
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలను బ్యాలెట్ పద్దతి ద్వారానే నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. ఈవీఎంలు, సెటప్‌లు లేనందున ఎక్కువశాతం రాజకీయ పార్టీలు బ్యాలెట్ పద్ధతి ద్వారానే ఎన్నికలు నిర్వహించాలని కోరాయని తెలిపింది. ఈవీఎంల ద్వారా ఎన్నికలు నిర్వహించాలని 3 పార్టీలు కోరగా.. 13 పార్టీలు బ్యాలెట్ విధానానికే మొగ్గు చూపారని ఎన్నికల సంఘం కమిషనర్ తెలిపారు. మున్సిపల్ ఎన్నికలు కూడా బ్యాలెట్ పద్ధతిలోనే నిర్వహిస్తామని ఆయన తెలిపారు.