Vesupogu Shyamala: అమెరికాలో ఆటల పోటీలు.. తెలుగు మహిళా పోలీస్‌కు ఆహ్వానం!

శ్యామల సొంత గ్రామం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని కర్నూల్‌ పట్టణం, సిమెంట్‌ నగర్‌. శ్యామల తండ్రి మిలటరీ ఆఫీసర్, అమ్మ స్టాఫ్‌ నర్స్‌. ఏడుగురు అక్కలు, ఇద్దరు అన్నల గారాల చెల్లి శ్యామల.

Written By: Raj Shekar, Updated On : July 3, 2024 2:21 pm

Vesupogu Shyamala

Follow us on

Vesupogu Shyamala: అమెరికాలో నిర్వహించే ఆటల పోటీలకు తెలుగు మహిళా పోలీస్‌ వేసపోగు శ్యామలకు ఆహ్వానం అందింది. హైదరాబాద్‌ పైఫాబాద్‌ ట్రాఫిక్‌ ఏఎస్‌ఐగా పనిచేస్తున్న శ్యామల ఇంటర్నేషనల్‌ మాస్టర్స్‌ గేమ్స్‌ అసోసియేషన్‌ నిర్వహిస్తున్న 2024 పాన్‌ అమెరికన్‌ మాస్టర్స్‌ గేమ్స్‌ నుంచి ఆహ్వానం అందుకున్నారు. జూలై 12 నుంచి 21 వరకు అమెరికాలోని ఓహియో రాష్ట్రం, క్లీవ్‌ ల్యాండ్‌లో జరగనున్న పోటీల్లో షాట్‌పుట్, డిస్కస్‌ త్రో పోటీల్లో శ్యామల పాల్గొంటారు.

కర్నూల్‌లో పుట్టి..
శ్యామల సొంత గ్రామం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని కర్నూల్‌ పట్టణం, సిమెంట్‌ నగర్‌. శ్యామల తండ్రి మిలటరీ ఆఫీసర్, అమ్మ స్టాఫ్‌ నర్స్‌. ఏడుగురు అక్కలు, ఇద్దరు అన్నల గారాల చెల్లి శ్యామల. తండ్రి వారసత్వాన్ని కొనసాగించాలని పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌లో చేరారు. ఫస్ట్‌ పోస్టింగ్‌ హైదరాబాద్‌ నగరంలోని గోపాల్‌పురంలో వచ్చింది.

క్రీడలపై ఆసక్తి..
శ్యామలకు క్రీడలపై ఆసక్తి ఎక్కువ. విద్యార్థి దశ నుంచే ఆటల్లో రాణించింది. జిల్లా స్థాయిలో ఖోఖో, కబడ్డీ, త్రోబాల్, వాలీబాల్, బ్యాడ్మింటన్‌ పోటీల్లో పాల్గొని బహుమతులు సాధించింది. షాట్‌పుట్, డిస్కస్‌త్రోలో జాతీయస్థాయిలో పతకాలు గెలుచుకుంది. కరాటేలో బ్లాక్‌బెల్ట్‌.

350 సీసీ బుల్లెట్‌పై..
ఇక శ్యామల పోలీస్‌ కావాలని లక్ష్యంతో కొలువు సాధించింది. అయినా చాలా మంది అమ్మాయికి పోలీస్‌ కొలువు ఎందుకనే మాటలు అన్నా పట్టించుకోలేదు. ఇక శ్యామలకు వాహనాలు అంటే ఇష్టం. బైక్‌రైడ్‌ చేస్తుంది. అందకే చిన్నవి వద్దని 350 సీసీ బుల్లెట్‌ కొనుగోలు చేసింది. విధి నిర్వహణలో బుల్లెట్‌పై వెళ్లి ఆకతాయిల భరతం పడుతుంది. ట్రాఫిక్‌ అవేర్‌నెస్‌ ప్రోగ్రాంలు, భరోసా, షీటీమ్స్, తెలంగాణ స్టేట్‌ పోలీస్‌ కౌన్సెలింగ్‌ అండ్‌ అవేర్‌నెస్‌ ప్రోగ్రామ్, కరోనా సమయంలో అనారోగ్యంతో ప్రయాణించవద్దు–వ్యాప్తికిక కారణం కావొద్దని ప్రచారం చేశారు. ఎన్నికల సమయంలో ఓటుహక్కు వినియోగంపై ప్రచారం చేశారు.

సరదా కోసం సోలో రైడ్‌లు..
ఇక శ్యామల చిన్నప్పటి నుంచి టామ్‌ బాయ్‌లా పెరిగారు. బైక్‌ అంటే చాలా ఇష్టం. బైక్‌పై ప్రపంచాన్ని చుట్టిరావాలన్న ఉత్సాహం చూపుతారు. లద్దాక్‌లోని లేహ్‌ జిల్లాలో మాగ్నెటిక్‌ హిల్స్‌కి రైట్‌ చేశారు. ఆ సమయంలో 650 సీసీ బైక్‌ వాడారు. ఈ వాహనం కొనుగోలు చేసిన తొలి మహిళా పోలీస్‌గా గుర్తింపు పొందారు. వరల్డ్‌ మోటార్‌ సైకిల్‌ డే సందర్భంగా బైక్‌రైడ్‌ చేశారు. బైకర్‌ లీగ్‌ విజేత కూడా. మన్‌ సేఫ్‌ రైడర్‌ ఇన్‌ తెలంగాణ పురస్కారం అందుకున్నారు.

అడ్వెంచర్‌ స్పోర్ట్స్‌ అంటే ఇష్టం..
గుర్‌గావ్‌లో పారాషూట్‌ డైవింగ్, పారాగ్లైడింగ్‌ చేశారు. సాహసాలకు సావిత్రీబాయి ఫూలే పుస్కారంన, సోషల్‌ సర్వీస్‌కు హోలీ స్పిరిట్‌ క్రిస్టియన్‌ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్‌ అందుకున్నారు. మొత్తంగా నాలుగు మెడల్స్, మూడు అవార్డులు అందుకున్నారు శ్యామల.

పాన్‌ ఇండియా మాస్టర్స్‌ గేమ్స్‌లో..
ఇక ఈ ఏడాది మే నెలలో పాన్‌ ఇండియా మాస్టర్స్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ నిర్వహించిన పోటీల్లో శ్యామల పాల్గొన్నారు. షాట్‌పుట్, డిస్కస్‌ త్రోలో పతగాలు గెలిచారు. దీనికి కొనసాగింపుగా అమెరికాలో జరిగే క్రీడలకు ఆహ్వానం అందుకున్నారు.