An Inspiring Journey Of A Horse: ఈ ప్రపంచం చాలా అందమైనది. ప్రతిదృశ్యంలోనూ అద్భుతంగా ఉంటుంది. కాకపోతే ఆ అందం, అద్భుతం మనం చూసే చూపు ద్వారానే తెలుస్తుంది. అందుకే అన్ని అవయవాల కంటే నేత్రాలు ప్రధానమని అంటారు.
మనుషుల్లో కొంతమందికి పుట్టగానే అంధత్వ సమస్య కనిపిస్తుంది. అలాంటి వారికి ఎన్ని రకాలుగా చికిత్సలు చేసినప్పటికీ ఉపయోగం ఉండదు. దీంతో వారు చూపు లేకుండానే బతకాల్సి వస్తుంది. ఇక అలాంటివారు చదువుకోవాలంటే ఇబ్బంది. ఏ పని చేసుకోవాలన్నా ఇతరుల మీద ఆధారపడాల్సిందే. మనుషుల పరిస్థితే ఇలా ఉంటే.. ఇక చూపులేని మూగజీవాల పరిస్థితి ఎలా ఉంటుంది.. అవి ఎలా మనుగడ సాగిస్తాయి? అవి ఎలా ముందుకు సాగుతాయి? అయితే ఈ ప్రశ్నలకు ఆత్మవిశ్వాసం ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపిస్తోంది ఈ ఆశ్వం.. ఇంతకీ ఈ గుర్రానికి ఏమైంది? ఆ గుర్రం తనలో ఉన్న లోపాన్ని ఎలా మార్చుకుంది? ఆ తర్వాత ఎటువంటి అద్భుతాలు చేసింది? అనే ప్రశ్నలకు సమాధానమే ఈ కథనం
Also Read : Horse In Train: రైల్లో గుర్రం.. సోషల్ మీడియాలో చూసి షాకైన రైల్వే అధికారులు
ఇంతకీ ఏం జరిగిందంటే..
అమెరికాలోని ఒరేగాన్ అనే ప్రాంతం ఉంటుంది. అక్కడ యూజీని అనే ఏరియాకి చెందిన ఎండో అనే గుర్రానికి రెండు కళ్ళు కనిపించవు. అది తల్లి గర్భం నుంచే అంధత్వంతో పుట్టింది. మొదట్లో ఈ సమస్యను దాని యజమాని గుర్తించలేదు. ఆ తర్వాత దాని సమస్యను గుర్తించి.. దాన్ని జయించే విధంగా తోడ్పాటు అందించింది. దాని యజమాని మోర్గాన్ వాగ్నర్ అనే ట్రైనర్ చేతిలో పెట్టింది. అంధులైన మనుషులకు బ్రెయిలీ లిపి ఏ విధంగా అయితే ఉపయోగపడుతుందో.. ఎండో అనే గుర్రానికి కూడా వాయిస్ కమాండ్ ద్వారా శిక్షణ ఇచ్చింది వాగ్నర్. వాయిస్ కామెంట్స్ ఆధారంగా దానిలో కదలికలు కలిగించింది.. దీంతో తనలో ఉన్న లోపాన్ని ఎండో సరిచేసుకుంది. చూపు సమర్థవంతంగా ఉన్న గుర్రం ఏ విధంగా అయితే పరిగెడుతుందో.. ఎండో కూడా అదే విధంగా పరుగులు తీయడం మొదలుపెట్టింది. 2022 అక్టోబర్ నెలలో 106 సెంటీమీటర్ల ఫ్రీ జంప్ ను సులభంగా చేసింది. ఒక నిమిషంలో 39 ఫ్లయింగ్ చేంజెస్ చేపట్టింది. 6.93 సెకండ్ల వ్యవధిలో ఐదు పోల్స్ ను సులభంగా చేదించింది. తద్వారా గిన్నిస్ రికార్డును సొంతం చేసుకుంది.. వాస్తవానికి ఒక మనిషిలో లోపం గనక ఉంటే ఎంతో ఇబ్బంది పడుతుంటాడు. ముఖ్యంగా చూప లేకపోతే మరింత నిరాశలో కూరుకుపోతాడు. కానీ ఎండో మాత్రం నిరాశవాదాన్ని తన దరి చేరనివ్వలేదు. పైగా అచంచలమైన ఆత్మవిశ్వాసంతో పరుగులు తీయడం మొదలు పెట్టింది. అసలు తనలో ఉన్న లోపాన్ని పూర్తిగా పక్కన పెట్టింది. గిన్నిస్ రికార్డు సొంతం చేసుకున్న దిశగా అడుగులు వేసింది. తనకంటే మెరుగైన ఆరోగ్యం.. అద్భుతమైన చూపు.. బలమైన సామర్థ్యం ఉన్న గుర్రాలు కూడా చేయలేనిది.. తను చేసిన నిరూపించింది. అందుకే లోపం శరీరానికి మాత్రమే.. మనలో ఆత్మవిశ్వాసానికి కాదు అని ఎండో నిజం చేసి చూపించింది.