
అమెరికాను భారతీయులు ఏలుతున్నారు. అందులో తెలుగువారి పాత్ర కాదనలేని. ప్రపంచ టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల మన మన తెలుగు వాడు కావడం మనకు గర్వకారణం. ఇప్పుడు డెమొక్రటిక్ జోబైడెన్ ప్రభుత్వంలో చాలా మంది తెలుగు వ్యక్తులకు పెద్దపీట లభించింది. కీలక శాఖల్లో జోబైడెన్ మంత్రివర్గంలో తెలుగు వారున్నారు. తాజాగా అదే జోబైడెన్ మన తెలుగు అమ్మాయిని జడ్జిగా నామినేట్ చేయడం విశేషం.
అగ్రరాజ్యం అమెరికాలో మరో తెలుగు తేజం వెలిగింది. వాషింగ్టన్ డిసిలో జిల్లా కోర్టు జడ్జిగా తెలుగు మహిళ రూప రంగా పుట్టగుంట నియమితులయ్యారు.
మొత్తం 11 మంది జడ్జిలను నామినేట్ చేసిన ప్రెసిడెంట్ బైడెన్ అందులో తెలుగు సంతతికి చెందిన రూపకు అవకాశమిచ్చారు. ఇందులో ఓ పాకిస్తానీ సంతతి మహిళ కూడా ఉండడం విశేషం.
రూపా వాళ్ల తల్లిదండ్రులది కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం కలవపాముల. వీరు చాలా ఏళ్ల కిందట యుఎస్ లో స్థిరాపడ్డారు.