Homeఅంతర్జాతీయంTCA Teenmaar Sankranthi : టొరంటోలో తెలంగాణ కెనడా అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా తీన్మార్ సంక్రాంతి...

TCA Teenmaar Sankranthi : టొరంటోలో తెలంగాణ కెనడా అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా తీన్మార్ సంక్రాంతి వేడుకలు

TCA Teenmaar Sankranthi : తెలంగాణ కెనడా అసోసియేషన్(టీసీఏ) ఆధ్వర్యంలో  ‘తీన్మార్ సంక్రాంతి’ సాంస్కృతిక ఉత్సవాలు డాంటే అలిగేరి అకాడమీ, కిప్లింగ్ లో ఘనంగా జరుపుకున్నారు. ఈ సంబరాలలో 1500కు పైగా తెలంగాణ వాసులు పాల్గొన్నారు. టీసీఏ స్పాన్సర్స్ దివ్య దొంతి, కస్తూరి ఛటర్జీ,   మనస్విని వెలపాటి, శ్వేతా పుల్లూరి మరియు శ్రేయ ఆకుల గార్లు జ్యోతి ప్రజ్వలన చేసి తీన్మార్ సంక్రాంతి 2023 సంబరాలను ప్రారంభించారు. ఈ సంబరాలను తెలంగాణ కెనడా అసోసియేషన్ ఎగ్జిక్యూటీవ్ కమిటీ ఆధ్వర్యంలో బోర్డు అఫ్ ట్రస్టీ, వ్యవస్థాపక సభ్యుల సహకారంతో విజయవంతం చేసారు.

ఈ కార్యక్రమంలో భోగి పళ్ళు పిల్లల సాంప్రదాయ వేడుకలు విచిత్ర వేషాధారణ, డ్రాయింగ్, పతంగుల తయారీ, క్విజ్ మరియు ముగ్గుల పోటీలు నిర్వహించారు. మహిళా కమిటీ సభ్యులు రాధికా బెజ్జంకి , ప్రసన్న మేకల మరియు మాధురిచట రాజు ఈ కార్యక్రమాన్ని మధ్యాహ్నం మూడు నుండి సాయంత్రం ఐదు గంటల వరకు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ కెనడా అసోసియేషన్  2023 టొరంటో తెలుగు క్యాలెండర్ ను ఆవిష్కరించి ముందుగా కమిటీ సభ్యులకు అందజేశారు.

తెలంగాణ కెనడా అసోసియేషన్ అధ్యక్షులు శ్రీనివాస్ మన్నెం గారు మాట్లాడుతూ తెలంగాణ పండుగలని , సాంప్రదాయాలను భావితరాలకు తెలియజేసి ముందుకు తీసుకు వెళ్లడానికి  దోహదం చేస్తాయి అని వ్యక్తీకరించారు.  శ్రీనివాస్ మన్నెం గారు ఏ దేశమేగినా ఎందు కాలిడినా  ఎవ్వరేమనినా పొగడరా నీతల్లి భూమి భారతిని నిలుపరా నీ జాతి నిండు గౌరవము తో తెలంగాణ కెనడా అసోసియేషన్ టొరంటో కృషి చేస్తుందని తెలిపారు. తీన్మార్ సంక్రాంతి ఉత్సవాలను సాంస్కృతిక కార్యదర్శి దీపా గజవాడ సహకారంతో కుమారి ప్రహళిక మ్యాకల ,  శ్రీ రాహుల్ బాలనేని ఐదు గంటల యాంకరింగ్ చేసి ప్రేక్షకులను అలరించారు.

ఈ ఉత్సవానికి వివిధ విభాగాలలో పోటీలకు మరియు సాంస్కృతిక కార్యక్రమాలకు అనూహ్యమైన స్పందన లభించింది. సంక్రాంతి ప్రత్యేకంగా చేసిన స్కిట్, పలు నృత్య ప్రదర్శనలు , విచిత్ర వేషాధారణ ప్రేక్షకులను అలరింప చేశాయి వేడుకలో గెలిచిన వారందరికీ చివరిలో బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన వారందరికీ రుచికరమైన విందు భోజనం ఏర్పాటు చేశారు.  కార్యక్రమం చివరిలో మహిళలకు పసుపు, కుంకుమ, తెలంగాణ ఫలహారాలతో కూడిన వాయనాలను అందజేసి తెలంగాణ కెనడా అసోసియేషన్ తన ప్రత్యేకతను చాటుకుంది.

ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ కమిటీ అధ్యక్షుడు శ్రీనివాస్ మన్నెం, ఉపాధ్యక్షుడు మనోజ్ రెడ్డి, కార్యదర్శి శంతన్ నారెళ్ళపల్లి, సంయుక్త కార్యదర్శి రాజేష్ అర్ర, సాంస్కృతిక కార్యదర్శి శ్రీమతి దీపా గజవాడ, సంయుక్త సాంస్కృతిక కార్యదర్శి కుమారి ప్రహళిక మ్యాకల, కోశాధికారి శ్రీ వేణుగోపాల్ ఐల, సంయుక్త కోశాధికారి శ్రీ రాహుల్ బాలనేని మరియు డైరెక్టర్లు శ్రీ నాగేశ్వరరావు దలువాయి, శ్రీ ప్రవీణ్ కుమార్ శ్యామల శ్రీ ప్రణీత్ పాలడుగు, శ్రీ శంకర్ భరద్వాజ పోపూరి, యూత్ డైరెక్టర్ కుమారి ధాత్రి అంబటి, బోర్డ్ ఆఫ్ ట్రస్ట్ చైర్మన్ శ్రీ నవీన్ ఆకుల బోర్డ్ ఆఫ్ ట్రస్ట్  సభ్యులు శ్రీ మురళి సిరినేని, శ్రీమతి ప్రసన్న మేకల, శ్రీ మురళీధర్ కందివనం, శ్రీమతి మాధురి చాతరాజు మరియు వ్యవస్థాపక కమిటీ చైర్మన్  శ్రీ అతిక్ పాషా వ్యవస్థాపక సభ్యులు శ్రీ దేవేందర్ రెడ్డి గుజ్జుల, శ్రీ కోటేశ్వర రావు చిత్తలూరి, శ్రీ కలీముద్దీన్ మొహమ్మద్, శ్రీ  ప్రకాష్ చిట్యాల, శ్రీ అఖిలేష్ బెజ్జంకి, శ్రీ ప్రభాకర్ కంబాలపల్లి, శ్రీ శ్రీనివాస తిరునగరి, శ్రీ హరి రాహుల్, శ్రీ సంతోష్ గజవాడ, శ్రీ విజయ్ కుమార్ తిరుమలపురం మరియు పలువురు సంస్థ శ్రేయోభిలాషులు పాల్గొన్నారు.

ఉపాధ్యక్షుడు శ్రీ మనోజ్ రెడ్డి కృతజ్ఞతా వందన సమర్పణతో   తీన్మార్ సంక్రాంతి వేడుకలు కెనడా టొరంటో లో ఘనంగా ముగిశాయి.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
Exit mobile version