https://oktelugu.com/

Prabhas: ఆ హీరోయిన్ కి పవన్ కళ్యాణ్ హ్యాండిస్తే, ప్రభాస్ ఆఫర్ ఇచ్చాడు…ఇంతకీ ఆ ముద్దుగుమ్మ ఎవరంటే..?

ఈమెకు తెలుగులో క్రేజీ ఆఫర్లు అయితే వచ్చాయి. అందులో పూరి జగన్నాథ్, రామ్ పోతినేని కాంబోలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ ఒకటి. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకున్నప్పటికీ ఆ తర్వాత ఈమెకి పెద్దగా అవకాశాలు రావడం లేదు.

Written By:
  • Gopi
  • , Updated On : April 19, 2024 / 02:56 PM IST

    Prabhas gave an offer to Nidhhi Agerwal

    Follow us on

    Prabhas: సినిమా ఇండస్ట్రీలో ఏ రోజు ఎవరి పరిస్థితి ఎలా ఉంటుందో ఎవరు చెప్పలేరు. ఈరోజు జీరో లో ఉన్న వ్యక్తి రేపు హీరో అవ్వచ్చు. ఈరోజు హీరోలా ఉన్న వ్యక్తి మరుసటి రోజుకి జీరో అయిపోవచ్చు.ఇక్కడ ఏది జరిగిన ఆశ్చర్యపోవాల్సిన అవసరమైతే లేదు. ఇక ఇలాంటి నేపథ్యంలోనే చాలా రోజుల క్రితం ‘సవ్య సాచి’ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన నిధి అగర్వాల్ మొదటి సినిమాతోనే మంచి గుర్తింపును తెచ్చుకుంది.

    ఇక ఆ తర్వాత ఈమెకు తెలుగులో క్రేజీ ఆఫర్లు అయితే వచ్చాయి. అందులో పూరి జగన్నాథ్, రామ్ పోతినేని కాంబోలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ ఒకటి. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకున్నప్పటికీ ఆ తర్వాత ఈమెకి పెద్దగా అవకాశాలు రావడం లేదు. ఇక 4 సంవత్సరాలో క్రితం క్రిష్ డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ హీరోగా హరిహర వీరమల్లు అనే సినిమా స్టార్ట్ అయింది. అయితే ఈ సినిమాలో నిధి అగర్వాల్ మెయిన్ హిరోయిన్ గా ఎంపికైంది. అయినప్పటికీ ఈ సినిమా చాలా రోజుల క్రితమే ఆగిపోయింది. ఇక మళ్ళీ ఈ సినిమాని ఎప్పుడు సెట్స్ మీదకి తీసుకొస్తారు అనే దానికి సంబంధించిన అప్డేట్ అయితే ఏమీ ఇవ్వడం లేదు.

    కాబట్టి ఇప్పుడు ఆమె హీరోయిన్ గా అవకాశాల కోసం ఎదురుచూస్తుంది. ఇక మారుతి డైరెక్షన్ లో ప్రభాస్ హీరోగా వస్తున్న “ది రాజా సాబ్” సినిమాలో ఆమె ఒక హీరోయిన్ గా సెలెక్ట్ అయింది. ఇక మెయిన్ హీరోయిన్ గా మాళవిక మోహనన్ చేస్తున్నారు. ఇక మరో ఇద్దరు హీరోయిన్లకు కూడా ఈ సినిమాలో స్కోప్ ఉండగా ఒక హీరోయిన్ గా రిద్ది కుమార్ సెలెక్ట్ అవ్వగా, ఇంకొక హీరోయిన్ గా నిధి అగర్వాల్ ని ఎంపిక చేశారు. ఇక ఈ సినిమా ఈ సంవత్సరం రిలీజ్ కి రెడీ అవుతుంది.

    ఈ సినిమా సక్సెస్ అయితే నిధి అగర్వాల్ కి తెలుగులో మరిన్ని ఛాన్సులు వచ్చే అవకాశాలైతే ఉన్నాయి. ఇక ప్రస్తుతానికి నిధి అగర్వాల్ కి బాలీవుడ్ నుంచి కూడా మంచి ఆఫర్లు అయితే వస్తున్నాయి. ఇక మొత్తానికైతే పవన్ కళ్యాణ్ సినిమాతో డీలా పడిపోయిన నిధి అగర్వాల్ కి ప్రభాస్ మంచి అవకాశాన్ని ఇచ్చాడనే చెప్పాలి…