https://oktelugu.com/

TANA: అమెరికాలోని విద్యార్థులకు తెలుగు పాఠాలు.. నేర్పడానికి ముందుకు వచ్చిన తానా!

అమెరికాలో నివసిస్తున్న తెలుగువారి పిల్లలకు మాతృభాష నేర్పించడానికి ఏపీ ప్రభుత్వం, తానా సంయుక్తంగా ‘తానా పాఠశాల’ పేరుతో కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సమన్వయకర్త భాను ప్రకాశ్‌ మాగులూరి తెలిపారు. దీనిద్వారా ఆన్‌లైన్‌ విధానంలో తెలుగు పాఠాలు బోధించనున్నట్లు పేర్కొన్నారు. మాతృభాషను విస్మరించిన ఏ జాతి మనుగడ సాగించలేదన్నారు.

Written By:
  • Raj Shekar
  • , Updated On : July 14, 2024 / 03:24 PM IST

    TANA

    Follow us on

    TANA: అమెరికాలో తెలుగువారిని ఐక్యం చేసేందుకు తానా, నాట్స్‌ సంస్థలు విశేషంగా కృషి చేస్తున్నాయి. తెలుగు పండుగలు, సంస్కృతి, సంప్రదాయాలను కొనసాగిస్తున్నారు. వినాయక చవితి, బతుకమ్మ, సంక్రాంతి, దీపావళి వంటి పండుగలు ఘనంగా నిర్వహిస్తున్నారు. తెలుగువారందరినీ ఒక్కచోటకు చేర్చి తెలుగుదనం చాటుతున్నాయి. ఈ క్రమంలో తెలుగుదనం కాపాడేందుకు తానా మరో కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికాలోని తెలుగురవారి పిల్లలకు తెలుగు నేర్పించాలని సంకల్పించింది. ఇందుకోసం తెలుగు పాఠాలు చెప్పేలా ఏర్పాట్లు చేసింది.

    మాతృభాష నేర్పించాలని..
    అమెరికాలో నివసిస్తున్న తెలుగువారి పిల్లలకు మాతృభాష నేర్పించడానికి ఏపీ ప్రభుత్వం, తానా సంయుక్తంగా ‘తానా పాఠశాల’ పేరుతో కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సమన్వయకర్త భాను ప్రకాశ్‌ మాగులూరి తెలిపారు. దీనిద్వారా ఆన్‌లైన్‌ విధానంలో తెలుగు పాఠాలు బోధించనున్నట్లు పేర్కొన్నారు. మాతృభాషను విస్మరించిన ఏ జాతి మనుగడ సాగించలేదన్నారు. అమెరికా రాజధాని వాషింగ్‌టన్‌ డీసీలో తానా పాఠశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బాల బాలికలకు తెలుగు పుస్తకాలు పంపిణీ చేశారు.

    భావి తరాలకు తెలుగు..
    తెలుగు భాషను, తెలుగు భాషలోని కమ్మదనం గురించి భావి తరాలకు తెలియజేయాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. అందుకే అమెరికాలో ఉంటున్న తెలుగు కుటుంబాలన్నీ తమ పిల్లలకు తెలుగు నేర్పించాలని గుంటూరు మిర్చి యార్డు మాజీ చైర్మన్‌ మన్నవ సుబ్బారావు కోరారు. అమెరికాలోని తెలుగువారందరూ ఒకే గొడుకు కిందకు తెచ్చిన ఘటన తానాకు దక్కుతుందన్నారు. కార్యక్రమంలో యెండూరి సీతారామారావు, అవిర్నేని రమేశ్, అల్లంపల్లి రవికుమార్‌ పాల్గొన్నారు.

    ఇటీవలే నాట్స్‌ సాంస్కృతిక విక్షణ..
    ఇదిలా ఉంటే నార్త్‌ అమెరికా తెలుగు అసోసియేషన్‌(నాట్స్‌) తెలుగు సంప్రదాయాల గురించి అమెరికాలోని తెలుగువారికి తెలియజేయాలని నిర్ణయించింది. ఈమేరకు ప్రత్యేక విక్షణ తరగతులు నిర్వహిస్తోంది. ఆన్‌లైన్‌తోపాటు ఆఫ్‌లైన్‌లోనూ ఈ తరగతులు నిర్వహిస్తోంది. తెలుగు పండుగలు, తెలుగు సంప్రదాయాలు, సాంస్కృతిక కార్యక్రమాలపై శిక్షణ ఇస్తోంది. దీనిపై కూడా తెలుగువారు ఎక్కువ మక్కువ చూపుతున్నారు. తమ పిల్లలకు శిక్షణ ఇప్పిస్తున్నారు.

    తెలుగుదనానికి దూరం కాకూడదని..
    ఉద్యోగాలు, ఉపాధి, ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్తున్నవారు అక్కడే స్థిరపడుతున్నారు. దీంతో అమెరికా జనాభాలో తెలుగు వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అమెరికా సెన్సెస్‌ లెక్కల ప్రకారం అమెరికాలో తెలుగు జనాభా 12 లక్షలకు చేరింది. అయితే అమెరికాలో ఉంటున్న తెలుగువారి పిల్లలు కూడా అక్కడే చదువుకుంటున్నారు. అయితే అక్కడి పాఠశాలల్లో తెలుగు అనేదే ఉండడం లేదు. ఇరుగు పొరుగువారు, పీర్‌గ్రూప్స్‌ కూడా తెలుగువారు కాకపోవడంతో పిల్లలకు తెలుగు రావడం లేదు. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు తెలియడం లేదు. ఈ నేపథ్యంలోనే తెలుగుదనానికి అమెరికాలో పుట్టి పెరుగుతున్న పిల్లలు దూరమవుతున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని తానా, నాట్స్‌తోపాటు తెలుగు వారికి సంబంధించిన సంస్థలు తెలుగును ప్రోత్సహించే కార్యక్రమాలు చేపడుతున్నాయి.

    స్వచ్ఛందంగా ముందుకు..
    ఇదిలా ఉంటే.. తమ పిల్లలు తెలుగు నేర్చుకోవాలని అమెరికాలోని తెలుగువారు కూడా ఆసక్తి చూపుతున్నారు. తెలుగు నేర్పించే వారిని, తెలుగు సంస్కృతుల్లో శిక్షణ ఇచ్చేవారిని ప్రోత్సహిస్తున్నారు. తమ పిల్లలను ఇలాంటి కార్యక్రమాలకు స్వచ్ఛందంగా పంపుతున్నారు. భారతీయతను చాటే కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొనేలా చూస్తున్నారు. అమెరికాలో నిర్వహిస్తున్న భారతీయ వేడుకల్లోనూ పిల్లలు పాల్గొనేలా చూస్తున్నారు.

    ఆకట్టుకుంటున్న తెలుగు వేడుకలు..
    ఇదిలా ఉంటే.. అమెరికాలో నిర్వహిస్తున్న తెలుగు కార్యక్రమాలు ఆకట్టుకుంటున్నాయి. దీంతో అమెరికన్లు కూడా తెలుగు పండుగలు, వేడుకలు, సాంస్కృతక కార్యక్రమాల్లోనూ భాగస్వాములవుతున్నారు. నేర్చుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. అమెరికా అధికారులు, గవర్నర్లు కూడా వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు.