African King Mswati: నేటి కాలంలో ఈడొచ్చిన మగ పిల్లలకు పెళ్లిళ్లు కావడం అత్యంత కష్టమవుతోంది. ఆడపిల్లలు దొరకక చాలా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. కొన్ని సామాజిక వర్గాలలో అయితే వివాహాలు కావడం లేదు. దీంతో ఈడొచ్చిన మగపిల్లలు ఆ జన్మ బ్రహ్మచారులు గానే మిగిలిపోతున్నారు. కొందరైతే సామాజిక వర్గంతో సంబంధం లేకుండా ఎదురు కట్నం ఇచ్చి మరీ పెళ్లి చేసుకుంటున్నారు. జీవితానికి ఒక తోడు ఉండాలని భావించి ఆ పని చేస్తున్నారు. కానీ ఇప్పుడు మీరు చదువబోయే ఈ కథనంలో ఓ వ్యక్తి ఒకరు కాదు, ఇద్దరు కాదు.. ఏకంగా 15 మందిని పెళ్లి చేసుకున్నాడు. వారి ద్వారా 36 మంది పిల్లల్ని కన్నాడు.
సోషల్ మీడియాలో సర్కులేట్ అవుతున్న వీడియో ప్రకారం ఆఫ్రికా ఖండంలోని ఈస్వాటిని దేశాన్ని మస్వాటి -111 అనే రాజు పరిపాలిస్తున్నాడు. ఇతడికి 15 మంది భార్యలు. వారి ద్వారా అతడు 36 మంది పిల్లల్ని కన్నాడు. అంతేకాదు తను ఎక్కడికి వెళ్లినా సరే వందమంది సర్వెంట్లతో కలిసి బయలుదేరుతుంటాడు. 1986 నుంచి ఆ దేశాన్ని ఇతడు పరిపాలిస్తున్నాడు. ఇతడి సంపద ఏకంగా 1 బిలియన్ డాలర్లకు చేరుతుందని తెలుస్తోంది. ఆ దేశంలో 60 శాతానికి మంది పైగా ప్రజలు దారిద్ర్య రేఖకు దిగువన నివసిస్తున్నారు. రాజ కుటుంబం మాత్రం ప్రైవేటు విమానాలలో తిరుగుతోంది. అత్యంత విలాసవంతమైన జీవితాన్ని గడుపుతోంది. తన భార్యలకు అద్భుతమైన విలాసాలు ఉన్న భవనాలను రాజు నిర్మించాడు. ఒక్కో భార్యకు ఒక్కో భవనాన్ని కానుకగా ఇచ్చాడు. అవన్నీ కూడా ప్రజల సొమ్ముతో నిర్మించినవే.
ఈ దేశంలో పన్నులు కూడా అధికంగా ఉంటాయని తెలుస్తోంది. ఈ ప్రాంతంలో మెజారిటీ ప్రజలకు వ్యవసాయమే జీవనాధారం. అయితే కరువు ప్రాంతం కావడంతో వర్షాలు ఎప్పుడో ఒకసారి కురుస్తుంటాయి. వర్షం వల్ల వచ్చిన వాన నీటిని అక్కడ ప్రజలు జాగ్రత్తగా ఉపయోగించుకుంటారు. జంతువుల పెంపకం.. కుల వృత్తులు ఇక్కడి ప్రజల ప్రధాన జీవనాధారంగా ఉన్నాయి. అయితే సౌకర్యాలు కల్పనలో ఈ రాజు అంతగా ఆసక్తి చూపించడు. పైగా తన రాజ దర్పాన్ని ప్రదర్శించడానికి ఏ మాత్రం వెనుకాడడు.
ఈ రాజు తండ్రి పేరు సోభుజ. అతడికి 125 మంది భార్యలు ఉండేవారు. అతడు కూడా చాలా సంవత్సరాల పాటు ఈ రాజ్యాన్ని పాలించాడు. 125 మంది భార్యలతో అత్యంత విలాసవంతమైన జీవితాన్ని అతడు గడిపేవాడు. అయితే ప్రస్తుతం పరిపాలిస్తున్న రాజు ఏ భార్య కొడుకో తెలియడం లేదు. ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతం పరిపాలిస్తున్న రాజు తన అందరి భార్యలతో కలిసి విదేశాలకు వెళ్తుంటాడు. అందరితో పాటు కలిసి ఉంటాడు. కొన్ని సందర్భాలలో అందరితో కలిసి పడక సుఖాన్ని అనుభవిస్తాడని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే అంత మంది భార్యలను ఎలా మేనేజ్ చేస్తున్నారు.. వారి మధ్య గొడవలు రాకుండా ఎలా చూస్తున్నారు అని విలేకరులు ప్రశ్నిస్తే.. “వారికి నిత్యం నేను ప్రేమను పంచుతూనే ఉంటాను. వారికి కావలసినవన్ని సమకూర్చుతూ ఉంటాను. ఎక్కడికి వెళ్లినా సరే వారితో పాటే ప్రయాణిస్తుంటాను. అలాంటప్పుడు వారి మధ్య విభేదాలు ఎందుకు వస్తాయి” అని ఆ రాజు సమాధానం చెప్పాడు. దీంతో ఆశ్చర్యపోవడం విలేకరుల వంతయింది.