Portland Mini Mahanadu : మే 31, శనివారం నాడు అమెరికాలోని ఒరెగాన్ రాష్ట్రం, పోర్ట్‌ల్యాండ్‌లో టీడీపీ మినీ మహానాడు అత్యంత అట్టహాసంగా, ఆర్భాటంగా జరిగింది. ఈసారి మహిళలు, యువత తమ అభిమాన పార్టీ కోసం ముందుండి నడిపించారు. దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జయంతి, టీడీపీ గత సంవత్సర కాలం పాలన, బాలకృష్ణకు పద్మభూషణ్ లభించిన సందర్భంగా ఈ వేడుకలను ఘనంగా నిర్వహించారు.

ఈ వేడుకల్లో భాగంగా ‘మా తెలుగు తల్లికి’ పాటకు మహిళలు, చిన్నారులు బాలకృష్ణ పాటలకు స్టెప్పులు వేసి అందరినీ అలరించారు. టీడీపీ పాలనలో చేపట్టిన అనేక వ్యవసాయ ఆధారిత మరియు ఐటీ సంబంధిత కార్యక్రమాల గురించి ఈ సందర్భంగా ప్రసంగించారు. రుచికరమైన విందు భోజనంతో పాటు, బాలకృష్ణ, టీడీపీ, మహానాడుపై క్విజ్ వంటి అనేక ఆహ్లాదభరితమైన కార్యక్రమాలు జరిగాయి. ఎన్నారైలు నరహరి రామినినేని, మారుతి యరపతినేని టీడీపీ చేస్తున్న ప్రజోపయోగ కార్యక్రమాల గురించి ప్రసంగించారు. ఈ వేడుకలు పోర్ట్‌ల్యాండ్‌లో తెలుగుదేశం పార్టీ పట్ల ఉన్న అభిమానాన్ని, మద్దతును మరోసారి చాటిచెప్పాయి.
