https://oktelugu.com/

US Student Visa: అమెరికా వెళ్లే విద్యార్థులకు శుభవార్త..

విద్యార్థి వీసా సీజన్‌లో ఆగస్టు చివరి వరకు స్లాట్లు అందుబాటులో ఉంచాలని నిర్ణయించినట్లు అమెరికా రాయబార కార్యాలయం తెలిపింది. చివరి నిమిషంలో వెళ్లే వారికీ ఉపయోగపడేలా ఆగస్టు వరకు ఇంటర్వ్యూలు నిర్వహించాలని నిర్ణయించారు.

Written By:
  • Raj Shekar
  • , Updated On : May 22, 2024 / 10:45 AM IST

    US Student Visa

    Follow us on

    US Student Visa: అమెరికాలో ఉన్నత విద్య చదవాలనుకునే విద్యార్థులకు జూన్, జూలై, ఆగస్టు కోటాకు సంబంధించి మరిన్ని స్టూడెంట్‌ వీసా(ఎఫ్‌–1) ఇంటర్వ్యూ స్లాట్లు విడుదల చేయాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. అమెరికా ఫాల్‌ ఎడ్యుకేషన్‌ సీజన్‌ ఆగస్టు–సెప్టెంబర్‌లో ప్రారంభం అవుతుంది. సాధారణంగా సీజన్‌ చివరి వారంలో ఒక దఫా ఇంటర్వ్యూలో వీసా దరఖాస్తు ఆమోదం పొందని వారికి మరో అవకాశం కల్పిస్తారు. ఈ దఫా ఆగస్టు నెలాఖరు వరకు వీసా స్లాట్లు అందుబాటులో ఉంచాలని నిర్ణయించడం విశేషం.

    ఇంటర్వ్యూలు ప్రారంభం..
    ఇదిలా ఉండా అమెరికా వెళ్లేందుకు ఇప్పటికే స్లాట్లు తీసుకున్న విద్యార్థులకు సోమవారం(మే 20) నుంచి హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్‌ జనరల్‌ కార్యాలయంలో వీసా ఇంటర్వ్యూలు ప్రారంభించారు. ప్రస్తుత సీజన్‌కు సంబంధించిన తొలి విడత ఇంటర్వ్యూ తేదీలను అమెరికా ఈనెల రెండో వారంలోనే విడుదల చేసింది. దీంతో సోమవారం నుంచి ఇంటర్వ్యూలు మొదలయ్యాయి. ఈ దఫాలో భారతీ విద్యార్థులకు ఎక్కువ అవకాశం కల్పించేందుకు దశలవారీగా స్లాట్లు విడుదల చేయనున్నట్లు అమెరికా ఉన్నతాధికారి తెలిపారు.

    ఆగస్టు చివరి వరకు అందుబాటులో..
    విద్యార్థి వీసా సీజన్‌లో ఆగస్టు చివరి వరకు స్లాట్లు అందుబాటులో ఉంచాలని నిర్ణయించినట్లు అమెరికా రాయబార కార్యాలయం తెలిపింది. చివరి నిమిషంలో వెళ్లే వారికీ ఉపయోగపడేలా ఆగస్టు వరకు ఇంటర్వ్యూలు నిర్వహించాలని నిర్ణయించారు. త్వరలో మరిన్ని స్లాట్లు విడుదల చేయనున్నారు. ఢిల్లీ రాయబార కార్యాలయం, హైదరాబాద్, చెన్నై, ముంబయి, కోల్‌కతాలోని కాన్సులేట్‌ జనరల్‌ కార్యాలయాల్లో ఇంటర్వ్యూలు నిర్వహించేందుకు అధికారిక వెబ్‌సైట్లలో స్లాట్లు అందుబాటులో ఉన్నట్లు కాన్సులేట్‌ కార్యాలయం తెలిపింది.

    మే 24 అవగాహన..
    ప్రస్తుత ఫాల్‌ సీజన్‌తోపాటు 2025 ప్ప్రింగ్‌ సీజన్‌లో అమెరికాలో చదువుకోవాలనుకునే విద్యార్థుల కోసం హైబ్రిడ్‌ విధానంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించనన్నట్లు ఎడ్యుకేషన్‌ యూఎస్‌ఏ ఎక్స్‌ వేదికగా ప్రకటించింది. మే 24న ఈ కార్యక్రమం ఉంటుందని తెలిపింది. ఆన్‌లైన్‌లో హాజరు కావాలనుకునేవారు bit.ly/EdUSASVs24 ద్వారా రిజిస్టర్‌ చేసుకోవాలని సూచించింది. హైదరాబాద్‌లో ప్రత్యక్షంగా హాజరయ్యే వారు ఎస్‌.ఎల్‌.జూబ్లీ కాంప్లెక్స్, 4వ అంతస్తు, రోడ్‌ నంబర్‌ 36, జూబ్లీహిల్స్‌లో శుక్రవారం మధ్యాహ్నం మూడు నుంచి నాలుగు గంటల మధ్య హాజరు కావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అమెరికా వీసా కాన్సులర్‌ అధికారి వీసా దరఖాస్తు ప్రక్రియపై అవగాహన కల్పిస్తారు.