Age gap love story: రోజురోజుకు సమాజం పెడపోకడలు పోతోంది. అనైతిక సంబంధాలను ఒంట పట్టించుకుంటూ దారుణాలకు పాల్పడుతుంది. మంచి, చెడు విచక్షణలు కోల్పోతూ అడ్డగోలు వ్యవహారాలకు పాల్పడుతోంది. ఈ విధానాలు మంచివి కాకపోయినప్పటికీ.. సమాజం దృష్టిలో చెడ్డవాళ్లం అవుతామని తెలిసినప్పటికీ.. ఎవరూ ఆగడం లేదు. పైగా వయసు భేదాన్ని కూడా పట్టించుకోవడం లేదు.
మన పెద్దలు ఏదైనా సంబంధం కొనసాగాలంటే వయసు బేధం కచ్చితంగా ఉండాలి అంటారు. పురుషులకు కాస్త ఎక్కువ వయసు ఉండాలని.. మహిళలకు తక్కువ వయసు ఉండాలని చెబుతుంటారు. కానీ నేటి కాలంలో అలాంటి పరిస్థితులు లేవు. పైగా అనైతిక వ్యవహారాలకు పాల్పడేవారు వయసును కూడా లెక్కచేయడం లేదు. వయసును పక్కనపెట్టి.. చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. పైగా కుటుంబ సభ్యులను.. బంధాలను తెంచుకుంటూ స్వేచ్ఛ విహంగాల మాదిరిగా విహరిస్తున్నారు. అటువంటి సంఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని ఝాన్సీ ప్రాంతంలో జరిగింది.. ఈ సంఘటన ఆ రాష్ట్రంలోనే సంచలనం సృష్టించింది.
ఝాన్సీ లోని మౌరానిపూర్ ప్రాంతంలో సుఖవతి అనే మహిళ. ఈమెకి దాదాపు 50 కి పైగా సంవత్సరాల వయసు ఉంటుంది. భర్త, పిల్లలు ఉన్నారు. ఆమె పిల్లలకు పెళ్లిళ్లయి మనవళ్ళు కూడా కలిగారు.. ఈ వయసులో భర్త తో కలిసి మిగతా జీవితాన్ని మనవళ్లతో గడపాల్సిన ఆమె తప్పటడుగులు వేసింది. కుటుంబాన్ని.. బంధాలను లెక్కచేయకుండా అడ్డదారులు తొక్కింది. అది కాస్త ఆమె జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేసింది.
సుఖవతి తనకంటే వయసులో అత్యంత చిన్నవాడైన ఓ యువకుడి తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం ఆమె భర్త ప్రసాద్ కు తెలిసింది. దానికి అతడు వారించాడు.. ఇలాంటి వ్యవహారం తప్పని మందలించాడు. అయినప్పటికీ సుఖవతి తప్పుకోలేదు. తప్పని భావించలేదు. పైగా అతడితో కలిసి వెళ్ళి పోయింది. వెళ్తూ వెళ్తూ డబ్బు, నగలు కూడా తీసుకెళ్లింది. దీనిపై ప్రసాద్ సుఖవతి, ఆమె ప్రియుడు అమర్ సింగ్ పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కుటుంబ మర్యాదలు కాపాడాల్సిన మహిళ ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అని అక్కడి ప్రజలు చర్చించుకుంటున్నారు.
क्या प्रेम वास्तव में उम्र, जिम्मेदारियों और सामाजिक सीमाओं से परे हो सकता है?
झांसी की सुखवती ने 40 की उम्र में अपने परिवार, बच्चों और जिम्मेदारियों से मुंह मोड़कर प्रेम का रास्ता चुना।
प्रेम का निर्णय सिर्फ व्यक्तिगत ही नहीं, बल्कि पूरे परिवार और समाज पर गहरी छाप छोड़ता है।… pic.twitter.com/DdjaU568XB
— (@Murti_Nain) October 4, 2025