Telangana Liberation Day: తెలంగాణ రాష్ట్ర విమోచన దినోత్సవం సందర్బంగా న్యూజెర్సీ రాష్ట్రం, House of Biryani’s and Kebabs రెస్టారెంట్ లో ఓవర్సీస్ ఫ్రెండ్స్ అఫ్ బీజేపీ సభ్యులతో సమావేశం జరిగింది. ఈ సందర్బంగా విచ్చేసిన ప్రవాస తెలంగాణ బిడ్డలు తెలంగాణ స్వాతంత్ర ఉద్యమములో పోరాడిన వీరులకు నివాళులర్పించారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా ప్రభుత్వం నిర్వహించాలని అఫ్-బీజేపీ ప్రతినిధులు డిమాండ్ చేసారు.
తెలంగాణా సభికులందరికీ ఓఎఫ్ బిజెపీ జాతీయ మాజీ యువ సహా -కన్వీనర్ విలాస్ రెడ్డి జంబుల స్వాగతం తెలుపుతూ ప్రారంబించారు.ఈ కార్యక్రమములో ప్రత్యేకముగా ఓఎఫ్ బిజెపీ ప్రెసిడెంట్ డా!! అడపా ప్రసాద్ గారు మాట్లాడుతూ అమెరికాలో తెలంగాణా విమోచన ది నోత్సవ కార్యక్రమాన్ని అఫ్ బీజేపీ ఆధ్వర్యములో అమెరికా వ్యాప్తముగా 10 చాప్టర్లలో (వాషింగ్ టోన్ డీసీ , టెక్సాస్ లో హౌస్టన్ , డల్లాస్ , ఆస్టిన్ , ఒహియో రాష్ట్రములో కొలంబస్ , కాళీ పోర్నియా లో బే ఏరియా , ఇళ్లనోయిస్ రాష్ట్రములో నాపెరువిల్లే , మసచుట రాష్ట్రములో బోస్టన్ , పెన్సిల్వేనియా లో చెస్టర్ స్ప్రింగ్ ) చేసారు అని తెలిపారు. మరియు రజాకార్లకు(ఖాసీం రజ్వి) వారసులైన ఒవైసి కుటుంబాన్ని తలకెత్తుకుని తెలంగాణ ఆత్మాభిమానాన్ని కించపరుస్తున్న కెసిఆర్ తీరుపై డా!! అడపా ప్రసాద్ గారు మండిపడ్డారు.
ఓఎఫ్ బిజెపీ పాస్ట్ ప్రెసిడెంట్ కృష్ణ రెడ్డి ఏనుగుల గారు మాట్లాడుతూ ,
కేంద్ర హోం మంత్రి అమిత్ షా గారు నిర్మల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాగానే విమోచన దినోత్సవాన్ని అధికారికంగా చేస్తామని ప్రకటించడాన్ని తెలంగాణ ఎన్నారైలు హర్షం వ్యక్తం చేశారు, అని తెలిపారు మరియు కేసీఆర్ ప్రభుత్వం విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించకుండా.. వీరుల త్యాగాలను మజ్లిస్ పార్టీకి తాకట్టు పెట్టిందని ఆరోపించారు. దీనిని తెలంగాణ ప్రజలు మరిచిపోరని, ఈ అవకాశవాద రాజకీయాలకు త్వరలోనే బుద్ధి చెబుతారని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం 1,200కిపైగా బలిదానాలు చేసుకుంటే.. 400 మంది మాత్రమే అని పేర్కొనడం బాధాకరమన్నారు.
అమెరికా తెలుగు అసోసియేషన్ కార్యదర్శి శరత్ వేముల మాట్లాడుతూ
నిజాం నిరంకుశ పాలన నుండి విముక్తి పొందింది నిజం.. సైనిక చర్య ద్వారా భారత దేశంలో విలీనం అయింది వాస్తవం.. మరి ఈ నిజం, వాస్తవం అంగీకరించేందుకు ఎందుకు భయం? సెప్టెంబర్ 17 వచ్చినప్పుడల్లా ఎందుకీ నీలి నీడలు?.. సమైక్య రాష్ట్రంలో ఇదే తంతు.. స్వరాష్ట్రంలోనూ అదే విధానమా? హైదరాబాద్ రాష్ట్రంలో తెలంగాణ భాగం కావడం అబద్దమా?.. ఆర్యసమాజం, స్టేట్ కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు చేపట్టిన పోరాటం తప్పా?.. రాజకార్లు, దేశ్ ముఖ్ లు, జమీందార్ల అరాచకాలు నిజం కాదా? అని ప్రశ్నించారు.
దేశానికి స్వాతంత్య్రం వచ్చినా. నిజాం పాలనలో ఉన్న తెలంగాణ మరో 13 నెలల పాటు చీకటి రోజులు గడిపిందని రఘువీర్ రెడ్డి అన్నారు. బంగారు తెలంగాణ అంటూ కేసీఆర్ తెలంగాణకు అసలు చరిత్రే లేకుండా చేస్తున్నారన్నారు. తెలంగాణ కీర్తిని , తెలంగాణ చరిత్ర ని ముందు తరాలకి తెలియచేస్తాం అని డిమాండ్ చేసారు ప్రదీప్ రెడ్డి కట్ట.
లింగాల సంతోష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్యహించాలని డిమాండ్ చేసారు .తెలంగాణ లో బీజేపీని శక్తివంతంగా చేయడానికి కృషి చేస్తాం అన్నారు. వంశీ యంజాల మాట్లాడుతూ , నిజాంకు, రజాకార్లకు వ్యతిరేకంగా ఎందరో సాయుధ పోరాటాలు చేసి ప్రాణాలు అర్పించారని, అలాంటి అమరవీరుల త్యాగాలను కేసీఆర్ విస్మరిం చారని పేర్కొన్నారు.
Also Read: తెలుగు రాష్ట్రాల మధ్య కొత్త గొడవ.. రైతుల్లో ఆందోళన!
విలాస్ రెడ్డి జంబుల మాట్లాడుతూ , తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే అధికారికంగా నిర్వహిస్తామని ప్రకటించారు కేసీఆర్.. మరి మన రాష్ట్రం మనకు వచ్చిన తర్వాత, ఆయనే అధికారంలో ఉన్నాక సెప్టెంబర్ 17 వేడుకలను ఎందుకు నిర్వహించడం లేదు? ఈరోజు నిజంగా అరుదైన రోజు.. హైదరాబాద్ విమోచన దినం, ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సెప్టెంబర్ 17వ తేదీనే వచ్చాయి అని వంశీ యంజాల తెలిపారు. ఈ కార్యక్రమములో మోడీ గారి జన్మదిన సందర్భముగా బర్త్డే కేక్ కట్ చేసి , జన్మ దిన శుభ కాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమానికి ఓఎఫ్ బిజెపీ జాతీయ అధ్యక్షులు డా || అడపా ప్రసాద్ , ఓఎఫ్ బిజెపీ జాతీయ మాజీ అధ్యక్షులు శ్రీ కృష్ణ రెడ్డి ఏనుగుల , ఓఎఫ్ బిజెపీ జాతీయ మాజీ యువ సహా -కన్వీనర్ విలాస్ రెడ్డి జంబుల , రఘువీర్ రెడ్డి, లింగాల సంతోష్, శరత్ వేముల, వంశీ యంజాల , ప్రదీప్ కట్ట , ప్రకాష్, గోపి సముద్రాల,నరేంద్ర రేపాక , ప్రేమ్ కాట్రగడ్డ , రవి , మధుకర్, రామ్ వేముల , జై శ్రీరామ్ భార్గవ్, సురేష్ సోమిశెట్టి ,ఇంకా పలువురు పాల్గొన్నారు.
Also Read: సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటనపై అన్ని అనుమానాలే?
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Read MoreWeb Title: Telangana liberation day under the auspices of the overseas friends of bharatiya janata party
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com