Kamal haasan impact on Nithiin : కమల్ హాసన్(Kamal Haasan) హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘థగ్ లైఫ్'(Thug Life) రేపు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ తెలుగు, తమిళ భాషల్లో విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ అన్ని ప్రాంతాల్లో మొదలయ్యాయి. తమిళ వెర్షన్ అడ్వాన్స్ బుకింగ్స్ చాలా గొప్పగా జరుగుతున్నాయి. కానీ తెలుగు వెర్షన్ అడ్వాన్స్ బుకింగ్స్ మాత్రం చాలా వీక్ గా ఉన్నాయి. హైదరాబాద్ సిటీ ఒక్కటే పర్వాలేదు అనే రేంజ్ లో ఉంది కానీ,మిగిలిన ప్రాంతాల్లో కనీస స్థాయి బుకింగ్స్ కూడా జరగడం లేదు. ఈ సినిమా తెలుగు వెర్షన్ థియేట్రికల్ రైట్స్ ని ప్రముఖ యంగ్ హీరో నితిన్(Hero Nithin) కొనుగోలు చేసాడు. గతం లో ఈయన కమల్ హాసన్ లోకేష్ కనకరాజ్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘విక్రమ్’ మూవీ తెలుగు వెర్షన్ రైట్స్ ని కొనుగోలు చేసాడు.
ఈ సినిమా కమర్షియల్ గా ఎలాంటి సెన్సేషన్ ని సృష్టించిందో తెలిసిందే. తెలుగు వెర్షన్ రైట్స్ ని అప్పట్లో నితిన్ కేవలం 7 కోట్ల రూపాయలకు దక్కించుకున్నాడు. కానీ ఈ సినిమా విడుదల అయ్యాక తెలుగు లో పాతిక కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టి నితిన్ కి భారీ లాభాలను తెచ్చిపెట్టింది. అలాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత నితిన్ ఇప్పుడు కమల్ హాసన్ ‘థగ్ లైఫ్’ చిత్రం తెలుగు వెర్షన్ రైట్స్ ని కూడా కొనుగోలు చేసాడు. కానీ ఈ సినిమాకు నష్టాలు తప్పేలా అనిపించడంలేదు. సూపర్ హిట్ అవ్వాలంటే కచ్చితంగా పాజిటివ్ టాక్ రావాలి. అది దాదాపుగా అసాధ్యం అని ట్రైలర్ ని చూసిన తర్వాత అర్థం అవుతుంది. ఓపెనింగ్స్ కూడా పెద్దగా ఉండకపోయే అవకాశాలు ఉండడం తో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వడం అసాధ్యాన్ని తెలుస్తుంది. ఇప్పటికే ఈ చిత్రం అనేక వివాదాల్లో చిక్కుకుంది.
Also Read : కమల్ హాసన్ కు డీఎంకే రాజ్యసభ సీటు
కర్ణాటక రాష్ట్రంలో ప్రొమోషన్స్ లో భాగంగా ఒక ప్రెస్ మీట్ లో పాల్గొన్న కమల్ హాసన్ కన్నడ భాషపై పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసాడు. కన్నడ బాషా తమిళం నుండి పుట్టింది అంటూ ఆయన మాట్లాడిన మాటలు పెద్ద దుమారమే రేపాయి. కమల్ వెంటనే క్షమాపణలు చెప్పాలంటూ అక్కడి ప్రేక్షకుల తో పాటు తమిళియన్స్ కూడా డిమాండ్ చేశారు. కానీ కమల్ హాసన్ తప్పు చేసినప్పుడు మాత్రమే క్షమాపణలు చెప్తాను అంటూ క లేఖ విడుదల చేయడం తో ‘థగ్ లైఫ్’ చిత్రాన్ని బ్యాన్ చెయ్యాలి అంటూ పెద్ద ఎత్తున కన్నడ యువత పెద్ద ఎత్తున ధర్నాలు చేసింది. కర్ణాటక ప్రభుత్వం కూడా ‘థగ్ లైఫ్ చిత్రాన్ని బ్యాన్ చేయడమే కాకుండా ఏ థియేటర్ అయినా ప్రదర్శించే సాహసం చేస్తే కఠినమైన చర్యలు తప్పవు అంటూ వార్నింగ్ కూడా ఇచింది. కమల్ కూడా ఈ చిత్రాన్ని కర్ణాటక లో విడుదల చేయడం లేదని ప్రెస్ మీట్ ద్వారా తెలిపింది. కేవలం ఈ ఒక్క మాట కారణంగా ఈ సినిమా ఎన్ని కష్టాల్లో చిక్కుకుందో మీరే చూడండి.