Strange things : పువ్వు తిని యువతి మృతితో ఆ పువ్వులపై నిషేధం

అయితే ఈ పువ్వు, ఆకు విషపూరితమైనదిగా నివేదించబడలేదు. ఈ ఘటన తర్వాత ఆందోళన నెలకొంది. ఇంట్లో పిల్లలు ఉంటే ఈ పూల మొక్కను పెంచడం ప్రమాదకరం మని పేర్కొంటున్నారు.

Written By: NARESH, Updated On : May 13, 2024 8:19 pm

Arali flower

Follow us on

Strange things : ప్రకృతి మనకు అనేక వరాలను ప్రసాదించింది. వీటితోపాటు కొన్ని ప్రమాదాలు కూడా పొంచి ఉన్నాయి. అయితే అవి ప్రమాదమని మనకు తెలియదు. అందుకే కొందరు చిన్న కారణంతో ప్రాణాలు పోగొట్టుకుంటారు. ఇక్కడ ఓ మహిళ కూడా వింత కారణాలతో మరణించింది. ఇంటి పెరట్లో పెరిగిన ఓ మొక్క పువ్వు తిని ప్రాణాలు కోల్పోయింది. కేరళలో జరిగిన ఈ ఘటన అందరినీ కలచివేసింది. ఈ విషయం తెలిసి గ్రామస్తులు ఆ పువ్వులనే నిషేధించారు.

ఏం జరిగిందంటే..
కేరళకు చెందిన సూర్య సురేంద్రన్‌ అనే 24 ఏళ్ల యువతి వృత్తిరీత్యా నర్సు. విమానాశ్రయంలో అస్వస్థతకు గురైంది. వెంటనే ఆసుపత్రికి తరలించగా వైద్యులు అప్పటికే చనిపోయినట్లు తెలిపారు. అయితే ఆమె మరణానికి కారణం తెలియరాలేదు. అలప్పుజా మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో సూర్య సురేంద్రన్‌ మృతదేహాని పోస్టుమార్టం నిర్వహించారు. ఈ నివేదికలో ఆమె మృతికి పూలు, ఆకులు తినడమే కారణమని తెలిపారు. బంధువలతో ఫోన్‌లో మాట్లాడుతూ ఏమరు పాటుగా గన్నేరు పువ్వు, ఆకు తినేసింది.

ఒక రోజు తర్వాత మరణం..
సూర్య సురేంద్రన్‌ పువ్వు, ఆకు తిన్న ఒక రోజు తర్వాత వాటిలోని ద్రవం ఆమె శరీరమంతా వ్యాపించింది. ఆదివారం ఇంగ్లండ్‌ వెళ్లేందుకు ఉదయం 11.30 గంటలకు పల్లిపట్టేలోని తన ఇంటి నుంచి బంధువులతో కలిసి కొచ్చి విమానాశ్రయానికి చేరుకుంది. ఈ క్రమంలో విమానాశ్రయంలో కుప్పకూలింది. అంతా గుండెపోటు వచ్చిందని అనుమానించారు. పోస్టుమార్టం తర్వాత పూలు, ఆకు తినడం వల్లే అస్వస్థతకు గురై మరణిచినట్లు తేలింది.

కేరళలలో పూల నిషేధం
సూర్య సురేంద్రన్‌ ఘటనలో ట్రావెన్‌కోర్ దేవాలయ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. దేవుడి పూజకు గన్నేరు పూలను ఉపయోగించడం నిషేధించింది. పూజలో గన్నేరు పూలకు బదులుగా తులసి పప్పు ఉపయోగించాలని సూచించారు. అయితే ఈ పువ్వు, ఆకు విషపూరితమైనదిగా నివేదించబడలేదు. ఈ ఘటన తర్వాత ఆందోళన నెలకొంది. ఇంట్లో పిల్లలు ఉంటే ఈ పూల మొక్కను పెంచడం ప్రమాదకరం మని పేర్కొంటున్నారు.