https://oktelugu.com/

Scotland: ట్రెక్కింగ్ కు వెళ్లి ఇద్దరు తెలుగు విద్యార్థుల విషాదాంతం

స్కాట్‌లాండ్‌లోని ఓ పర్యాటక ప్రదేశంలో ఇద్దరు తెలుగు విద్యార్థులు ప్రమాదవశాత్తు నీట మునిగి చనిపోయారు. ఈ ఘటన బుధవారం(ఏప్రిల్‌ 16న) సాయంత్రం జరిగింది.

Written By:
  • Raj Shekar
  • , Updated On : April 19, 2024 / 02:58 PM IST

    Scotland

    Follow us on

    Scotland: విదేశాల్లో భారతీయుల మరణాలు కొనసాగుతున్నాయి. అమెరికాలో వేర్వేరు కారణాలతో భారతీయులు మణిస్తుండగా, ఇటీవల కెనడాలో ఓ ఉద్యోగి హత్యకు గురయ్యాడు. తాజాగా స్కాట్‌లాండ్‌లో ఇద్దరు విద్యార్థులు దుర్మరణం చెందారు. తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చారు.

    జలపాతలలో పడి…
    స్కాట్‌లాండ్‌లోని ఓ పర్యాటక ప్రదేశంలో ఇద్దరు తెలుగు విద్యార్థులు ప్రమాదవశాత్తు నీట మునిగి చనిపోయారు. ఈ ఘటన బుధవారం(ఏప్రిల్‌ 16న) సాయంత్రం జరిగింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇద్దరు భారతీయ విద్యార్థులు నీటమునిగి చనిపోయారని, వారి మృతదేహాలను లండన్‌లో భారత హైకమిషన్‌ ప్రతినిధి వెల్లడించారు. వీరిని డూండీ యూనివర్సిటీలో మాస్టర్స్‌ చేస్తున్న చాణక్య బొలిశెట్టి(22), జితేంద్రనాథ్‌ కరుటూరి(27)గా గుర్తించామని తెలిపారు.

    ట్రెక్కింగ్‌ చేస్తుండగా..
    స్కాట్‌లాండ్‌లో ఫేమస్‌ అయిన వాటర్‌ఫాల్స్‌ లిన్‌ ఆఫ్‌ తుమ్మెల్‌ జలపాతం వద్దకు చాణక్య, జితేంధ్రనాథ్‌తోపాటు మరో ఇద్దరు విద్యార్థులు వెళ్లారు. వీరు నలుగురూ డూండి యూనివర్సిటీల్లో మాస్టర్స్‌ చదువుతున్నారు. జలపాతం వద్ద ట్రెక్కింగ్‌ చేస్తున్న క్రమంలో చాణక్య, జితేంద్రనాథ్‌ ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయారు. అక్కడే ఉన్న మరో ఇద్దరు విద్యార్థులు ఎమర్జెన్సీ సర్వీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు, అగ్నిమాపక శాఖ, అంబులెన్స్‌లు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. మృతదేహాలను వెలికి తీశాయి.

    కుటుంబ సభ్యులకు సమాచారం..
    ఈ ప్రమాదంపై భారత కాన్సులేట్‌ జనరల్‌ విద్యార్థుల కుటుంబాలకు సమాచారం అందించారు. వారికి తగిన సహాయాన్ని అందిస్తోంది. అలాగే ఒక కాన్సులర్‌ అధికారి బ్రిటన్‌లో నివసిస్తున్న మృతుడి బంధువును కలిశారు. అటు డూండీ విశ్వవిద్యాలయం కూడా తగిన సాయం చేస్తామని హామీ ఇచ్చింది. పోస్ట్‌మార్టం అనంతరం విద్యార్థుల మృతదేహాలను భారత్‌కు తరలిస్తామని కాన్సులేట్‌ అధికారులు తెలిపారు.