Juice : శరీరం ఆరోగ్యంగా ఉండటంతో పాటు ఫిట్‌గా ఉండాలని ఉదయాన్నే పండ్లు, రసాలు ఎక్కువగా తీసుకుంటారు. పూర్వకాలంలో అయితే రాగి జావ వంటివి ఉదయం తీసుకునేవారు. కానీ ఈరోజుల్లో కొత్త రకాల ఫుడ్స్ తింటున్నారు. ఎక్కువ శాతం మంది కూరగాయల జ్యూస్, పండ్లు, రసాలు వంటివి తాగుతున్నారు. వీటిని తాగడం వల్ల ఆరోగ్యానికి మంచిదని, అలాగే ఫిట్‌గా ఉంటారని భావిస్తారు. కానీ ఉదయం పూట ఇలా కొన్ని రకాల కూరగాయల జ్యూస్‌లను తాగడం ఆరోగ్యానికి అంత మంచిది కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా పండ్ల జ్యూస్‌లు ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిని తాగడం వల్ల పోషకాలు శరీరానికి బాగా అందుతాయి. ఆరోగ్యంగా ఉండటంతో పాటు చర్మం కూడా కాంతివంతంగా ఉంటుంది. కానీ ఉదయం తాగడం వల్ల అనారోగ్య సమస్యల బారిన పడతారని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి ఉదయాన్నే జ్యూస్ తాగడం వల్ల వచ్చే సమస్యలేంటో చూద్దాం.
చాలామంది వాకింగ్ లేదా జాకింగ్‌కి వెళ్తుంటారు. వెళ్లి వచ్చిన తర్వాత వెంటనే జ్యూస్ తాగుతారు. ఇలా తాగడం వల్ల ఆరోగ్యానికి మంచిదని భావిస్తారు. కానీ అనారోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు. ఉదయాన్నే ఇలా జ్యూస్‌లు తాగడం వల్ల కడుపులో యాసిడ్ ఫామ్ అవుతుంది. ఎందుకంటే జ్యూస్‌లో ఆమ్ల స్వభావం ఎక్కువగా ఉంటుంది. ఖాళీ కడుపుతో తాగితే వాంతులు కూడా అయ్యే ప్రమాదం ఉంది. దీనివల్ల జీర్ణక్రియ కూడా దెబ్బతింటుంది. కొందరు కూరగాయలు పాలకూర, బచ్చలికూర, బ్రోకలీ వంటి వాటితో పండ్లు కలిపి జ్యూస్ చేస్తారు. ఇలా చేసిన జ్యూస్ తాగడం ఆరోగ్యానికి మంచిది కాదు. ఎందుకంటే ఆకుకూరల్లో ఉండే ఆక్సాలిక్ యాసిడ్, పండ్లలో ఉండే సిట్రిక్ ఆమ్లం రెండు కలిసి కడుపులోకి ప్రవేశించినప్పుడు మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడతాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి ఇలా జ్యూస్‌లు ఏవైనా తాగితే వైద్యుని సూచనలు తీసుకున్న తర్వాత తాగడం మేలు.
ఇలాంటి జ్యూస్‌లు ఉదయాన్నే తాగడం వల్ల కొందరికి జీర్ణ సమస్యలు కూడా వస్తాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా మధుమేహం, గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నవారు అయితే అసలు తాగకూడదు. ఎందుకంటే జ్యూస్‌లో చక్కెర పరిమాణం ఎక్కువగా ఉంటుంది. వీటిని తాగడం వల్ల సమస్య తీవ్రత పెరుగుతుంది. కొందరికి కడుపు కూడా ఉబ్బరంగా ఉంటుంది. తాగిన జ్యూస్ జీర్ణం కాకపోవడం వల్ల వాంతులు, అలసట, నీరసం అన్ని వస్తాయి. కాబట్టి ఎలాంటి ఉదయం పూట జ్యూస్‌లు తాగవద్దు. దాని బదులు టిఫిన్ ఏదైనా చేసిన తర్వాత తాగడం మేలు. ఆరోగ్యంగా ఫిట్‌గా ఉంటారని భావించి అనారోగ్య సమస్యలను కోరితెచ్చుకోవద్దు.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.
Bhaskar Katiki is the main admin of the website
Read MoreWeb Title: Drinking these juices early in the morning is just like bringing a problem
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com