అమెరికాలో మళ్లీ సందడే సందడి

అమెరికాలో విమానాశ్రయాలు కిటకిటలాడుతున్నాయి. విదేశీ ప్రయాణాలు, విహార యాత్రలు పెరగడమే ఇందుకు కారణం. కరోనా ప్రభావం అనంతరం ఎప్పుడు లేనంతగా రద్దీ గత వారాంతంలో కనిపించింది. ఆదివారం అన్ని విమానాశ్రయాల్లో 22 లక్షల మందికి పైగా ప్రయాణికులకు స్రీనింగ్ జరిగిందని అమెరికా రవాణా భద్రతా విభాగం తెలిపింది. గత ఏడాది మార్చి తరువాత ఇదే అత్యధికమని చెప్పింది. అయితే 2019 నాటికి ఇదే సమయానికి ఉన్న రద్దీతో పోలిస్తే 18 శాతం తక్కువేనని తెలిపింది. అమెరికాలో దాదాపు […]

Written By: Srinivas, Updated On : July 20, 2021 11:08 am
Follow us on

అమెరికాలో విమానాశ్రయాలు కిటకిటలాడుతున్నాయి. విదేశీ ప్రయాణాలు, విహార యాత్రలు పెరగడమే ఇందుకు కారణం. కరోనా ప్రభావం అనంతరం ఎప్పుడు లేనంతగా రద్దీ గత వారాంతంలో కనిపించింది. ఆదివారం అన్ని విమానాశ్రయాల్లో 22 లక్షల మందికి పైగా ప్రయాణికులకు స్రీనింగ్ జరిగిందని అమెరికా రవాణా భద్రతా విభాగం తెలిపింది. గత ఏడాది మార్చి తరువాత ఇదే అత్యధికమని చెప్పింది. అయితే 2019 నాటికి ఇదే సమయానికి ఉన్న రద్దీతో పోలిస్తే 18 శాతం తక్కువేనని తెలిపింది.

అమెరికాలో దాదాపు ఏడాది తరువాత విమానయానం కళకళలాడుతోంది. ఈ రంగంలోని పెట్టుబడిదారులు మాత్రం సంతోషంగా లేరు. సోమవారం దాదాపుగా అన్ని ఎయిర్ లైన్స్, క్రూయిజ్ హోటల్ కంపెనీల షేర్లు పడిపోయాయి. ట్రేడింగ్ ప్రారంభంలోనే అమెరికన్ ఎయిర్ లైన్స్, యునైటెడ్ ఎయిర్ లైన్స్ షేర్లు 6 శాతం పైగా కుంగగా, డెల్టా ఎయిర్ లైన్స్ 5 శాతం సౌత్ వెస్ట్ 4 శాతానికి పైగా పతనమయ్యాయి. పలు క్రూయిజ్ లైన్స్, హోటళ్ల షేర్లు సైతం ఇదే బాట పట్టాయి.

దేశీయంగా విమానయానం కరోనా మునుపలి స్థాయిలకు చేరినా అంతర్జాతీయ ప్రమాణాలు 2019తో పోలిస్తే చాలా తక్కువగా ఉన్నాయి. ఈ ప్రభావం ఎయిర్ లైన్స్ వ్యాపారంపై గణనీయంగా ఉందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. అమెరికా ఎయిర్ లైన్స్ కంపెనీల ఆదాయంలో గణనీయమైన వాటా అంతర్జాతీయ రవాణా ద్వారానే వస్తుండడం గమనార్హం.

అంతర్జాతీయ ప్రమాణాలపై నేటికీ ఆంక్షలు కొనసాగుతుండడం, అదే సమయంలో పలు దేశాలతో పాటు అమెరికాలోనూ మళ్లీ కరోనా కేసులు పెరుగుతుండడం ఈ రంగాన్ని నిరుత్సాహపరుస్తోంది. అమెరికాలో నమోదయ్యే రోజువారీ కరోనా కేసులు కూడా గత రెండు వారాల్లో రెట్టింపయ్యాయి. అయినప్పటికి గత ఏడాదితో పోలిస్తే అగ్రరాజ్యంలో ఎయిర్ లైన్స్ వ్యాపారం ఎంో మెరుగైనట్లుగా కనిపిస్తోంది. డెల్టా ఎయిర్ లైన్స్ గత వారం రెండో త్రైమాసిక ఫలితాల్లో లాభాలు ప్రకటించింది. మిగతా పోటీ కంపెనీలూ ఇదే వారంలో ఫలితాలు ప్రకటించనున్నాయి.