https://oktelugu.com/

Pushpa 3 : పుష్ప 3 మీద ఫోకస్ చేస్తున్న ప్రొడ్యూసర్స్…ఇది ఎప్పుడు పట్టాలెక్కబోతుందంటే..?

ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటు ముందుకు సాగుతూ ఉండటం విశేషం. ఇక అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరో సైతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో సూపర్ సక్సెస్ లను సాధిస్తూ ముందుకు దుసుకెళ్తున్నాడు. ఇక పుష్ప 2 సినిమా ఇచ్చిన సక్సెస్ తో ఆయన క్రేజ్ తారా స్థాయికి చేరుకుంది...

Written By:
  • Gopi
  • , Updated On : January 9, 2025 / 01:06 PM IST

    Pushpa 3

    Follow us on

    Pushpa 3 : తెలుగు సినిమా ఇండస్ట్రీలో అల్లు అర్జున్ కి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ప్రస్తుతం ఆయన చేస్తున్న ప్రతి సినిమా ఇండస్ట్రీలో మంచి విజయాన్ని సాధించడమే కాకుండా ఆయనకంటూ ఒక సపరేట్ ఐడెంటిటిని కూడా క్రియేట్ చేసి పెడుతున్నాయి. ఇక ఇప్పటివరకు ఆయన సాధించిన విజయాలు ఒకెత్తయితే తే ఇకమీదట చేయబోతున్న సినిమాలు మరొక ఎత్తుగా మారబోతున్నాయి. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం ఆయన త్రివిక్రమ్ డైరెక్షన్ లో సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఇక ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ ‘పుష్ప 2’ సినిమా సూపర్ సక్సెస్ సాధించడంతో ఆ సినిమా ప్రొడ్యూసర్స్ అయిన మైత్రి మూవీ మేకర్స్ వాళ్లు పుష్ప 3 సినిమాను కూడా తెరమీదకి తీసుకురావాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇప్పటికే సుకుమార్ అల్లు అర్జున్ ఎవరికి వాళ్లు వాళ్ల సినిమాలతో బిజీ అయిపోయిన నేపథ్యంలో 2027 వ సంవత్సరంలో పుష్ప 3 సినిమాని పట్టాలెక్కించడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇప్పటికే సుకుమార్ కి కూడా పుష్ప 3 కి సంబంధించిన అడ్వాన్స్ ను ఇచ్చినట్టుగా వార్తలైతే వస్తున్నాయి.

    మరి ఏది ఏమైనా కూడా పుష్ప 3 సినిమాతో మరోసారి తనను తాను స్టార్ డైరెక్టర్ ఎలివేట్ చేసుకోవాలని సుకుమార్ ప్రయత్నం చేస్తున్నప్పటికి, మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు కూడా వాళ్ళని వాళ్ళు స్టార్ ప్రొడ్యూసర్స్ గా మార్చుకోవాలనే ప్రయత్నంలో బిజీగా ఉన్నట్టుగా తెలుస్తోంది…

    ఇక అల్లు అర్జున్ కూడా ఈ సినిమా కోసం గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. మరి ఈ లోపు ఆయన త్రివిక్రమ్, సందీప్ రెడ్డివంగా దర్శకత్వంలో కమిట్ అయిన సినిమాలను చేసి తనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకోవాలంటే మాత్రం ఇక మీదట భారీ సినిమాలను చేయాల్సిన అవసరమైతే ఉంది.

    ఇక పుష్ప 2 కి చాలా మంచి గుర్తింపైతే లభించింది. కాబట్టి పుష్ప ప్రాంచైజ్ ను కూడా అలాగే కొనసాగించి సినిమా మీద హైప్ ని తీసుకురావాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో ఎలాంటి పెను ప్రభంజనాన్ని సృష్టించబోతున్నారు అనేది తెలియాలంటే మాత్రం 2027 వరకు వెయిట్ చేయాల్సిందే… ఇక ఇప్పటికే పుష్ప 2 సినిమా ఇండస్ట్రీ హిట్టు కొట్టే దిశగా ముందుకు సాగుతుండటం తో సినిమా మేకర్స్ సంబరాలు చేసుకుంటున్నారు…