Viral Video: పురాతన తవ్వకాలపై కొందరికి చాలా ఆసక్తి ఉంటుంది. అదేపనిగా తవ్వకాలు జరుపుకుంటారు. మెటల్ డిటెక్టర్లతో వెతుకులాడుతుంటారు. మరికొందరు కొత్త విషయాలను తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తుంటారు. ఇటీవల ఈ పురాతన తవ్వకాలకు సంబంధించి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. యూట్యూబ్ లో వింతలు విశేషాల పేరిట ఈ వీడియోలు దర్శనమిస్తుంటాయి. ప్రధానంగా పిల్లలు ఎంతో ఆసక్తిగా ఈ వీడియోలను తిలకిస్తుంటారు. కొత్త విషయాలు తెలుసుకోవాలని ప్రయత్నించేవారు సైతం ఈ వీడియోలను ఎక్కువగా చూస్తుంటారు. తాజాగా ఈ పురాతన తవ్వకాలకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
పోడు భూమిలో పురావస్తు తవ్వకాలపై ఆసక్తి ఉన్న వ్యక్తి మెటల్ డిటెక్టర్ తో వెతుకుతుంటాడు. ఎదురుగా పెద్ద బండరాయి కనిపిస్తుంది. దాని కింద ఏదో అరుదైన అవశేషం ఉందని డిటెక్టర్ లో సంకేతాలు వస్తాయి. దీంతో అక్కడికి ఓ ట్రాక్టర్ ను తీసుకొచ్చి.. ఆ బండ రాయిని పక్కకు జరిపి.. మట్టిని తవ్వుతారు. అక్కడ అరుదైన అద్భుతాన్ని బయటకు తీస్తారు. అయితే అదో వింత రాయిగా కనిపిస్తుంది. దానికి ఒక రంధ్రం ఉంటుంది. దాని నుంచి పసుపు ధార పడుతూ ఉంటుంది. ఆ రాయిని రెండుగా బద్దలు కొట్టి చూడగా.. అందులో పసుపు లాంటి పొడి ఎక్కువగా కనిపిస్తోంది. అయితే అది ఏంటో తెలియదు కానీ.. ప్రస్తుతం ఈ వీడియో మాత్రం వైరల్ అవుతోంది.
సాధారణంగా లంకెల బిందె కోసమో.. బంగారం లభ్యమవుతుందోనని ఎక్కువమంది ఈ తవ్వకాలు చేస్తుంటారు. అయితే ఈ వీడియోలో మాత్రం.. కేవలం పసుపు లాంటి పొడి మాత్రమే ఈ తవ్వకాల్లో బయటపడటం విశేషం. కనీసం ఆ పొడి ఏంటి? దాని లక్షణాలు ఏంటి? అన్నది మాత్రం తవ్వకాలు చేపట్టిన వ్యక్తి బయట పెట్టలేదు. కానీ ఏదో అది మహిమ గల పసుపు అని వీక్షకులు ఒక అంచనాకు వస్తున్నారు. దాని గురించి తెలుసుకునే క్రమంలో వైరల్ చేస్తున్నారు. కానీ అదేంటన్నది నిర్దిష్టంగా తెలియడం లేదు. ఎవరూ ధ్రువీకరించడం లేదు.