Ale Gaucha viral news: ఎత్తుకు ఎత్తు.. సౌష్టవానికి సౌష్టవం.. రంగుకు రంగు.. నీలి కళ్ళతో అందానికే అసూయ పుట్టే విధంగా ఉంటుంది. ఓర చూపులు చూస్తే ఎంతటి గుండెలైనా సరే బేజారు కావాల్సిందే. ఎంతటి మగాళ్లు అయినా సరే ఫిదా అవ్వాల్సిందే. కానీ ఇన్ని లక్షణాలు ఉన్నప్పటికీ ఈ యువతికి ఏదీ కలిసి రావడం లేదు. దాదాపు ఇప్పటివరకు 50 ఇంటర్వ్యూలకు వెళ్లింది.. అయినప్పటికీ ఒక్క ఉద్యోగమూ దక్కలేదు. నైపుణ్యం ఉంది.. అర్హత కూడా ఉంది.. ఇన్ని ఉన్నప్పటికీ ఈమెకు ప్రధాన అవరోధం అందమే.
బ్రెజిల్ దేశానికి చెందిన అలే గౌచా అనే 21 సంవత్సరాల యువతి ఉంది. ఈమె ఉన్నత చదువులు చదివింది.. ఈమె కేర్ టేకర్ పోస్ట్ కోసం దరఖాస్తు చేసుకుంది. అందంతోపాటు ఆకర్షణీయంగా ఉండడంతో ఈమెను ఎవరూ నియమించుకోవడం లేదు. వాస్తవానికి ఈ స్థాయిలో అర్హతలు ఉంటే ఎవరైనా సరే ఉద్యోగాన్ని సాధిస్తారు. నియమించుకునే వారు కూడా బ్రహ్మాండంగా జీతాలు ఇచ్చి ఉద్యోగంలోకి తీసుకుంటారు. కానీ గౌచా కు ఉద్యోగం దక్కకపోవడానికి ప్రధాన కారణం ఆమె అందమేనట. ఈమె అందం వల్లే ఉద్యోగంలోకి ఎవరూ తీసుకోవడం లేదని తెలుస్తోంది. ఈమెను ఉద్యోగంలోకి తీసుకుంటే వివాహేతర సంబంధాలు ఏర్పడతాయని ఇంట్లో మహిళలు భయపడుతున్నారని తెలుస్తోంది.. ఉద్యోగం లభించకపోవడంతో ఆమె కంటెంట్ క్రియేటర్ (వయోజనులు) గా మారింది.
Also Read: కిలాడి లేడి.. బడా బాబులే టార్గెట్.. రెండేళ్లలో 600 కోట్లు..
వయోజనుల కంటెంట్ క్రియేటర్ గా మారడంతో గౌచా భారీగానే సంపాదిస్తోంది. వయోజనుల కంటెంట్ క్రియేటర్ ద్వారా ఆదాయం స్థిరంగా ఉండదు. కొన్ని సందర్భాలలో ఆదాయం పడిపోతుంది. మరికొన్ని సందర్భాలలో ఆదాయం పెరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ అది స్థిరమైన కెరియర్ కాకపోవడంతో గౌచా తీవ్రంగా ఇబ్బంది పడుతోంది. మరోవైపు గౌచా అందంగా ఉండడంతో తమ ఇంట్లో మగవారు ఆమెకు ఆకర్షితులవుతారని మహిళలు భయపడుతున్నారు. కేర్ టేకర్ గా ఆమెకు అవకాశం కల్పిస్తే.. ఆ తదుపరి తాము ఇబ్బంది పడాల్సి ఉంటుందని వాపోతున్నారు. అర్హతలు ఉన్నా.. అంతకుమించి అనే స్థాయిలో అందం కూడా ఉన్నా ఉద్యోగం లభించకపోవడంతో గౌచా పడుతున్న ఇబ్బంది అంతా ఇంతా కాదు. దీనినే అన్నీ ఉన్నప్పటికీ అల్లుడి నోట్లో శని అంటారేమో.