NRI News : సింగపూర్‌లో వాసవీ జయంతి.. తరలివచ్చిన తెలుగువారు!

సాంస్కృతిక కార్యక్రమాల అనంతరం వాసవి మాతకు కుంకుమార్చన నిర్వహించారు. అమ్మవారికి అభిషేకం, ప్రత్యేక అలంకరణతో సేవించారు. అనంతరం జరిగిన రథయాత్రలో భక్తులు పాల్గొన్నారు.

Written By: NARESH, Updated On : May 21, 2024 11:55 am

Vasavi Jayanti in Singapore under Telugu leadership

Follow us on

NRI News : వాసవి క్లబ్‌ మెర్లయిన్‌ సింగపూర్‌(వీసీఎంఎస్‌) ఆధ్వర్యంలో, వాసవి జంయంతి పూజ కార్యక్రమాలు మే 18 వైభవంగా నిర్వహించారు. శ్రీమారియమ్మన్‌ దేవాలయంలో జరిగిన వేడుకల్లో 400 మందికిపైగా ఆర్యవైశ్యులు పాల్గొని భక్తితో పూజలు చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. సింగపూర్‌ తెలుగు సమాజం మాజీ అధ్యక్షుడు రంగా రవికుమార్, కర్నాటి శేష, వీసీఎంఎస్‌ ప్రతినిధి బృందం మురళీకృష్ణ, సుమన్‌ రాయల, ముక్క కిశోర్‌ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. దేవాదాయ శాఖకు చెందిన బొబ్బ శ్రీనివాస్‌ ముఖ్య అతిథిగా విచ్చేశారు.

అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు..
చిన్నారి సాయి కౌశల్‌గుప్తా గణపతి ప్రార్థనతో సాంస్కృతిక కార్యక్రమాలు మొదలయ్యాయి. మౌల్య కిశోర్‌శెట్టి, మేదం సిద్దిశ్రీ ముక్తిధ, నంబూరి ఉమా మోనిష, చిన్న హష్మిత, చైతన్య నంబూరి శాస్త్రీయ నృత్యం చేశారు. తొటంశెట్టి నందసాయి వేణుగానం, కొణిజేటి వెంకట ఇషాన్‌ కృష్ణ గానం అలరిచాయి. కర్లపాటి శిల్ప, నేరెళ్ల నిరంజన, నూలు అర్చిత సాయి కీర్తన, నామ రామాయణాన్ని పారాయణం చేసి ప్రేక్షకులను భక్తి పారవశ్యంలో ముంచెత్తారు. రామాయణం ఇతివృత్తంగా కిశోర్‌కుమార్‌ శెట్టి ఆధ్వర్యంలో ప్రదర్శించిన నాటకాలు మానవ విలువలను తెలియజేశాయి. గాదంశెట్టి నాగసింధు నేతృత్వంలో 28 మంది ఆర్యవైశ్య మమిళలు చేసిన కోలాట నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది. ఫణేష్‌ ఆత్కూరి, వాసవి కన్యకా పరమేశ్వరి తమ వ్యాఖ్యానంతో కార్యక్రమాన్ని రక్తికట్టించారు.

అమ్మవారికి ప్రత్యేక పూజలు..
సాంస్కృతిక కార్యక్రమాల అనంతరం వాసవి మాతకు కుంకుమార్చన నిర్వహించారు. అమ్మవారికి అభిషేకం, ప్రత్యేక అలంకరణతో సేవించారు. అనంతరం జరిగిన రథయాత్రలో భక్తులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని చాలా ఏళ్లుగా నిర్వహిస్తున్న నిర్వాహక బృందం సభ్యుడు ముక్క కిశోర్‌ని కమిటీ సభ్యులు సత్కరించారు.