https://oktelugu.com/

Chandrababu: టీడీపీ కోసం రంగంలోకి ఎన్నారైలు.. చంద్రబాబును సీఎం చేయడమే లక్ష్యంగా పెద్ద ప్లాన్లు!

చంద్రబాబు పాలనలో ఎన్‌ఆర్‌ఐలతోపాటు రాష్ట్రంలో ప్రజలందరి ఆస్తులు పెరిగాయని, వైసీపీ పాలనలో జగన్‌ ఆస్తులు, ఆ పార్టీ మంత్రులు ఎమ్మెల్యేల ఆస్తులు మాత్రమే పెరిగాయని టీడీపీ ఎన్‌ఆర్‌ఐ సెల్‌ భావిస్తోంది.

Written By:
  • Raj Shekar
  • , Updated On : April 17, 2024 / 12:35 PM IST

    Chandrababu

    Follow us on

    Chandrababu: సార్వత్రిక ఎన్నికల వేళ.. ఎన్నారైలు ఏపీలో అడుగు పెట్టారు. చంద్రబాబును సీఎంను చేయడమే లక్ష్యంగా ఎన్నికల క్షేత్రంలోకి దూకేందుకు సిద్ధమవుతున్నారు. దాదాపు 1,500 మంది ఎన్‌ఆర్‌ఐలు 125 దేశాల నుంచి ఏపీకి చేరుకున్నారు. తమ స్వస్థలాల్లో వీరు ఎన్డీఏ అభ్యర్థుల గెలుపు కోసం పనిచేయబోతున్నారు. ఈ క్రమంలో ఓటర్లను ప్రభావితం చేసే అంశంపై టీడీపీ ఎన్‌ఆర్‌ఐ విభాగం మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఎన్‌ఆర్‌ఐలతో ప్రత్యేక సమావేశం నిర్వహించింది. జగన్‌ను ఎలా గద్దె దించాలి.. చంద్రబాబును ఎలా సీఎంను చేయాలి అనే అంశంపైనే ప్రధానంగా చర్చించారు. ఎన్‌ఆర్‌ఐలలో కూడా అదే పట్టుదల కనిపిస్తోంది. అభివృద్ధిలో ఐదేళ్లు వెనక్కు వెళ్లిన రాష్ట్రాన్ని చంద్రబాబు మాత్రమే గట్టెక్కిస్తారని గట్టిగా నమ్ముతున్నారు.

    మరో స్వాతంత్య్ర పోరాటంలా..
    చంద్రబాబు పాలనలో ఎన్‌ఆర్‌ఐలతోపాటు రాష్ట్రంలో ప్రజలందరి ఆస్తులు పెరిగాయని, వైసీపీ పాలనలో జగన్‌ ఆస్తులు, ఆ పార్టీ మంత్రులు ఎమ్మెల్యేల ఆస్తులు మాత్రమే పెరిగాయని టీడీపీ ఎన్‌ఆర్‌ఐ సెల్‌ భావిస్తోంది. ఈ పరిస్థితిలో మరో స్వాతంత్య్ర పోరాటం చేయాలని ఎన్‌ఆర్‌ఐలు భావిస్తున్నారు. ఎన్నికల యుద్ధంలో గెలవాలంటే ముందుగా ప్రచార యుద్ధంలో గెలవాలని బావిస్తున్నారు. ఇందుకు సోషల్‌ మీడియాను ప్రధాన ఆయుధంగా వాడుకోవాలని చస్తున్నారు.

    భవిష్యత్‌ కోసమే..
    ఎన్నికల క్షేత్రంలోకి దిగుతున్న ఎన్‌ఆర్‌ఐలు ప్రజలకు వారి పిల్లల భవిష్యత్‌ కోసం చంద్రబాబు మళ్లీ సిఎం కావడం ఎలా అవసరమో వివరించాలని నిర్ణయించారు. ఎన్‌ఆర్‌ఐల ప్రభావం రాష్ట్రంలో 15 నుంచి 20 నియోజకవర్గాల్లో కచ్చితంగా ఉంటుందని టీడీపీ భావిస్తోంది. ముఖ్యంగా యువతను ఆకట్టుకునేలా ప్రచారం చేయాలని భావిస్తోంది. ఒక్కో ఎన్‌ఆర్‌ఐ కనీసం పది వైసీపీ అనుకూల కుటుంబాలను మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. మరి ఎన్‌ఆర్‌ఐల టీడీపీ అనుకూల నిర్ణయాలు.. ప్లాన్లు ఏమేరకు ఫలిస్తాయో చూడాలి.