BBC Chairman: గూగుల్ సీఈవోగా భారతీయుడు సుందర్ పిచాయ్ ఉన్నారు. మైక్రోసాఫ్ట్ సీఈవోగా సత్య నాదెళ్ల ఉన్నారు. ఐబీఎంగ్రూపు చైర్మన్‌గా అర్వింద్‌కృష్ణ ఉన్నారు. నోకియా ఇంక్ సీఈవోగా శ్రీరాజీవ్ సూరి ఉన్నారు. యూట్యూబ్ సీఈవోగా నీల్ మోహన్ ఉన్నారు.. వీరంతా భారతీయులే.. ఈ క్రమంలో తాజాగా మరో అంతర్జాతీయ ప్రముఖ సంస్థ బ్రిటిష్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్(బీబీసీ) సీఈవోగా మరో భారతీయుడు నియమితులయ్యారు. భారతీయ మూలాలు ఉన్న డాక్టర సమీర్‌షాను నియమించారు. తొలిసారి భారతీయ సంతతి వ్యక్తికి సీఈవో అవకాశం వచ్చింది.
ఔరంగాబాద్ వాసి..
ఇక 72 ఏళ్ల సమీర్‌షా ఔరంగాబాద్‌లో పుట్టాడు. 1960 తర్వాత అతని కుటుంబం బ్రిటన్‌కు వలస వెళ్లింది. టీవీ ప్రొడక్షన్, పాత్రికేయరంగంలో నాలుగు దశాబ్దాల అనుభవం ఉన్న సమీర్ గతంలో బీబీసీ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పనిచేశాడు. బీబీసీలో సమకాలీన, రాజకీయ వ్యవహరాల విభాగం చీఫ్‌గా పనిచేశాడు.
ఆమోద ముద్ర వేసిన బ్రిటన్ రాజు..
ఇక సమీర్‌షా నియామకానికి బ్రినట్‌రాజు చార్లెస్–3 ఈ వారమే ఆమోద ముద్ర వేశారు. దీంతో ఆయన నియామకాన్ని అధికారికంగా ప్రకటించారు. మార్చి నాలుగో తేదీ నుంచి నాలుగేళ్లపాటు ఆయన బీబీసీ సీఈవోగా కొనసాగుతారు.
వేతనం ఎంతో తెలుసా..
ఇక సమీర్‌షా వార్షిక వేతనం ఎంత ఉంటుందో ఊహించారా. ఆయన వార్షిక వేతనం రూ.1.68 కోట్లు. సమీర్‌షా బ్రిటన్ టెలివిజన్ రంగానికి చేసిన కృషికి దివంగత రాణి క్వీన్ ఎలిజిబెత్–2 కమాండర్ ఆఫ్‌ది ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైతో సత్కరించింది. 1998లో సొంతంగా జ్యూపిటర్ టీవీని కూడా సమీర్ నడుపుతున్నారు.