Sasikala Narra Case: ఎంత పెద్ద నేరస్తులైనా సరే ఎక్కడో ఒక చోట దొరికిపోతుంటారు. అన్ని విధాలుగా జాగ్రత్తలు తీసుకున్నా సరే.. చిన్న క్లూ వారిని పట్టిస్తుంది. ఇప్పుడు మీరు చదవబోయే కథనంలో కూడా నేరస్థుడు అలానే దొరికిపోయాడు.. ఖండాలు దాటినప్పటికీ.. అతడు వదిలిన ఒక ఆధారం పట్టించేలా చేసింది. ఇంతకీ అతడు ఏం నేరం చేశాడు? ఎక్కడ చేశాడు? చివరికి ఎలా దొరికిపోయాడు? ఇన్ని ప్రశ్నలకు సమాధానం ఈ కథనం.
ఆమె పేరు శశికళ. వయసు 40 సంవత్సరాలు. భర్తతో కలిసి ఆమె అమెరికాలో ఉంటుంది. శశికళ దంపతులకు ఏడు సంవత్సరాల వయసున్న కుమారుడు ఉన్నాడు. శశికళ దంపతులు ఓ కంపెనీలో పనిచేస్తున్నారు. వారు పనిచేస్తున్న కాగ్నిజెంట్ కంపెనీలో హమీద్ అనే వ్యక్తి కూడా పనిచేస్తున్నాడు. ఇతడిది కూడా ఇండియానే. శశికళను హమీద్ నిత్యం వక్రబుద్ధితో చూసేవాడు. ఆమెను ఇబ్బంది పెట్టేవాడు. ఈ విషయం శశికళ భర్తకు తెలియడంతో అతడు అనేక సందర్భాల్లో హమీద్ ను మందలించాడు. ఈ విషయాన్ని మేనేజ్మెంట్ దృష్టికి కూడా తీసుకెళ్లాడు. మేనేజ్మెంట్ కూడా హమీద్ ను మందలించింది. ప్రవర్తన తీరు మార్చుకోవాలని సూచించింది. ఇవన్నీ మనసులో పెట్టుకున్న హమీద్ ఒకరోజు శశికళ దంపతులు ఉంటున్న ఇంటికి వెళ్ళాడు. అప్పటికే శశికళ భర్త బయటకి వెళ్ళాడు. ఇదే అదునుగా భావించిన అతడు ఆమెను ఇబ్బంది పెట్టాడు. ఆమె ఏడు సంవత్సరాల కుమారుడు హమీద్ ను వారించడానికి ప్రయత్నించాడు. దీంతో హమీద్ అత్యంత జాగ్రత్తగా శశికళ, ఆమె కుమారుడిని హత్య చేశాడు. ఒక్క ఆధారం కూడా వదిలిపెట్టకుండా జాగ్రత్తపడ్డాడు.
ఈ విషయం అమెరికా పోలీసులకు తెలియడంతో వారు దర్యాప్తు మొదలుపెట్టారు. మొదట్లో శశికళ భర్తను అనుమానించారు. అతడిని విచారించారు. అయినప్పటికీ ఉపయోగ లేకపోవడంతో పోలీసులు ఏమీ చేయలేకపోయారు. చివరి ప్రయత్నం గా పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తే హమీద్ తో గొడవలు ఉన్నట్టు తేలింది. దీంతో పోలీసులు హమీద్ ను ప్రశ్నించడానికి ప్రయత్నిస్తుండగా అప్పటికే అతడు ఇండియాకు వచ్చేశాడు. అయితే అధికారులు డిఎన్ఏ శాంపిల్స్ తీసుకోవడానికి ప్రయత్నించగా.. అతడు తిరస్కరించాడు. దీంతో పోలీసులు అక్కడ పనిచేసే కాగ్నిజెంట్ కంపెనీని సంప్రదించారు. కంపెనీ ప్రతినిధులు హామీదు ఉపయోగించే లాప్టాప్ ను పోలీసులకు అందించారు. పోలీసులు లాప్టాప్ నుంచి డిఎన్ఏ సేకరించారు. హత్య స్థలంలో పోలీసులకు లభ్యమైన డిఎన్ఏ తో.. లాప్టాప్ నుంచి సేకరించిన డిఎన్ఏ సరిపోలింది. దీంతో హమీద్ ను నిందితుడని పోలీసులు తేల్చారు. అతడిని అరెస్టు చేయడానికి అమెరికా పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు.
భర్త లేని సమయంలో శశికళ ఇంటికి వెళ్లిన హమీద్ ముందుగా ఆమెతో మాట్లాడాడు. రాయకుడని భాషలో ఓ కోరికను కోరాడు. దానికి ఆమె ఒప్పుకోలేదు. ఫలితంగా అతనిలో ఉన్న ఉన్మాది బయటికి లేచాడు. శశికళను తీవ్రంగా కొట్టాడు. ఆమె కుమారుడిని కూడా అదే స్థాయిలో గాయపరిచాడు. ఇద్దరు చనిపోయారని నిర్ధారించుకున్న తర్వాత.. ఆధారాలు లేకుండా చూసుకున్నాడు. ఆ తర్వాత అతడు అకస్మాత్తుగా ఇండియాకు వచ్చేశాడు.