363 Bishnois sacrifice: ఒక చెట్టు వందల మంది ప్రాణాలను కాపాడుతుంది అని అంటారు. అందుకే చాలామంది మొక్కలను నాటాలని ఉద్యమం చేస్తారు. కానీ ఒక చెట్టు కోసం 300 మందికి పైగా మరణించారు అంటే ఎవరైనా నమ్ముతారా..? ప్రస్తుత కాలంలో మనుషులను మనుషులే నమ్మడం లేదు.. కానీ ఒకే ఒక చెట్టు కోసం ఒక కుటుంబంతో పాటు 300 మంది ప్రాణత్యాగం చేశారు. ఆ చెట్టు కోసం ప్రాణత్యాగం చేయడంతో ఆ చెట్టు రాష్ట్రీయ వృక్షంగా మారింది. అంతేకాకుండా ఆ ఊరిలో ఈ చెట్ల వనం ఏర్పడింది. ఇంతకీ ఒక చెట్టు కోసం ఇంతమంది ప్రాణాలు తీసుకున్న వారు ఎవరు? అసలు ఏం జరిగింది?
రాజస్థాన్ రాష్ట్రీయ వృక్షం ఖేజ్రీ. ఇది రాష్ట్రస్థాయి చెట్టుగా మారడానికి దీని వెనుక ఎంతో కథ ఉంది.. ఈ కథలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. రాజస్థాన్ రాష్ట్రంలో ఎడారి మధ్యలో ఉండే ఈ చెట్టు కేవలం ప్రజలకు మాత్రమే కాకుండా పశువులకు, ఆహారం, నేలకు పోషణ ఇచ్చే చెట్టుగా మారింది. అయితే ఈ చెట్టు ఇలా మారడం వెనక ఒక భయానక కథ ఉంది. 1730 సంవత్సరంలో జోద్ పూర్ మహారాజు జస్వంత్ సింగ్ తన రాజమహల్ నిర్మాణానికి అవసరమైన చెక్క కోసం సైనికులను సమీపంలోని ఎడారి గ్రామానికి పంపారు. అయితే అక్కడ ఉన్న ఖేజ్రీ చెట్టును కోయాలని సైనికులు భావించారు. కానీ ఆ గ్రామంలో ఉన్న బిస్నోయ్ కమ్యూనిటీకి చెందినవారు ఈ చెట్టు కోయడాన్ని అడ్డుకున్నారు. వీరిలో ముందుగా అమృతా దేవి అనే మహిళ ఈ చెట్టును కౌగిలించుకొని నరకవద్దని సైనికులను కోరింది. అయినా కూడా వినకుండా సైనికులు ఆమెను క్రూరంగా చంపేస్తారు. ఆ తర్వాత ఆమె కుమార్తెలు అసు, రత్ని లు సైతం ఆ చెట్టు కోసం ముందుకు వస్తారు. వారిని కూడా సైనికులు చంపేస్తారు. అలా గ్రామంలోని ఒక్కొక్కరు ముందుకు వచ్చి చెట్టును కాపాడడానికి తమ ప్రాణాలను తీసుకుంటారు. మొత్తంగా 363 మంది తమ ప్రాణాలను కోల్పోతారు. ఇలా ఒక చెట్టు కోసం 363 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం జోధాపూర్ రాజు కు తెలుస్తుంది. దీంతో సైనికులను వెనక్కి రమ్మని ఆదేశిస్తాడు. అప్పటినుంచి ఆ చెట్టును దేవతగా భావిస్తూ వస్తున్నారు.
ఇలా ఏ చెట్టుకు ఉన్న ప్రాధాన్యతను గుర్తించిన ప్రభుత్వం 1982 83వ సంవత్సరంలో రాష్ట్ర వృక్షంగా ప్రకటించారు. ఇది మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో ఉంటుంది. దీనిని ఘఫ్ ట్రీ అని కూడా పిలుస్తారు. పర్యావరణం కోసం ఉద్యమం చేసే వారిలో బిస్నోయ్ తొలి ఉద్యమంగా నిలిచింది. అంతేకాదు ఈ సంఘటన భారతదేశంలోని కాకుండా ప్రపంచవ్యాప్తంగా చెట్ల కోసం ఉద్యమించే వారిలో ప్రేరణ కల్పించింది.