https://oktelugu.com/

Tenali Incident: ఓటరుపై దాడి చేసిన వైసీపీ ఎమ్మెల్యే అరెస్టుకు ఆదేశాలు

రాష్ట్రవ్యాప్తంగా ఉదయం నుంచి హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి. ఎక్కడికక్కడే అధికార పార్టీ విపక్షాలకు సంబంధించి ఏజెంట్లను ఇబ్బందులు పెట్టినట్లు వార్తలు వచ్చాయి.

Written By:
  • Dharma
  • , Updated On : May 13, 2024 4:50 pm
    Tenali Incident

    Tenali Incident

    Follow us on

    Tenali Incident: తెనాలి సిట్టింగ్ ఎమ్మెల్యే, వైసిపి అభ్యర్థి అన్నాబత్తుల శివరాంకి ఎలక్షన్ కమిషన్ షాక్ ఇచ్చింది. ఆయన అదుపులో తీసుకోవాలని తక్షణం ఆదేశించింది. ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించడం తో సీరియస్ అయ్యింది. పోలింగ్ వరకు ఆయన గృహనిర్బంధంలో ఉంచాలని ఆదేశించింది. దీంతో ఇది ఈరోజు ఎన్నికల్లో సంచలన అంశం గా మారింది. తెనాలి వైసీపీ అభ్యర్థి శివరాం ఓటు వేసేందుకు వెళుతుండగా.. ఓ వ్యక్తి అభ్యంతరం వ్యక్తం చేశాడు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన శివరాం సదరు వ్యక్తిపై చేయి చేసుకున్నాడు.దీంతో బాధిత యువకుడు ఎమ్మెల్యే చెంపపై చెల్లుమనిపించాడు. అయితే తరువాత ఆ బాధిత యువకుడ్ని ఎమ్మెల్యే అనుచరులు చితకబాదారు. దీంతో పోలింగ్ కేంద్రంలో గలాటా జరిగింది. ఎలక్షన్ కమిషన్ దృష్టికి వెళ్లడంతో.. అదుపులో తీసుకోవాలని ఆదేశాలు వెలువడ్డాయి.

    రాష్ట్రవ్యాప్తంగా ఉదయం నుంచి హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి. ఎక్కడికక్కడే అధికార పార్టీ విపక్షాలకు సంబంధించి ఏజెంట్లను ఇబ్బందులు పెట్టినట్లు వార్తలు వచ్చాయి. ఈ తరుణంలోనే తెనాలిలో సిట్టింగ్ ఎమ్మెల్యే, వైసీపీ అభ్యర్థి అన్నా బత్తుల శివరాం ఓటు వేసేందుకు నేరుగా పోలింగ్ కేంద్రానికి వెళ్లారు. అయితే క్యూ లైన్ లో ఉన్న ఓ యువకుడు అభ్యంతరం వ్యక్తం చేశాడు. దీంతోనే ఘటన జరిగింది. ఎలక్షన్ కమిషన్ ఆగ్రహానికి కారణమైంది. అయితే పోటీ చేస్తున్న అభ్యర్థి ఓటరుకు ఇబ్బంది పెట్టడంతో ఈసీ కలుగ చేసుకోవాల్సి వచ్చింది. ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు పోలీసులు ఆయన గృహ నిర్బంధంలో ఉంచారు.

    మరోవైపు ఈ ఘటనపై ఎమ్మెల్యే అన్నాబత్తుల శివరాం స్పందించారు. తనతో గొడవపడిన వ్యక్తి.. తెల్లవారి నుంచి పోలింగ్ కేంద్రంలో హల్చల్ చేస్తున్నాడని.. కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అని.. దళితులకు కొమ్ముకాస్తావా అంటూ ప్రశ్నించాడని చెప్పుకొస్తున్నారు. బెంగుళూరు నుంచి వచ్చిన సదరు వ్యక్తి టిడిపి మనిషి అని ఆరోపించారు. తాను పోలింగ్ బూత్ కు తన భార్యతో కలిసి వెళ్లానని.. అప్పుడే సదరు వ్యక్తి తిట్ల దండకం అందుకున్నాడని.. వచ్చేటప్పుడు కూడా అలానే మాట్లాడాడని.
    .. నా భార్య ఎదుట అలా అనేసరికి చేయి చేసుకోవాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు. మొత్తానికైతే వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే, ఆపై అభ్యర్థిపై ఎలక్షన్ కమిషన్ సీరియస్ కావడంతో సర్వత్రా ఆందోళన నెలకొంది. ఇదే చర్చనీయాంశంగా మారింది.