Lady Scammer: ఆ మధ్య నెల్లూరు జిల్లాలో ఓ కిలాడీ లేడీ గురించి కథలు కథలుగా మీడియాలో కథనాలు వచ్చాయి గుర్తుందా.. ఓ నేరస్థుడిని బెయిల్ మీద బయటకు తీసుకొచ్చినందుకు ఆమెను పోలీసులు బొక్కలో వేశారు. ప్రస్తుతానికి ఆమె విచారణ ఖైదీగా ఉంది. ఏకంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రభావితం చేసే విధంగా ఉన్న ఆ కేసు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే సంచలనంగా మారింది. అయితే తెలంగాణలో ఇంతకుమించిన వైట్ కాలర్ కేసు ఒకటి బయటికి వచ్చింది. ఈ ఘటనలో అందరూ హై ప్రొఫైల్ వ్యక్తులే బాధితులు. పైగా ఆ లేడి 600 కోట్లకు అందరిని ముంచింది. దీంతో తెలంగాణ రాష్ట్రంలో ఒక్కసారిగా సంచలనం నమోదయింది.
Also Read: 22 రోజుల్లో 260 కోట్లు..కానీ తెలుగు లో ‘కొత్త లోక’ కి వచ్చిన వసూళ్లు ఇంతేనా?
ఆ లేడీ హైదరాబాదులోని అత్యంత ఖరీదైన బహుళ అంతస్తుల భవనంలో ఉంటున్నది. హైదరాబాద్ నగరంలోనే ఆ బహుళ అంతస్తుల భవనం అత్యంత గొప్పదిగా పేరుపొందింది. అందులో నివాసం ఉంటున్న ఆ లేడీ.. మొదటి నుంచి కూడా మోసగత్తెగానే పేరుపొందింది. ఆ బహుళ అంతస్తులో నివాసముండే పెద్ద పెద్ద వ్యక్తులను టార్గెట్ గా చేసుకుంది. వారికి మాయమాటలు చెప్పింది. తన అంద చందాలతో దగ్గరయింది. వారితో అత్యంత సన్నిహితంగా ఉన్నప్పుడు వీడియోలు, ఫోటోలు తీసుకుంది. వాటిని చూపించి దండిగా డబ్బులు వసూలు చేసింది. కేవలం మగవాళ్ళు మాత్రమే కాదు.. ఆడవాళ్లకు కూడా దగ్గరయింది. కిట్టి పార్టీలు నిర్వహిస్తూ వారితో పరిచయం పెంచుకుంది. ఖరీదైన హోటళ్ళ లో విందులు వినోదాలు ఇవ్వడం మొదలుపెట్టింది. దీంతో ఆమె మాయలో పెద్ద స్థాయి వ్యక్తుల భార్యలు కూడా పడిపోయారు. చివరికి వారు కూడా మోసపోయారు. ఇలా రెండు సంవత్సరాల కాలంలో ఏకంగా 600 కోట్లు వసూలు చేసింది కిలాడి లేడి. ఆమె చేతిలో మోసపోయిన వారిలో ఐఏఎస్, ఐపీఎస్, వారి భార్యలు, బ్యూరోక్రాట్లు, పొలిటిషన్లు ఉన్నారు. పెద్ద పెద్ద వ్యాపారులకే ఆ లేడీ మస్కా కొట్టింది. వారితో ఉన్న సన్నిహిత వీడియోలను బయటపెడతానని చెప్పి అడ్డగోలుగా దండుకుంది.
వాస్తవానికి ఈ వ్యవహారం ఓ బ్యూరోక్రాట్ బయటపెట్టారు. ఆయనతో ఈ మోసగత్తే అత్యంత సన్నిహితంగా ఉంది. అయితే ముందుగానే ఆమె పన్నాగాన్ని పసిగట్టిన అతడు దూరం పెట్టాడు. అంతేకాదు ఈ విషయాన్ని ఆ బహుళ అంతస్తులో ఉండే వారికి చెప్పాడు. దీంతో అందరూ తాము మోసపోయిన విషయాన్ని గుర్తించారు. అయితే దీనికి సంబంధించి ఇంతవరకు పోలీసులకు ఎటువంటి ఫిర్యాదు రాలేదని తెలుస్తోంది. మోసపోయిన వారు హై ప్రొఫైల్ వ్యక్తులు కావడంతో ఈ విషయాన్ని బయటికి రాకుండా చూస్తున్నట్టు సమాచారం. అయితే ఆ కిలాడి లేడి డబ్బులు వసూలు చేసి ఏం చేసింది? ఎక్కడ పెట్టుబడి పెట్టింది? దీని వెనుక ఉన్నది ఎవరు? ఆ వీడియోలు మొత్తం ఏం చేసింది? ప్రశ్నలకు ఇప్పుడు సమాధానం లభించాల్సి ఉంది.