TANA Mid Atlantic Blood Drive: ఎన్టీఆర్ 103వ జయంతి సందర్భంగా రక్తదాన శిబిరం – 40 మందికిపైగా దాతల భాగస్వామ్యం
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) మిడ్ అట్లాంటిక్ బృందం ఆధ్వర్యంలో ప్రముఖ నటుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) 103వ జయంతిని పురస్కరించుకుని నిర్వహించిన రక్తదాన శిబిరానికి విశేష స్పందన లభించింది. మే 31న ఎక్స్‌టాన్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 40 మందికిపైగా రక్తదాతలు పాల్గొని సామాజిక బాధ్యతను చాటుకున్నారు.

ఈ రక్తదాన శిబిరాన్ని తానా బోర్డ్ డైరెక్టర్ రవి పొట్లూరి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రాణాలను కాపాడే రక్తదానం అత్యంత గొప్ప సేవ అని పేర్కొన్నారు. 40 మందికిపైగా దాతలు స్వచ్ఛందంగా ముందుకు రావడం అభినందనీయమన్నారు. కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన తానా మిడ్ అట్లాంటిక్ బృందం, రీజినల్ రిప్రజెంటేటివ్ ఫణి కంతేటి, స్వచ్ఛంద సేవకులు మరియు రక్తదాతలను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.
అదేవిధంగా 50 సార్లకు పైగా రక్తదానం చేసి అరుదైన మైలురాయిని చేరుకున్న రంజిత్ కోమటిని ఘనంగా సత్కరించారు. సమాజ సేవలో ఆయన చూపుతున్న నిబద్ధత అందరికీ ఆదర్శమని కొనియాడారు.
తానా అధ్యక్షుడు నరేన్ కొడాలి కూడా మిడ్ అట్లాంటిక్ బృందం చేపట్టిన ఈ సేవా కార్యక్రమాన్ని ప్రశంసించారు. ముఖ్యంగా మొదటిసారిగా రక్తదానం చేసిన యువత ముందుకు రావడం సంతోషకర పరిణామమన్నారు.
కార్యక్రమానికి వేదికను ఉచితంగా అందించిన వేణు సంగనికి, అలాగే నిర్వహణలో సహకరించిన బ్లడ్ బ్యాంక్ ఆఫ్ డెల్మార్వా బృందానికి తానా నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ బ్లడ్ డ్రైవ్‌కు స్ప్రూస్ ఇన్ఫోటెక్ గ్రాండ్ స్పాన్సర్‌గా వ్యవహరించగా, టెస్లా రియాల్టీ గ్రూప్, తనిష్క్ యూఎస్ఏ, చు ఫైనాన్షియల్ సర్వీసెస్, ఓక్స్టన్, స్ప్రింగ్ ఈగిల్స్, రియల్ ప్రాపర్టీ మేనేజ్‌మెంట్ వారణాసి సంస్థలు ప్రీమియం స్పాన్సర్లుగా మద్దతు అందించాయి.
ఈ కార్యక్రమంలో సురేష్ యలమంచి, భవాని క్రొత్తపల్లి, శైలజ కస్తూరి, సరోజ పావులూరి, విశ్వనాథ్ కోగంటి, రంజిత్ మామిడి, శ్రీధర్ సాదినేని, శ్రీనివాస్ అబ్బూరి, హరి, గౌరి కర్రోతు, నాగరాజ్, కోటి యాగంటి, శ్రీకాంత్ గుడూరు, ప్రసాద్ కునారపు, రమణ కోత, మధు నల్ల తదితరులు పాల్గొన్నారు.
