China: వింత లేదా విశేషంతో కూడిన ప్రాంతం పర్యాటకంగా రూపాంతరం చెందుతుంది. ప్రభుత్వాలు అభివృద్ధి చేస్తే పర్యాటకులకు అద్భుతమైన ఆనందాన్ని అందిస్తూ ఉంటుంది. ఆ ప్రాంతం పర్యాటకంగా అభివృద్ధి చెందుతుంది. పర్యాటక ప్రాంతాలు మనదేశంలోనే కాదు ప్రపంచంలో కూడా చాలా ఉన్నాయి. ఇక ఇటీవల కాలంలో పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసే పనులు జోరుగా సాగుతున్నాయి. అద్భుతమైన కట్టడాలను హెరిటేజ్ విభాగంలోకి చేరుస్తున్నారు. వాటి పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటున్నారు. తద్వారా ఒకప్పటి సంస్కృతిని.. ఇప్పటి తరానికి తెలిసే ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవానికి పర్యాటకం అనేది పెట్టుబడి లేని వ్యాపారం. దండిగా లాభాలు వచ్చే వ్యవహారం. ఈ పదాలకు అర్ధాన్ని మార్చింది చైనా. ప్రపంచం మొత్తం కూడా ఆశ్చర్యంగా చూసే పని చేసింది. ప్రపంచాన్ని మొత్తం తన వైపు తిప్పుకుంది.
చైనా దేశంలోని గన్స్ ప్రావిన్స్ ప్రాంతంలోని డన్ హువాంగ్ నైట్ మార్కెట్ ఏరియాలో ఆగస్టు 16న ఒక పబ్లిక్ టాయిలెట్ ఏర్పాటయింది. సాధారణంగా పబ్లిక్ టాయిలెట్ అనేది జనాల అత్యవసరాలను తీర్చుతుంది. అయితే ఈ టాయిలెట్ మాత్రం ఊహించిన విధంగా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదిక ప్రకారం.. డన్ హువాంగ్ ప్యూర్ రియల్ పబ్లిక్ కల్చర్ స్పేస్ గా ఈ టాయిలెట్ రూపాంతరం చెందింది.. యునెస్కో ప్రసిద్ధ ప్రాంతంగా గుర్తించిన మోగావో గుహలకు నిలయంగా ఉన్న చారిత్రాత్మకమైన సిల్క్ రోడ్డు లో ఆధునాతన టాయిలెట్ నిర్మించారు.. ఈ టాయిలెట్ ను రెండు అంతస్తులు నిర్మించారు. ఇది డన్ హూ వాంగ్ సంస్కృతిని ప్రతిబింబిస్తుంది.. కుడ్య చిత్రాలు, రాజుల బొమ్మలు, చైనా కల్చర్, అల్ట్రా క్లియర్ గాజు కర్టెన్ లు ఈ టాయిలెట్ లో ఏర్పాటు చేశారు.
ఇక్కడి రెస్ట్ రూములలో యాంటీ బ్యాక్టీరియల్ నర్సింగ్ టేబుల్స్.. పిల్లల భద్రత కోసం ప్రత్యేకమైన సీట్లు.. తల్లి, శిశువులకు ప్రత్యేకమైన గదులు ఉన్నాయి. డ్రింక్ డిస్పెన్సర్లు, వృద్ధులు, దివ్యాంగులు, సందర్శకులకు ప్రత్యేకంగా సౌకర్యాలు కూడా ఉన్నాయి. ఆగస్టు 16న ఈ టాయిలెట్ ను ప్రారంభించారు. ఇందులో అద్భుతమైన సౌకర్యాలు.. అంతకుమించి అనే విధంగా సదుపాయాలు ఉండడంతో ఒక్కసారిగా సోషల్ మీడియా ద్వారా వైరల్ గా మారిపోయింది. అంతేకాదు టూరిస్ట్ స్పాట్ గా రూపాంతరం చెందింది. దీంతో చాలామంది దీని గురించి సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు.” ఇది ఒక ఫైవ్ స్టార్ హోటల్ మాదిరిగా ఉంది. ఇన్ని సౌకర్యాలు కలలు కూడా ఊహించలేదు. గుహలు.. అందమైన చిత్రాలు.. అద్భుతమైన సదుపాయాలు.. ఇందులో ప్రతి ఒక్కటి అద్భుతంగా ఉందని” నెటిజన్లు పేర్కొంటున్నారు..” ఈ టాయిలెట్ లో అనేక సౌకర్యాలు ఉన్నాయి. మీరు లోపలికి ప్రవేశించినప్పుడు అది సమయాన్ని నమోదు చేస్తుంది. మీరు ఎన్ని నిమిషాలు ఉన్నారో కూడా చూపిస్తుంది. ఐదు నిమిషాలు దాటిన తర్వాత.. మీరు ఎక్కువ సేపు లోపల ఉన్నారని హెచ్చరిస్తుంది. ఆ తర్వాత డిస్ ప్లే రంగు కూడా మారుస్తుందని” ఓ నెటిజన్ పేర్కొన్నారు.
View this post on Instagram