Tollywood Comedians: హీరోలుగా మారి ఫెయిల్ అయిన కమెడియన్లు వీళ్లే…

ఇయర్ లో కమెడియన్ ఒక పది సినిమాలు చేస్తే అందులో ఒక్క సినిమా క్లిక్ అయిన ఆయనకు మళ్ళీ ఇంకో పది సినిమాల్లో అవకాశాలు వస్తాయి. కానీ హీరోల పరిస్థితి లా ఉండదు.

Written By: Gopi, Updated On : February 27, 2024 11:08 am
Follow us on

Tollywood Comedians: సినిమా ఇండస్ట్రీలో ఒక హీరో వరుసగా సినిమాలు చేసుకుంటూ ఒక్కొక్క మెట్టు పైకి ఎదుగుతూ వెళ్లడం అనేది సహజంగా జరుగుతుంది. ఎంత పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో అయిన కూడా మొదట ఒకటి రెండు సక్సెస్ లు దక్కిన తర్వాతే ఆయన భారీ సినిమాలను చేసి సూపర్ డూపర్ సక్సెస్ లను అందుకుంటాడు. ఆ తర్వాత భారీ సినిమాలను తీసి స్టార్ హీరోగా మారతాడు. మరి కొందరు మాత్రం వరుస ప్లాప్ లతో ఇండస్ట్రీ నుంచి ఫేడ్ ఔట్ అవుతారు. ఇక ఇలాంటి క్రమంలోనే పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు ఇండస్ట్రీకి కమెడీయన్స్ గా వచ్చిన చాలామంది నటులు, స్టార్ హీరో లా స్టార్ డమ్ లను చూసి వాళ్ళు కూడా హీరోలుగా మారి ఇండస్ట్రీలో సక్సెస్ లు కొట్టాలని చూస్తూ ఉంటారు. కానీ ఇక్కడ అత్యంత ప్రమాదకరమైన విషయం ఏంటి అంటే హీరో స్టార్ డమ్ అనేది ఎన్ని రోజులు ఉంటుందో ఎవరికి తెలియదు.

అదే కమెడియన్ అయితే వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవచ్చు. ఒక ఇయర్ లో కమెడియన్ ఒక పది సినిమాలు చేస్తే అందులో ఒక్క సినిమా క్లిక్ అయిన ఆయనకు మళ్ళీ ఇంకో పది సినిమాల్లో అవకాశాలు వస్తాయి. కానీ హీరోల పరిస్థితి లా ఉండదు. ఒకటి ప్లాప్ అయితే మరో సంవత్సరం దాకా అసలు సినిమాలే ఉండవు. ఇక ఇది ఇలా ఉంటే కొంతమంది కమెడియన్స్ హీరోలుగా మారి చేతులు కాల్చుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. తెలుగులో హీరోలుగా మారి ఫెయిల్ అయిన కమెడియన్లు ఎవరో ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

అలీ
సినిమా ఇండస్ట్రీలో అలీ చైల్డ్ ఆర్టిస్ట్ గా వచ్చి ఆ తర్వాత కమెడియన్ గా సెటిల్ అయి పోయాడు. కానీ ఎస్ వి కృష్ణారెడ్డి చేసిన ‘యమలీల ‘ సినిమాతో అలీ స్టార్ హీరోగా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇక ఆ సినిమా ఇచ్చిన సక్సెస్ తో వరుసగా ఒక పది సినిమాల వరకు హీరోగా నటించాడు. అందులో ఒకటి, రెండు సక్సెస్ లు వచ్చినప్పటికీ అవి ఆయనకు పెద్దగా ఉపయోగపడలేదు. దాంతో హీరోగా కెరియర్ లేకపోవడంతో మళ్లీ కమెడియన్ గా మారి వరుస సినిమాలను చేస్తూ మంచి విజయాలను అందుకుంటూ వచ్చాడు…

వేణుమాధవ్
కమెడియన్ అయిన వేణుమాధవ్ హీరోగా మారి హంగామా, ప్రేమాభిషేకం, భుకైలాస్ లాంటి కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ, ఆ సినిమాలేవి సక్సెస్ సాధించలేదు. దాంతో ఆయన కూడా మళ్ళీ కమెడియన్ గా మారి చాలా సంవత్సరాల పాటు ఇండస్ట్రీలో స్టార్ కమెడియన్ గా వెలుగొందాడు. అనారోగ్య కారణం చేత కొన్ని సంవత్సరాల క్రితమే ఆయన మరణించిన విషయం మనకు తెలిసిందే…

సునీల్
సునీల్ మొదట నువ్వేనేను, నువ్వు నాకు నచ్చావ్, నువ్వే కావాలి, చిరునవ్వుతో లాంటి సినిమాల్లో కమెడియన్ గా నటించి మెప్పించారు. ఇక ఆ తర్వాత ఆయనకు కమెడియన్ గా వరుస సినిమాల్లో ఆఫర్లు రావడమే కాకుండా, చాలా తక్కువ సమయంలోనే అప్పటి సీనియర్ కమెడియన్లు అయిన బ్రహ్మానందం, ఏవీఎస్, ఎంఎస్ నారాయణ లాంటి వాళ్లతో పోటీపడి మరి నటించి మంచి అవకాశాలను దక్కించుకున్నాడు. ఒకానొక సందర్భంలో సునీల్ తినడానికి కూడా సమయం లేనంత బిజీగా షూటింగ్స్ ఉండేవాడట..

అలాంటిది అందాల రాముడు సినిమాతో హీరో గా మారి మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇక ఆ తర్వాత కూడా కొన్ని సినిమాల్లో కమెడియన్ గా చేశాడు. మగధీర తర్వాత దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో మర్యాద రామన్న సినిమాలో హీరోగా చేశాడు. ఈ సినిమా సూపర్ సక్సెస్ సాధించడం తో కమెడియన్ గా చేయడం మానేసి ఫుల్ టైం హీరోగా మారిపోయాడు. ఆ తర్వాత ఒక పది సినిమాల వరకు చేసిన కూడా ఆయనకి ఏ సినిమాలు పెద్దగా కలిసి రాకపోవడంతో ఇప్పుడు మళ్లీ విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో నటిస్తున్నాడు…

ఇలా కమెడియన్స్ అందరూ హీరోలుగా మారినప్పటికీ ఒకటి,రెండు సక్సెస్ లను మాత్రమే దక్కించుకుంటున్నారు. అంతే తప్ప లాంగ్ కెరియర్లో హీరోలుగా నిలబడలేకపోతున్నారు.