షాకింగ్.. మూడేళ్ల క్రితమే ట్రంప్ కుక్కచావు చావాలని శాపం..?

సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఎవరినీ వదలనీ కరోనా మూడు రోజుల క్రితం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు సోకిన సంగతి తెలిసిందే. ఆయన ఆరోగ్య పరిస్థితిపై సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలో భిన్న కథనాలు ప్రచారంలోకి వస్తూ ఉండటంతో ఏ వార్తను నమ్మాలో, ఏ వార్తను నమ్మకూడదో ఎవరికీ అర్థం కావడం లేదు. పలు ఛానెళ్లలో ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. మరికొన్ని ఛానెళ్లలో ట్రంప్ కరోనా నుంచి కోలుకున్నాడని […]

Written By: Kusuma Aggunna, Updated On : October 5, 2020 3:46 pm
Follow us on

సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఎవరినీ వదలనీ కరోనా మూడు రోజుల క్రితం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు సోకిన సంగతి తెలిసిందే. ఆయన ఆరోగ్య పరిస్థితిపై సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలో భిన్న కథనాలు ప్రచారంలోకి వస్తూ ఉండటంతో ఏ వార్తను నమ్మాలో, ఏ వార్తను నమ్మకూడదో ఎవరికీ అర్థం కావడం లేదు. పలు ఛానెళ్లలో ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.

మరికొన్ని ఛానెళ్లలో ట్రంప్ కరోనా నుంచి కోలుకున్నాడని నేడు డిశ్చార్జ్ కాబోతున్నాడని ప్రచారం జరుగుతోంది. అయితే తెలుగు వ్యక్తి శాపమే ట్రంప్ ఆరోగ్య పరిస్థితికి కారణమని కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మూడు సంవత్సరాల క్రితం కూచిబొట్ల శ్రీనివాస్ అనే వ్యక్తి అమెరికాలో జాత్యాహంకార దాడుల్లో చనిపోయారు. మరి కొంతమంది భారతీయులు కూడా జాత్యాహంకార దాడుల్లో చనిపోతున్నారు.

ఆ సమయంలో ఒక సిద్ధాంతి ట్రంప్ కు శాపం పెట్టారు. ప్రస్తుతం ట్రంప్ ఆరోగ్య పరిస్థితిని గమనిస్తుంటే ఆయన శాపం నిజం కాబోతుందా..? అనిపిస్తోంది. ఆ సమయంలో అమెరికాలో ట్రంప్ వల్ల జరుగుతున్న జాత్యాహంకార దాడులపై ప్రముఖ సిద్ధాంతి, పంచాంగ కర్త ములుగు రామలింగేశ్వర ప్రసాద్ శాపం పెట్టారు. “జాత్యాహంకారీ డొనాల్డ్ ట్రంప్.. నీ వల్ల నిష్కారణంగా భారతీయులు ప్రాణాలు కోల్పోయారు.. ఈ పాపం తప్పక తగులుతుంది.. నీవు చేసిన పాపానికి ఫలితం చెబుతున్నా విను.. నీ అంత్యకాలంలో, మరణ సమయంలో బంధు మిత్రులు కానీ హితులు కానీ, భార్య, బంధువులు కానీ లేకుండా అనాథలా కుక్కచావు చస్తావ్” అని శాపం పెట్టారు.

తన మాటకు తిరుగులేదని ములుగు సిద్ధాంతి చెప్పారు. ప్రస్తుతం ట్రంప్ ఆరోగ్య పరిస్థితిని గమనిస్తే ములుగు సిద్ధాంతి చెప్పిన మాటలు నిజమయ్యేలా కనిపిస్తున్నాయి. గతంలో ములుగు సిద్ధాంతి అనేక ప్రమాదాలను, విపత్తులను ముందుగానే ఊహించి చెప్పిన సంగతి తెలిసిందే. మరి ట్రంప్ విషయంలో సిద్ధాంటి శాపం నిజమవుతుందా..? చూడాల్సి ఉంది.