spot_img
Homeప్రవాస భారతీయులుUgadi festivals in Canada: కెనడాలో ‘తాకా’ ఆధ్వర్యంలో వైభవంగా శుభకృత్ నామ సంవత్సర ఉగాది...

Ugadi festivals in Canada: కెనడాలో ‘తాకా’ ఆధ్వర్యంలో వైభవంగా శుభకృత్ నామ సంవత్సర ఉగాది ఉత్సవాలు

Ugadi festivals in Canada:  కెనడా లో తెలుగు అలయెన్స్ ఆఫ్ కెనడా (తాకా) ఆధ్వర్యంలో శుభకృత్ నామ సంవత్సర ఉగాది ఉత్సవాలను టొరంటో లో ని టొరంటో పెవిలియన్ వేదికలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 1200 మందికి పైగా కెనడాలోని తెలుగు వారు పాల్గొని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమానికి రేణు కుందెమ్, అనిత సజ్జ, ఖాజిల్ మహమ్మద్, విద్య భవనం వ్యాఖ్యాత లు గా వ్యవహరించారు.

మొదటగా తాకా అధ్యక్షులు కల్పనా మోటూరితోపాటు రంజిత హంసాల, రజిని లయం, గీత దేసు, వీణ మార్పిన గారు జ్యోతి ప్రజ్వలనతో ఉగాది సంబరాలను ప్రారంభించారు. అనంతరం కెనడా -భారత దేశ జాతీయ గీతాలను ఆలపించారు. ఈ కార్యక్రమానికి టొరంటో ఇండియన్ కాన్సులేట్ జనరల్ శ్రీమతి అపూర్వ శ్రీవాస్తవ ముఖ్య అతిథిగా విచ్చేశారు.. అపూర్వ ‘తాకా’ విశిష్టత గురించి , టొరంటోలోని తెలుగు కమ్యూనిటీ కోసం తాకా వారు చేస్తున్న సేవా కార్యక్రమాలు గురించి కొనియాడారు. తాకా అధ్యక్షులు కల్పన మోటూరి, తాకా కార్య వర్గ సంఘం సభ్యులు అపూర్వ శ్రీవాస్తవ ని సత్కరించారు. అలాగే ఈ కార్యక్రమానికి ప్రధాన ధాత అయిన గెట్ హోమ్ రియాల్టీ రమేష్ గొల్లు గారు, ఆనంద్ పేరిచర్ల ను సత్కరించారు. వారికి మొమెంటో అందజేశారు. ఈ సందర్భంగా తాకా కార్యవర్గం తాకా ప్రధాన వ్యవస్థాపక సభ్యులు శ్రీ చారి సామంతపూడి కమ్యూనిటీకి చేస్తున్న పలు రకాల సేవా కార్యక్రమాలని ఎంతగానో ప్రశంసించి చిరు సత్కారంతో గౌరవించారు. తాకా అధ్యక్షులు కల్పన మోటూరి తాకా వ్యవస్థాపకతను వివరిస్తూ తాకా చేస్తున్న కార్యక్రమాలను, ముఖ్యంగా పోయిన రెండు సంవత్సరాలలో జరిపించిన కార్యక్రమాలను వివరించారు.

టొరంటో లో ఉన్న తెలుగు పూజారి శ్రీ మంజునాథ సిద్ధాంతి ఉగాది పంచాంగ శ్రవణం గావించారు. ఈ కొత్త సంవత్సర రాశి ఫలాలను అందరికీ విశదీకరించారు. ఆరు గంటల పాటు దాదాపు 35 సాంస్కృతిక కార్యక్రమాలతో ఉల్లాసంగా.. ఉత్సాహంగా సాగింది. 130 కి పైగా చిన్నారులు పెద్దలు చేసిన తెలుగు సాంస్కృతిక.. చలన చిత్ర నృత్య ప్రదర్శనలు, ఫ్యాషన్ షో, పాడిన గీతాలు అందరినీ అలరించాయి.

ఈ కార్యక్రమ విజయవంతానికి కృషి చేసిన ఉపాధ్యక్షులు నాగేంద్ర హంసాల, కార్యదర్శి ప్రసన్న తిరుచిరాపల్లి, కోశాధికారి మల్లికార్జున చారి పదిర, సాంస్కృతిక కార్యదర్శి రాజారామ్ మోహన్ రాయ్ పుల్లంశెట్టి, డైరెక్టర్స్ అనిత సజ్జ, గణేష్ తెరాల,రాణి మద్దెల, యూత్ డైరెక్టర్స్ విద్య భావనం, ఖాజిల్ మహమ్మద్ మరియు బోర్డు ఆఫ్ ట్రస్టీ చైర్మన్ మునాఫ్ అబ్దుల్, సభ్యులు రాఘవ అల్లం, సురేష్ కూన, వాణి జయంతి, ప్రవీణ్ పెనుబాక మరియు ఇతర వ్యవస్థాపక చైర్మన్ రవి వారణాసి, సభ్యులు చారి సామంతపూడి, అరుణ్ లయం ,లోకేష్ చిల్లకూరు,రమేష్ మునుకుంట్ల, రాకేష్ గరికపాటి, శ్రీనాథ్ కుందూరు, రామ చంద్ర రావు దుగ్గిన మరియు అందరి వాలంటీర్లను తాకా అధ్యక్షులు కల్పన మోటూరి గారు అభినందించారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్వచ్చంధ కార్యకర్తలకు తాకా కార్యవర్గం ధన్య వాదాలు తెలిపింది.. చివరిగా తాకా ఉపాధ్యక్షులు నాగేంద్ర హంసాల, అరుణ్ లయం, తాకా కార్యదర్శి ప్రసన్న తిరుచిరాపల్లి గారు కార్యక్రమంలో పాల్గొన్న తెలుగు వారందరికీ, దాతలకు, అతిధులకు ఇచ్చిన వందన సమర్పణ తో కార్యక్రమం జయప్రదంగా ముగిసింది.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Today 25 July 2026 Horoscope: ఈ నాలుగు రాశుల వారికి ఈరోజు నారాయణుడి ఆశీస్సులు.. పట్టిందల్లా బంగారమే..

Today 25 July 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనివారం ద్వాదశ రాశులపై జ్యేష్ఠ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు తొలి ఏకాదశి సందర్భంగా కొన్ని రాశుల వారికి అనుకోని ధన...

Azim Premji : జీవితానికి సంబధించి అజీమ్ ప్రేమ్ జీ చెప్పిన 5 సూత్రాలివే..

Azim Premji : భారతదేశ ప్రముఖ పారిశ్రామికవేత్త అజీమ్ ప్రేమ్‌జీ వ్యాపార రంగంలో ఎన్నో విజయాలు సాధించారు. ఆయన ధనవంతుడైనప్పటికీ సాదాసీదా జీవనశైలి, క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. యువతకు, వ్యాపారవేత్తలకు స్ఫూర్తినిచ్చేలా...

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...
Oktelugu Epaper
Exit mobile version