Horoscope Today: 2024 ఏప్రిల్ 28 ఆదివారం రోజున ద్వాదశ రాశులపై మూలా నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు చంద్రుడు ధనస్సు రాశిలో సంచరించనున్నాడు. దీంతో ఓ రాశి ఉద్యోగులు అనేక సమస్యలు ఎదుర్కొంటారు. మరో రాశి వ్యాపారస్తులకు అనుకోలని లాభాలు ఉంటాయి. మేషం నుంచి మీనం వరకు 12 రాశుల వారి ఫలితాలు ఏవిధంగా ఉన్నాయో చూద్దాం..
మేషరాశి:
ఈ రాశి వారికి ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగులు కార్యాలయంలో పనిభారం నుంచి విముక్తి పొందుతారు. వ్యాపారస్తులకు అనుకోని లాభాలు వస్తాయి. మనసు ప్రశాంతంగా ఉంటుంది.
వృషభ రాశి:
కొత్త వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. కుటుంబ సభ్యుల శ్రేయస్సు కోసం కృషి చేస్తారు. ఆర్థికంగా బలోపేతం అవుతారు. డబ్బులను జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి.
మిథునం:
ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. ప్రియమైన వారితో సంతోషంగా ఉంటారు. లక్ష్యాలను చేరడానికి కష్టపడాల్సి ఉంటుంది. విద్యారంగం వారికి అనుకూల ఫలితాలు.
కర్కాటకం:
కొన్ని పనులు సులభంగా పూర్తి చేయగలుగుతారు. తెలివితేటలతో సమాజంలో గుర్తింపు వస్తుంది. కొత్త వస్తువులను కొనుగోలు చేయొచ్చు. శత్రువులు మీ పనికి అడ్డు తగులుతారు.
సింహ:
చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థిక లాభాల కోసం ప్రయత్నాలు చేస్తారు. వ్యాపారస్తులు లాభాల కోసం కృషి చేస్తారు. కొన్ని రంగాల వారి శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి.
కన్య:
ఎవరినీ అతిగా నమ్మకూడదు. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. ఖర్చులు పెరిగే అవకాశం. కొన్ని రంగాల వారికి డబ్బు కొరత ఉంటుంది. మానసికంగా ధ్రుఢంగా ఉంటారు.
తుల:
కొన్ని రంగాల వారు అనుకున్న పనులు పూర్తి చేస్తారు. అనవసర వాదనలకు దిగొద్దు. మానసికంగా శక్తివంతంగా ఉంటారు. ఉద్యోగులుల సీనియర్ల పట్ల జాగ్రత్తగా ఉండాలి.
వృశ్చికం:
వైవాహిక జీవితం సాధారణంగా ఉంటుంది. ఖర్చులు పెరుగుతాయి. ఆదాయం తక్కువ అవుతుంది. వ్యాపారులు పెట్టుబడుల విషయంలో ఇతరుల సలహా తీసుకోవాలి.
ధనస్సు:
ఉద్యోగులు కొన్ని సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. డబ్బు కొరత ఏర్పడుతుంది. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ చూపాలి. ఇష్టమైన ఆహారాన్ని తీసుకోవాలి.
మకర:
ఆాదాయం పెంచుకునేందుకు కష్టపడుతారు. జీవితంలో విజయం సాధించడానికి అనేక పనులు చేయాల్సి వస్తుంది. కొన్ని వస్తువులపై ఎక్కువగా డబ్బు ఖర్చు చేస్తారు.
కుంభం:
కొత్త సంబంధాలు ఏర్పడుతాయి. కొన్ని సంభాషనలు చేయకుండా జాగ్రత్త పడాలి. ఆర్థిక ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయి. భవిష్యత్ లో జరిగే పరిణామాలపై దృష్టిపెడుతారు.
మీనం:
ఉద్యోగులు కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. అనవసరమైన ఆందోళనకు గురవుతారు. ప్రియమైన వారితో సంతోషంగా ఉంటారు. ఎక్కువగా వాదనలు చేయొద్దు.