Viral Video: తవ్వకాలు జరుపుతున్నప్పుడు.. పొలాలు దున్నుతున్నప్పుడు.. భూమి చదును చేస్తున్నప్పుడు.. ఇంటి నిర్మాణానికి పునాదులు తవ్వుతున్నప్పుడు, పురాతన ఇళ్లు, భవనాలు కూల్చివేస్తున్నప్పుడు నిధులు, నిక్షేపాలు బయట పడిన ఘటనలు చూస్తుంటాం. ఇక గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపినప్పుడు కూడా కొందరికి విలువైన నిధి దొరికిన ఘటనలూ ఉన్నాయి. ఇలా బయటపడిన నిధి రాచరిక కాలానికి చెందినది అయితే దానిని ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా స్వాధీనం చేసుకుంటుంది. ఆ నిధి పూర్వీకులది అయితే దొరికిన కుటుంబానికి 1/5 వంతు వాటా ఇస్తారు. ప్రభుత్వానికి తెలియకుండా కాజేయాలని చూస్తే.. కేసులు నమోదు చేస్తారు. తాజాగా జేసీబీతో తవ్వకాలు జరుపుతుండగా.. నిధి బయటపడింది. దీనిని చూసి అంతా ఆశ్చర్యపోయారు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
స్లాబ్ కింద.. బరువైన లోహం..
జేసీబీతో కాంక్రీట్ స్లాబ్‌ను బయటకు తీస్తున్న క్రమంలో మెషీన్ ఆపరేటర్ జేసీబీ కొమ్ముతో స్లాబ్ బయటకు తీయడానికి యత్నిస్తూ దానిని పైకి లేపాడు. దానికింద ఉన్న లోహాన్ని చూసి అక్కడున్నవారు ఆశ్చర్యపోయారు. ఓ బంగారు వస్తువు దాని కింద కనిపించింది.
స్పష్టంగా కనిపించక..
ఇక ఈ వీడియోలో తవ్వకం తర్వాత కనిపించిన లోహం బంగారంలా మెరుస్తూ కనిపించింది కానీ, అది ఏమిటో స్పష్టంగా మాత్రం తెలియలేదు. వీడియోలో కూడా బాణం గుర్తుతో దానిని చూపించారు కానీ, అదేంటో తెలుపలేదు. యంత్రంతో నిధిని వెలికితీసినట్లు క్యాప్షన్‌లో పేర్కొన్నారు.
నెట్టింట వైరల్..
ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇప్పటికే ఈ వీడియోను 8 మిలియన్లకుపైగా వీక్షించారు. ఇక ఈ వీడియో ఎక్కడిదో కూడా తెలియదు. కొందరు ఈ వీడియోను ఫేక్ అని కామెంట్ చేస్తుండగా, కొందరు అందులో ఏముందని ప్రశ్నిస్తున్నారు. కొందరు పార్ట్–2 వీడియో కావాలని కోరారు. కొందరేమో గొల్డెన్ ట్రూడ్ అని పేర్కొన్నారు.
View this post on Instagram