Pawan Kalyan OG Movie : తెలుగు సినిమా ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pavan Kalyan) కి ఉన్న గుర్తింపు అంతా ఇంతా కాదు. మిగతా ఏ హీరోలకి లేనటువంటి ఒక గొప్ప గుర్తింపును సంపాదించుకున్న ఆయన ఇకమీదట చేయబోయే సినిమాల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు అతనికి గొప్ప గుర్తింపు సంపాదించి పెట్టాయి. పాన్ ఇండియా ఇండస్ట్రీలో ఆయన మంచి సక్సెస్ ని సాధించి తనకంటూ ఒక మార్కెట్ ని కూడా క్రియేట్ చేసుకోవాలని చూస్తున్నాడు. హరిహర వీరమల్లు (HariHara Veeramallu) సినిమాని జూన్ 12వ తేదీన రిలీజ్ కి సిద్ధం చేస్తున్నారు. ఇక సుజిత్ (Sujeeth) డైరెక్షన్ లో రాబోతున్న ఓజి (OG)సినిమాకు సంబంధించిన అప్డేట్ ను కూడా ఇవ్వాలనే ఆలోచనలో మేకర్స్ అయితే ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్లో పాల్గొంటున్న పవన్ కళ్యాణ్ జూలై ఎండింగ్ వరకు ఈ సినిమా షూటింగ్ ను కంప్లీట్ చేయాలని చూస్తున్నారట.
ఆగస్టు నెల మొత్తం పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేసి సెప్టెంబర్ లో ఈ సినిమాని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే సెప్టెంబర్ 25వ తేదీన ఈ సినిమాని ప్రేక్షక ముందుకు తీసుకురావడానికి మూవీ టీం శతవిధాల ప్రయత్నమైతే చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ షూటింగ్ అయిపోతే షూట్ మొత్తాన్ని కంప్లీట్ చేసి సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేయాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది.
Also Read : సరికొత్త పోస్టర్ తో ‘ఓజీ’ విడుదల తేదీని ప్రకటించిన నిర్మాతలు..షేక్ అయిన సోషల్ మీడియా!
ఏది ఏమైనా కూడా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోలందరు వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎలివేట్ చేసుకుంటున్న సమయంలో పవన్ కళ్యాణ్ కి మాత్రం పాన్ ఇండియాలో ఇప్పటివరకు మార్కెట్ అయితే లేకుండా పోయింది. ఈ సినిమాతో ఆ మార్కెట్ భారీ రేంజ్ లో క్రియేట్ ఇవ్వడమే కాకుండా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోసం బాలీవుడ్ జనాలు సైతం అతని సినిమాల కోసం పోటీపడే రేంజ్ లో ఓజీ సినిమా ఉండబోతుందట…
పవన్ కళ్యాణ్ కెరియర్ లో అత్తారింటికి రాదేది సినిమా తర్వాత ఆ రేంజ్ హిట్ మళ్ళీ రాలేదు. కాబట్టి ఈ సినిమా భారీ సక్సెస్ ని సాధించడమే కాకుండా ఇన్ని రోజులపాటు పవన్ కళ్యాణ్ అభిమానుల నిరీక్షణకు ఊరట గా ఈ సినిమా రాబోతుంది అనేది క్లారిటీ గా తెలుస్తోంది…