ధన్బాద్ ప్రాంతం. ఇతడు సోషల్ మీడియాలో సరికొత్త మైలురాయిని అందుకున్నాడు. ఇతడు వినూత్నమైన కంటెంట్ తో ఇన్ స్టా గ్రామ్ లో సంచలనం సృష్టించడం మొదలు పెట్టాడు. ఫలితంగా ఇతడు ఏకంగా 20 మిలియన్ల ఫాలోవర్స్ సాధించాడు. ఈ ఘనత సాధించిన తొలి ఇండియన్ క్రియేటర్ తనే అని కెల్విన్ చెబుతున్నాడు.
ఆ వీడియోకు కేవలం 15 గంటల్లోనే రెండు కోట్లకు పైగా వ్యూస్ రావడం విశేషం. అంతే కాదు 15 లక్షల పైగా లైక్స్ వచ్చాయి. కెల్విన్ వినూత్నమైన వీడియోలు రూపొందిస్తుంటాడు. దానికి తగ్గట్టుగా వ్యాఖ్యానాన్ని జత చేస్తూ ఉంటాడు. సమయానికి తగ్గట్టుగా స్పందిస్తూ ఉంటాడు. అతడి గొంతు కూడా చాలా బాగుంటుంది. అందువల్లే అతడు ఈ స్థాయిలో పేరు తెచ్చుకున్నాడు. ఇప్పటికే అతడు అనేక సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నాడు.. లక్షలలో సంపాదిస్తున్నాడు. ఉన్నత విద్యావంతుడైన ఇతడు.. తన క్రియేటివిటీ తో కంటెంట్ కింగ్ గా పేరు తెచ్చుకున్నాడు. సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలనుకునే వారికి కూడా పాఠాలు చెబుతున్నాడు.
