https://oktelugu.com/

IPL 2024 PlayOffs : రాయల్ చాలెంజర్స్ బెంగళూరు దెబ్బకు సంక్లిష్టంగా మారిన ఐపీఎల్ ప్లేఆఫ్స్

ఇక గుజరాత్ టైటాన్స్ ప్లే ఆఫ్ వెళ్లే దారులు మొత్తం ముగిసుకుపోయాయి. ఆ జట్టు వచ్చే రెండు మ్యాచ్లలో వరుసగా గెలిచినప్పటికీ.. పెద్దగా ఉపయోగముండదు..

Written By:
  • NARESH
  • , Updated On : May 13, 2024 / 09:53 PM IST

    Royal Challengers Bangalore complicated IPL playoffs with consecutive wins

    Follow us on

    IPL 2024 PlayOffs : ఐపీఎల్ దాదాపు తుది దశకు చేరుకుంది. ఇప్పటికే కోల్ కతా నైట్ రైడర్స్ ప్లే ఆఫ్ వెళ్ళిపోయింది. కోల్ కతా మిగతా మ్యాచ్ లలోగెలిస్తే కచ్చితంగా మొదటి స్థానంలో ఉండడం ఖాయం. అలా మొదటి స్థానాన్ని దక్కించుకుంటే మే 21న అహ్మదాబాద్ లో జరిగే క్వాలిఫైయర్ -1 పోరు లో ఆ జట్టు ప్రత్యర్థి జట్టుతో తలపడుతుంది. ఒకవేళ కోల్ కతా ఆడబోయే మ్యాచ్లు ఓడిపోయి.. రాజస్థాన్, హైదరాబాద్ జట్లు మెరుగైన నెట్ రన్ రేట్ సాధిస్తే అప్పుడు ఆ జట్టు 3 లేదా నాలుగు స్థానానికి పరిమితం అవుతుంది.

    గత ఆదివారం చెన్నై జట్టుతో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ ఓడిపోవడం.. ఆ జట్టుకు ఇబ్బందికరంగా మారింది. అయినప్పటికీ 16 పాయింట్లతో ప్లే ఆఫ్ వెళ్లేందుకు రాజస్థాన్ జట్టుకు మెరుగైన అవకాశాలు ఉన్నాయి.. మే 14న జరిగే మ్యాచ్లో లక్నో ఢిల్లీ ఓడిస్తే అప్పుడు సమీకరణాలు మారిపోతాయి. చెన్నై, హైదరాబాద్ జట్లు మరింత సౌకర్యమైన స్థితిలో ఉంటాయి. అలా కాకుండా ఢిల్లీ చేతిలో లక్నో గెలిచినా, పాయింట్లు పరంగా అది ఐదు లేదా ఆరవ స్థానానికి పరిమితం అవుతుంది. కానీ, ప్లే ఆఫ్ కు వెళ్లేందుకు ఆ జట్టుకు అడ్డంకులు ఏర్పడతాయి. ఎందుకంటే లక్నో జట్టు నెట్ రన్ రేట్ -0.769 మాత్రమే ఉంది.

    ఇక గత మ్యాచ్లో లక్నో జట్టు పై హైదరాబాద్ ఏకపక్ష విజయాన్ని సాధించడం.. ఆ జట్టుకు ఉపయుక్తంగా మారింది. హైదరాబాద్ జట్టు ఆడే తదుపరి రెండు మ్యాచ్లలో గెలిస్తే ప్లే ఆఫ్ అవకాశం కచ్చితంగా ఉంటుంది. కోల్ కతా, రాజస్థాన్ జట్లు సాధించే విజయాలపై ఆధారపడి మొదటి, రెండవ స్థానానికి వెళ్లే అవకాశం కూడా ఉంటుంది. ఒకవేళ హైదరాబాద్ జట్టు తదుపరి మ్యాచ్లలో ఓడిపోతే.. ఆది చెన్నై, బెంగళూరు, లక్నో జట్టుకు లాభం చేకూర్చుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ హైదరాబాద్ రెండు విజయాలు సాధించాలి.

    రాజస్థాన్ జట్టుపై సాధించిన విజయం చెన్నై జట్టుకు లాభం చేకూర్చింది. చెన్నై జట్టు ప్రస్తుత సీజన్లో 13 మ్యాచ్లు ఆడి, ఏడు విజయాలు నమోదు చేసింది. నెట్ రన్ రేట్+0.528 గా ఉంది.. చెన్నై బెంగళూరు తో చివరి మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్ లో కనుక చెన్నై గెలిస్తే నెట్ రన్ రేట్ ప్రకారం ప్లే ఆఫ్ వెళ్లేందుకు అవకాశం ఉంటుంది. ఒకవేళ ఓటమిపాలైతే ఐదో స్థానానికి పడిపోతుంది. అప్పుడు బెంగళూరు లేదా లక్నో నాలుగో స్థానానికి వస్తాయి. దీంతో చెన్నై ప్లే ఆఫ్ వెళ్లేందుకు అవకాశం ఉండదు. ఒకవేళ బెంగళూరు తో తక్కువ పరుగులతో ఓడిపోతే.. చెన్నై నాల్గవ స్థానంలో ఉండేందుకు అవకాశం ఉంటుంది. అప్పుడు నెట్ రన్ రేట్ ప్రకారం ఆ జట్టు ప్లే ఆఫ్ వెళ్తుంది.

    ఇక ఢిల్లీ జట్టుతో జరిగిన మ్యాచ్లో సాధించిన విజయం ద్వారా బెంగళూరు పాయింట్ల పట్టికలో ఐదవ స్థానంలో కొనసాగుతోంది. ప్రస్తుతం ఆ జట్టు 0.397 రన్ రేట్ కొనసాగిస్తోంది. బెంగళూరు జట్టు తన చివరి మ్యాచ్ ను చెన్నైతో ఆడుతుంది. ఒకవేళ బెంగళూరు చెన్నై పై 18 లేదా అంతకంటే ఎక్కువ పరుగులతో విజయం సాధించాలి. ఒకవేళ బెంగళూరు ముందుగా బ్యాటింగ్ చేస్తే 200 పరుగులు సాధించాలి. ఒకవేళ చెన్నై ముందుగా బ్యాటింగ్ చేసి రెండు వందల పరుగుల లక్ష్యాన్ని నిర్దేశిస్తే.. బెంగళూరు 18.1 ఓవర్లలో దానిని చేదించాలి. హైదరాబాద్ జట్టు ఆడే మ్యాచ్లలో ఒకటి మాత్రమే గెలిచి, లక్నో తన చివరి రెండు మ్యాచ్లు గెలిస్తే.. చెన్నై పై సాధించే గెలుపులో ఎటువంటి లెక్కలు లేకుండా బెంగళూరు నాకౌట్ కి వెళ్తుంది.

    ఢిల్లీ జట్టు బెంగళూరు చేతిలో ఓడిపోవడం.. దాని నాకౌట్ అవకాశాలను దారుణంగా ప్రభావితం చేసింది. ఢిల్లీ జట్టు ప్లే ఆఫ్ వెళ్లేందుకు అవకాశాలు ఉన్నాయి. అయితే ఎందుకు అద్భుతాలు జరగాలి. లక్నో జట్టుతో జరిగే మ్యాచ్లో ఢిల్లీ కచ్చితంగా గెలవాలి. హైదరాబాద్ జట్టు ఆడే చివరి రెండు మ్యాచ్లలో భారీ తేడాతో ఓడిపోవాలి. అంతేకాకుండా చెన్నై జట్టును బెంగళూరు ఓడించాలి. అప్పుడు పాయింట్లు పరంగా ఢిల్లీ హైదరాబాద్ కంటే ముందు ఉంటుంది. హైదరాబాద్ ఆడే చివరి రెండు మ్యాచ్లు 160 పరుల తర్వాత ఓడిపోయి.. లక్నో జట్టును ఢిల్లీ 96 లేదా అంతకంటే ఎక్కువ పరుగులతో ఓడిస్తే.. పాయింట్లు టై అవుతాయి. అప్పుడు ఢిల్లీ జట్టు ప్లే ఆఫ్ వెళ్లేందుకు అవకాశం ఉంటుంది.

    ఇక గత బుధవారం జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ 10 వికెట్ల తేడాతో విజయం సాధించడం లక్నో అవకాశాలను దారుణంగా దెబ్బతిస్తుంది. లక్నో ప్రస్తుతం 12 పాయింట్ల కలిగి ఉంది. లక్నో తన తదుపరి మ్యాచులు ఢిల్లీ, ముంబై జట్లతో ఆడాల్సి ఉంది. ఆ రెండు మ్యాచ్లో గెలిస్తే.. లక్నో జట్టు ఖాతాలో 16 పాయింట్లు సమకూరుతాయి. ఒకవేళ లక్నో ఒక్క మ్యాచ్ మాత్రమే గెలిస్తే ప్లే ఆఫ్ వెళ్లేందుకు అవకాశం ఉండదు.

    ఇక గుజరాత్ టైటాన్స్ ప్లే ఆఫ్ వెళ్లే దారులు మొత్తం ముగిసుకుపోయాయి. ఆ జట్టు వచ్చే రెండు మ్యాచ్లలో వరుసగా గెలిచినప్పటికీ.. పెద్దగా ఉపయోగముండదు.. బెంగళూరు తన చివరి ఐదు మ్యాచ్లను గెలవడం ద్వారా ఐపీఎల్ పోరు రసవత్తరంగా మారింది. ఢిల్లీ, గుజరాత్, చెన్నై, హైదరాబాద్ జట్ల తలరాతలనే ఆ జట్టు మార్చేసింది. చూడాలి ఇంకా.. ప్లే ఆఫ్ ముందు ఎన్ని అద్భుతాలు జరుగుతాయో..