https://oktelugu.com/

Mahabubabad: భర్తను దేవుడితో సమానంగా భావించి ఏం చేసిందంటే..?

కరోనా మహమ్మారి ఆమె జీవితంలో ఎంతో విషాదాన్ని మిగిల్చింది. కళ్లల్లో పెట్టుకొని చూసుకునే భర్త ఆమెకు దూరం అయ్యాడు. మూడు సంవత్సరాల క్రితం భర్త కోవిడ్ తో చనిపోతే.. ఒంటరిగా నిలిచింది ఆ ఇల్లాలు.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : April 25, 2024 / 01:56 PM IST

    Mahabubabad

    Follow us on

    Mahabubabad: భర్తలను కూడా దేవుడిగా కొలిచే వారు ఉంటారు. చిన్న చిన్న సమస్యలకు దూరం పెట్టేవారు ఉంటే.. ఎంత పెద్ద సమస్యలను అయినా ఎదురించి భర్తనే ప్రత్యక్ష దైవం అనుకునే వారు కూడా ఈ రోజుల్లో ఉన్నారు. అలాంటి వారి గురించి తెలిస్తే ఆదర్శ మహిళలు అనిపిస్తుంది. మరి ఇప్పుడు ఒక మహిళ గురించి తెలిస్తే మరింత గ్రేట్ అనిపిస్తుంటుంది. మరి ఆమె గురించి ఓ సారి తెలుసుకోండి.

    కరోనా మహమ్మారి ఆమె జీవితంలో ఎంతో విషాదాన్ని మిగిల్చింది. కళ్లల్లో పెట్టుకొని చూసుకునే భర్త ఆమెకు దూరం అయ్యాడు. మూడు సంవత్సరాల క్రితం భర్త కోవిడ్ తో చనిపోతే.. ఒంటరిగా నిలిచింది ఆ ఇల్లాలు. తీవ్ర మానసిక వేదనకు లోనైనా కూడా దృఢ సంకల్పంతో ముందుకు సాగింది. భర్త రూపం ఎప్పటికీ ఆమె కళ్లముందే కనిపించేలా ఆయన నిలువెత్తు విగ్రహం తయారు చేయించుకుంది.

    భర్త విగ్రహానికి బుధవారం ప్రతిష్టించింది. అయితే ఈ సంఘటన మహబూబాబాద్ మండలం పర్వతగిరి శివారు సోమ్లా తండా లో చోటు చేసుకుంది. ఇదే గ్రామానికి చెందిన కళ్యాణి తన సొంత భూమిలో భర్తకు గుడి కట్టిచ్చింది. బానోతు హరిబాబుతో ఆమెకు 27 సంవత్సరాల క్రితం పెళ్లి జరిగింది. అయితే వీరికి సంతానం లేదు. కోవిడ్ సమయంలో హరిబాబు కూడా మృతి చెందాడు.

    ఆయన రూపం, పేరు చిరస్థాయిగా నిలిచిపోవాలని భావించిన కళ్యాణి సుమారు రూ. 20 లక్షల వ్యయంతో తండాలో గుడి కట్టించింది. రాజస్థాన్ నుంచి విగ్రహం తెప్పించి బుధవారం ఆవిష్కరించింది కళ్యాణి. బంధువులు, స్థానికులతో కలిసి ప్రత్యేక పూజలు కూడా చేయించింది. మరి చూశారు కదా ఇలాంటి వారిని చూస్తే మంచి భార్యలు కూడా ఉన్నారు అనిపిస్తుంటుంది కదా.