TANA: తానా సాహిత్య విభాగం తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో ప్రతినెలా ఆఖరి ఆదివారం నిర్వహించే సాహిత్య సమావేశం జూన్ 30న జరిగింది. వర్చువల్‌గా నిర్వహించిన ఈ 68వ అంతర్జాతీయ సమావేశం స్ఫూర్తిదాయకమైన ప్రతిభామూర్తుల జీవిత చరిత్రల సదస్సుగా మారింది. తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డాక్టర్ ప్రసాద్ తోటకూర అతిథులను సాదరంగా ఆహ్వానించి సదస్సును ప్రారంభించారు.
ప్రతిభామూర్తుల జీవిత చర్తిపై చర్చ..
ఈ సందర్భంగా అధ్యక్షుడు ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ ప్రతిభా మూర్తుల జీవిత చరిత్రలు చదవడం వలన వారు గడిపిన జీవితమేగాక నాటి సాంఘిక, సాంస్కృతిక, రాజకీయ పరిస్థితులు, ప్రజల జీవన విధానం మొదలైన ఎన్నో విషయాలు తెలుస్తాయన్నారు. వారు తమ జీవితంలో ఎదుర్కొన్న సమస్యలు, ఆటుపోట్లు, వాటిని అధిగమించిన తీరు నుంచి మనం ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చని తెలిపారు. తెలుగు సాహిత్య ప్రక్రియలలో జీవిత చరిత్రలు, ఆత్మకథలు కీలక భూమిక పోషిస్తాయని పేర్కొన్నారు.
విషిష్ట అతిథిగా నాగులపల్లి..
తానా ప్రపంచ సాహిత్య వేదిక సదస్సుకు కృష్ణ జిల్లాలోని ముదునూరు అనే గ్రామంలో ఉన్న జీవిత చరిత్రల గ్రంథాలయం వ్యవస్థాపకుడు డాక్టర్ నాగులపల్లి భాస్కర్‌రావు విశిష్ట అతిథిగా పాల్గొన్నారు. తమ గ్రంథాలయ ఏర్పాటు వెనుక ఉన్న ఆశయాన్ని, అమలు జరుగుతున్న తీరుతెన్నులను వివరించారు. విశిష్ట అతిథులుగా పాల్గొన్న సుప్రసిద్ధ రచయిత్రి, విద్యావేత్త ఆచార్య డాక్టర్ సి.మృణాళిని ప్రముఖ రచయిత బుచ్చిబాబు సతీమణి శివరాజు సుబ్బలక్ష్మి రంచించిన మా జ్ఞాపకాలు అనే జీవత చరిత్రను, బీనాదేవి పేరుతో భార్యాభర్తలు కలిసి జంటగా రాసిన అనేక రచనలను బీనాదేవీయం అనే గ్రంథాల్లో పలు విషయాలను చక్కగా ఆవిష్కరించారు. ప్రముఖ రచయిత డాక్టర్ జీవీ. పూర్ణచందు తెలుగువారికి తక్కువగా పరిచయమైన తమిళనాట ఆధ్యాత్మికరంగంలో ఎనలేని కృషి చేసిన తెలుగు ప్రముఖులు అప్పయ్య దీక్షితులు, అల్లూరి వేంకటాద్రిస్వామి జీవిత చరిత్రల్లోని విశేషాలను పంచుకున్నారు.
రష్యన్ యువతి సాహసంపై..
ఇక ప్రముఖ సాహితీవేత్త కిరణ్ ప్రభ ఒఒక రష్యన్ యువతి కేవలం భారతీయ నృత్యకలలపై ఆసక్తితో తన పేరును రాగిణీదేవిగా మార్చుకుని ఎన్నో సాహసాలతో భారతదేశంలో అడుగుపెట్టి అనేక సంవత్సరాలు కృషి చేసి నాట్యం నేర్చుకున్న తీరును వివరించారు. నాట్య శాస్త్రంపై ఎంతో పరిణితితో కూడిన గ్రంథాలను ఆమె రాయడం, తన కుటుంబం మొత్తం ఏవిధంగా నాట్యకళకు జీవితాంతం అకితం అయిందో వంటి ఆసక్తికర విశేషాలను పంచుకున్నారు. తాను నమ్మిన సిద్ధాంతం కోసం జీవితాంతం పోరాడిన గిడుగు వేంకటరామమూర్తి జీవిత గురించి కిరణ్ ప్రభ విశ్లేషించారు. సాహిత్య వేదిక సమన్వయకర్త చిగురుమళ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ ఇలాంటి సాహితీ సమావేశాలు విద్యార్థుల కోసం ప్రత్యేకంగా నిర్వహించడం అమసరమన్నారు.