Kitchen Hacks: పప్పులు, బియ్యానికి పురుగులు పడుతున్నాయా? ఇలా సేఫ్ గా ఉంచుకోండి..

ఎక్కువ మొత్తంలో పప్పు ధాన్యాలు, బియ్యం నిల్వ చేయాలి అనుకుంటే ముందుగా డబ్బ అడుగు భాగంలో కొన్ని ఎండిన వేప ఆకులు వేసి నింపండి. వేపాకు క్రిమి కీటక నాశిని. అందుకే వీటివల్ల పప్పులు, బియ్యానికి పురుగులు పట్టవు.

Written By: Swathi, Updated On : April 19, 2024 3:07 pm

Kitchen Hacks

Follow us on

Kitchen Hacks: ఇంట్లో సరుకులు అయిపోతే చాలా మంది ఒకేసారి పెద్ద మొత్తంలో కొనుగోలు చేస్తారు. ఇక సిటీ లో ఉంటే డి మార్ట్, షాపింగ్ మాల్స్ అంటూ ప్రతి నెల కొనుగోలు చేస్తారు. ఇక ఈ బియ్యం, పప్పు ధాన్యాలు పాడవకుండా ఉండాలంటే చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. అయినా కొన్ని సార్లు ఫలితం ఉండకపోవచ్చు. ఒక్కసారి ఇందులో పురుగులు చేరి తినడానికి అసహ్యంగా అనిపిస్తుంటుంది. మరి వీటి విషయంలో చిన్న చిన్న టిప్స్ పాటిస్తే చాలు ఈ పురుగుల బెడద నుంచి ఉపశమనం పొందవచ్చు.

ఎక్కువ మొత్తంలో పప్పు ధాన్యాలు, బియ్యం నిల్వ చేయాలి అనుకుంటే ముందుగా డబ్బ అడుగు భాగంలో కొన్ని ఎండిన వేప ఆకులు వేసి నింపండి. వేపాకు క్రిమి కీటక నాశిని. అందుకే వీటివల్ల పప్పులు, బియ్యానికి పురుగులు పట్టవు. పప్పులు, బియ్యం నిల్వ చేసే డబ్బాల్లో మూడు నాలుగు ఎండు మిరపకాయలు వేసి అలా వదిలివేయండి. పురుగులు దరిచేరవు.

మరో టిప్ కూడా చూసేయండి. అదేంటంటే పప్పులకు పురుగు పట్టకుండా ఉండాలంటే పొట్టు తీయకుండా ఐదారు వెల్లుల్లి రెబ్బలను పప్పులు ఉంచిన డబ్బాలో వేస్తే చాలు. మీ పప్పులు పాడు అవకుండా ఉంటాయి. పప్పుల డబ్బాల్లో అయిదారు లవంగాలను ఉంచి గాలి తగలకుండా మూత పెడితే సరిపోతుంది. ఇలా చేయడం వల్ల కూడా మీ పప్పులు సేఫ్ గా ఉంటాయి.

బియ్యం, పప్పు ధాన్యాలను కొనుగోలు చేసిన తర్వాత వాటిని శుభ్రమైన, ప్లాస్టిక్ డబ్బాల్లో ఉంచాలి. పొడుగు ఉన్న గాజు డబ్బాలో ఉంచిన ఎలాంటి పురుగులు దరిచేరవు. డబ్బాను గట్టిగా మూసి వేయండం, క్రమం తప్పకుండా డబ్బాలను శుభ్రం చేయడం వల్ల కూడా ఎలాంటి సమస్యలు రావు. తడి చేతితో పప్పులను, బియ్యాన్ని ముట్టకుండా ఉండండి. లేదంటే పురుగులు చేరడం, పప్పులు పాడు అవడం జరుగుతుంటాయి. సో కేర్ ఎబౌట్ మీ పప్పులు.