Tana Foundation: ఉపకార వేతనం.. విద్యార్థుల చదువుల కోసం ప్రభుత్వాలతోపాటు, కార్పొట్ సంస్థలు, వివిధ సంఘాలు, సవ్వచ్ఛంద సంస్థలు ఆర్థికసాయం చేస్తున్నాయి. కార్పొరేట్ సంస్థలు కార్పొరేట్ రెస్పాన్సిబులిటీలో భాగంగా సాయం అందిస్తుండగా, ప్రభుత్వాలు.. విద్యార్థుల ప్రతిభ, సామాజికత ఆధారంగా ఉపకార వేతనాలు అందిస్తున్నాయి. గతంలో ఎస్సీ, ఎస్టీలకు మాత్రమే ఉపకార వేతనాలు అందించేవి. తర్వాత ప్రతిభ ఉన్నవారు చదువుకు దూరం కొవొద్దన్న ఉద్దేశంతో అనేక సంస్థలు, వ్యక్తులు కూడా ఆర్థిక ఇబ్బందులతో చదువులకు దూరమయ్యేవారికి అండగా నిలుస్తున్నారు. వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్నారు. ఈ క్రమంలో నార్త్ అమెరికా తెలుగు సంఘం కూడా విద్యార్థులకు ఆర్థికసాయం అందించేందుకు ముందుకు వచ్చింది. హైదరాబాద్‌లో తెలుగు విద్యార్థులకు రూ.7 లక్షల ఉపకార వేతనాలు పంపిణీ చేసింది.
50 మందికి స్కాలర్æషిప్..
ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా), తానా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చేయూత కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్‌లో శనివారం 50 మంది విద్యార్థులకు ఉపకారవేతనాలను పంపిణీ చేశారు. రూ.7 లక్షల విలువైన నగదును గౌతమ్ అమర్నేని కుటుంబ సభ్యులు తానాకు అందజేశారు. వీటిని రాహుల్ అమిర్నేని 50 మంది విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గౌతమ్ మాట్లాడుతూ, పేద విద్యార్థులకు ఉపకారవేతనాలు పంపిణీ చేసే అవకాశం కల్పించిన తానా అధ్యక్షుడు నిరంజన్ శృంగవరపు, ఫౌండేషన్ చైర్మన్ శశికాంత్ వల్లేపల్లి, కో ఆర్డినేటర్ శ్రీకాంత్ పోలవరపులకు ధన్యవాదాలు తెలిపారు.
వివిధ సేవా కార్యక్రమాలు..
తానా ఫౌండేషన్ చైర్మన్ శశికాంత్ వల్లేపల్లి మాట్లాడుతూ తానా ఫౌండేషన్ ద్వారా వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. చేయూత ద్వారా అనేకమంది విద్యార్థులకు ఉపకారవేతనాల ద్వారా వారిని ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా చదువుకోలేకపోతున్న వారికి తమ వంతుగా సహాయం అందిస్తున్నామన్నారు. వైద్యశిబిరాలను ఏర్పాటు చేసి ఉచితంగా వైద్యసేవలను కూడా అందిస్తున్నట్లు శశికాంత్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి సహకరించిన తానా ప్రతినిధులకు, దాతలకు, పడాల ట్రస్ట్ డెరైక్టర్ రవీంద్ర తంగిరాలకు శశికాంత్ ధన్యవాదాలు తెలిపారు.
తెలుగు రాష్ట్రాల్లో సేవా కార్యక్రమాలు..
ఇదిలా ఉంటే.. తానా తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. చైతన్య స్రతి కార్యక్రమంలో భాగంగా 2022లో డిసెంబర్ 2 నుంచి 2023 జనవరి 7 వరకు రూ.100 కోట్ల సేవా కార్యక్రమాలు నిర్వహించింది. 47 ఏళ్లుగా తానా వివిధ సేవా కార్యక్రమాలు చేపడుతోంది. అమెరికాతోపాటు తెలుగు రాష్ట్రాల్లోనూ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. మెగా మెడికల్ క్యాంపులు, విద్యార్థులకు ఉపకార వేతనాలు, దివ్యాంగులకు ఉపకరణాల పంపిణీ వంటి సేవా కార్యక్రమాలు తెలుగు రాష్ట్రాల్లో నిర్వహిస్తున్నారు. ఇక అమెరికా వెళ్లిన తెలుగు వారికి అక్కడే సెటిల్ అయ్యేందుకు కార్యక్రమాలు, శిక్షణ శిబిరాలు నిర్వహిస్తోంది.
Raj Sekhar is a senior content writer with good knoledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read More