TANA Foundation
TANA: ఉత్తర అమెరికా తెలుగు అసోసియేషన్ (తానా) దాదాపు 50 ఏళ్లుగా అమెరికాలోని తెలుగు వారికి వివిధ రకాలుగా సహాయ సహకారాలు అందిస్తోంది. 1979లో ఏర్పడిన తానా వివిధ సేవా కార్యక్రమాల ద్వారా అమెరికాలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే తానాకు తెలుగువారు ఇచ్చే నిధులు దారి మళ్లినట్లు కొన్ని రోజులుగా రోపణలు వస్తున్నాయి.
ఉత్తర అమెరికా తెలుగు అసోసియేషన్(Telugu Association Of North America) లో నిధుల మళ్లింపు, అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తానా సభ్యులు కొంత మంది నిధుల మళ్లింపుపై అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ(FBI)కి ఫిర్యాదు కూడా చేశారు. తానా మాజీ ట్రెజరర్ శ్రీకాంత్ పోలవరపు ఎవరినీ సంప్రదించకుండా చట్ట విరుద్ధంగా తానా ఫౌండేషన్ బ్యాంకు ఖాతా నుంచి తన సొంతానికి 3.65 మిలియన్ డాలర్లు వాడుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
రంగంలోకి ఎఫ్‌బీఐ..
అమెరికాలో స్థిరపడిన తెలుగు వారు తానాకు ఏటా నిధులు విరాళంగా ఇస్తుంటారు. ఉన్నత స్థానాల్లో ఉన్నవారు ఈ నిధుల వివిధ సేవా కార్యక్రమాల కోసం ఇస్తారు. అయితే కొంత మంది ఈ నిధులు తానా ఖాతాలో వేసి.. అక్కడి నుంచి మళ్లీ తమ ఖాతాల్లోకి మళ్లించుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనిపై ఎఫ్‌బీఐకి ఫిర్యాదు అందించింది. రంగంలోకి దిగిన ఎఫ్‌బీఐ విచారణ చేపట్టింది.
నిధుల రికవరీ..
నిధుల దారి మళ్లింపు ఆరోపణల నేపథ్యంలో తానా బోర్డు అవకతవకలు జరిగినట్లు అంగీకరించింది. నిధులు దారి మళ్లించిన శ్రీకాంత్ నుంచి వాటిని రాబట్టేందుకు చర్యలు చేపట్టింది. ఇప్పటికే 5 లక్షల డాలర్లు శ్రీకాంత్ నంచి రికవరీ చేసింది. మిగతావి కూడా రికవరీ చేసేలా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(FBI) సహకారం తీసుకుంటోంది.
పారదర్శకత కోసం..
తానా సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కొంటుందని, పారదర్శకంగా సమస్యలు పరిష్కరించేందకు కృషి చేస్తుందని తానా బోర్డు చైర్మన్ డాక్టర్ నాగేంద్ర శ్రీనివాస్ కొడాలి తెలిపారు. కొన్ని మీడియా సంస్థల్లో అసత్యాలు ప్రసారం చేస్తున్నారని, వాటిని నమ్మొద్దని సభ్యులను కోరారు. వాటిని ఖండించారు. ప్రభుత్వ దర్యాప్తు సంస్థ విచారణను కూడా నిషితంగా గమణిస్తున్నామని, అడిగిన వివరాలు ఇస్తున్నామని తెలిపారు.