Largest 3D printed building in France: మనకు ఇల్లు కట్టుకోవాలని ఉంటే ఏం చేస్తాం.. ముందు సరైన స్థలం కొనుగోలు చేస్తాం. ఆ తర్వాత ఇంజనీర్ ను పిలిపించి ప్లానింగ్ గీయించుకుంటాం. తాపీ మేస్త్రిని పిలిపించుకొని మన స్తోమత తగ్గట్టుగా ఇల్లు నిర్మించుకుంటాం. కానీ ఇప్పుడు ఇల్లు నిర్మించే విషయంలో కూడా మార్పులు వస్తున్నాయి. క్రమేపి ఇంటి నిర్మాణం కొత్త పుంతలు తొక్కుతోంది.
కొద్దిరోజుల క్రితం ఫ్రాన్స్ లో ఒక అపార్ట్మెంట్ నిర్మించారు. దానిని నిర్మించారు అని చెప్పడం కంటే.. ప్రింట్ చేశారు అనడం సబబు.. దాదాపు మూడు అంతస్తుల లో.. 12 పోర్షన్లు ఉన్నాయి ఈ అపార్ట్మెంట్లో. ఈ భవనంలో ఉన్న కోడలు మొత్తం ప్రింటింగ్ టెక్నాలజీతో పూర్తి చేశారు. నిర్మాణంలో బలం ఉండడానికి స్తంభాలను పాతారు. కాలమ్స్.. పై కప్పులను నిర్మించారు. ఆ తర్వాత తలుపులను.. కిటికీలను.. వైరింగ్.. బాత్రూం.. ఇతర వాటిని దశలవారీగా అమర్చారు. అయితే ఒక సాధారణ ఇంటిని నిర్మించడానికి పట్టే సమయానికంటే మూడు నెలలు ముందుగానే దీనిని పూర్తి చేశారు.
ఫ్రాన్స్ లోని అత్యంత చారిత్రాత్మకమైన నగరం రిమ్స్ ప్రాంతంలో దీనిని నిర్మించారు. 800 చదరపు మీటర్ల వైశాల్యం తో.. అత్యాధునికమైన ఫైబర్.. కాంక్రీట్ వంటి వాటిని వాడి దీనిని నిర్మించారు. అత్యంత నాణ్యమైన ఫైబర్ వల్ల ఈ భవనంలో పిల్లర్ల సంఖ్య చాలా వరకు తగ్గింది. త్రిడి విధానంలో ప్రింటింగ్ టెక్నాలజీ ఉపయోగించడంతో కాంక్రీట్ వాడకం కూడా సమర్థవంతంగా సాగింది. అంతేకాదు, 10 శాతం కాంక్రీట్ వాడకాన్ని తగ్గించారు. గత ఏడాది మార్చి నెలలో 3d ప్రింటింగ్ మొదలుపెట్టారు. ఆ తర్వాత 34 రోజుల్లోనే ఆ త్రీడీ ప్రింటింగ్ మొత్తాన్ని పూర్తి చేశారు.. మిగిలిన పనులు దశలవారీగా పూర్తి చేశారు. ఏప్రిల్ నెలలో ఈ భవనం ప్రారంభమైంది.. కో బోడ్ బాడ్ -2 అనే అత్యాధునికమైన త్రీడీ ప్రింటర్ ను దీనికోసం ఉపయోగించారు. ఈ యంత్రం గతంలో భూకంపాలను తట్టుకునే ఇల్లు.. సమాచార కేంద్రాన్ని త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీతో పూర్తి చేయడం ఇక్కడ విశేషం.
మన దేశంలో ఎలా ఉందంటే
3d ప్రింటింగ్ టెక్నాలజీ అనేది మనదేశంలో కూడా సాగుతూ ఉంది. ఇప్పటికైతే ప్రారంభ దశలో మాత్రమే ఉంది. సరిగ్గా ఐదు సంవత్సరాల క్రితం మద్రాస్ ఐఐటి త్వస్థ పేరుతో త్రీడీ ప్రింటెడ్ ఇంటి నిర్మాణాన్ని పూర్తిచేసింది. 600 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించిన ఈ ఇల్లు అప్పట్లో చాలా మందిలో విపరీతమైన ఆసక్తిని కలగజేసింది. త్వస్త తో పాటు ఎల్ అండ్ టి సంస్థ కూడా గృహ నిర్మాణాలను వేగంగా చేపట్టేందుకు 3d ప్రింటింగ్ టెక్నాలజీని ఉపయోగిస్తోంది. దీని ద్వారా దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంలో భాగంగా ఇళ్లను నిర్మించేందుకు ప్రణాళికలను రూపొందిస్తున్నారు.
In France, construction has been completed of the largest 3D-printed residential building in Europe
The project includes 12 social housing apartments across three floors.
The company Plurial Novilia built it in 34 days instead of the planned 50. The entire process was… pic.twitter.com/abH9ltZ5Ce
— NEXTA (@nexta_tv) June 1, 2026
