Unique Wedding : పెళ్లిళ్ల సీజన్ మళ్లీ ప్రారంభం కానుంది. ప్రతి ఒక్కరూ పెళ్లి తమ జీవితంలో గుర్తుండిపోయే విధంగా జరుపుకోవాలని కోరుకుంటారు. పెళ్లిళ్లు ఒక్కో దగ్గర ఒక్కో విధంగా వారి సంప్రదాయాలా ప్రకారం జరుగుతాయి. కొన్ని చోట్ల వింత వింత ఆచారాలు ఉంటాయి. వాటిని వింటేనే ప్రజలు ఆశ్చర్యంతో తలలు పట్టుకుంటారు. భారతదేశం గురించి మాట్లాడుకుంటే, వివిధ రాష్ట్రాలు వేర్వేరు వివాహ సంప్రదాయాలను కలిగి ఉంటాయి. అయితే ప్రతి చోట ఒక ఆచారం సర్వసాధారణం. అది – బూట్లు దొంగిలించడం. పెళ్లి రోజున వధువు తరపు వారు వరుడి చెప్పులు, లేదా బూట్లను దొంగిలిస్తారు. మంచి ఒప్పందం కుదిరే వరకు దానిని తిరిగి ఇవ్వరు. అయితే, ఈ సంప్రదాయం చాలా ఆనందకరమైన వాతావరణంలో జరుగుతుంది.
వివాహానికి సంబంధించిన అనేక వింత సంప్రదాయాలు ఉన్నాయి. వీటిని శుభప్రదంగా భావిస్తారు. భారతదేశంలోనే కాదు ప్రపంచంలోని అనేక దేశాలలో వివాహానికి సంబంధించిన వింత సంప్రదాయాలు, ఆచారాలు ఉన్నాయి. కొన్నిసార్లు ఉట్లు కొట్టడం దగ్గర నుంచి కొన్నిసార్లు పారిపోవడం వరకు వింత వింత ఆచారాలు ఉంటాయి. విచిత్రంగా కొన్ని చోట్ల ఏకంగా వధూవరులు కలిసి కూర్చుని మద్యం సేవించడం. ఈ రోజు వెనిజులాలో జరిగే అలాంటి ఒక వింత వివాహ ఆచారం గురించి తెలుసుకుందాం.
షాహిలో వధూవరులు కనిపించరు.
వెనిజులాలో వివాహం తర్వాత ఒక ప్రత్యేకమైన సంప్రదాయం నిర్వహిస్తారు. ఇక్కడ ఒక వివాహానికి వెళితే వధూవరులను కూడా చూడలేకపోవచ్చు. ఆశ్చర్యపోకండి… భారతదేశం లాగే, ఇక్కడ కూడా చాలా మంది అతిథులను వివాహానికి ఆహ్వానిస్తారు. అతిథులు పెళ్లికి చేరుకున్నప్పుడు వారికి అక్కడ వధూవరులు కనిపించరు. ఇది చాలా వింతగా అనిపిస్తుంది,.. కానీ ఇక్కడి ప్రజలు దీనిని శుభప్రదంగా భావిస్తారు.
వధూవరులు పారిపోతారు
ఈ వెనిజులా సంప్రదాయం ప్రకారం.. పెళ్లి రోజున వధూవరులు కలిసి పారిపోవాలి. నిజానికి, పెళ్లికి అతిథులు వచ్చినప్పుడు వారిని సాదరంగా స్వాగతిస్తారు. మనం అతిథులను గౌరవంగా ఆహ్వానించినట్లే, వారిని కూడా అదే గౌరవంగా పంపించాలి.. కానీ వెనిజులాలో అలా జరగదు. ఇక్కడ కొత్తగా పెళ్లైన జంట తమ అతిథులకు వీడ్కోలు చెప్పకుండానే వివాహ వేడుక నుండి నిశ్శబ్దంగా వెళ్లిపోతారు. అయితే, ప్రజలు దానిని కూడా పట్టించుకోరు. ఈ సంప్రదాయం కొత్తగా పెళ్లైన జంట జీవితంలో అదృష్టాన్ని తెస్తుందని ఇక్కడ నమ్ముతారు.