https://oktelugu.com/

Jabardasth -Rashmi Gautam :  యాంకర్ రష్మీకి ఘోర అవమానం.. ముఖం మీద షూ వేసిన జబర్దస్త్ కమెడియన్, వీడియో వైరల్!

ఎక్స్ట్రా జబర్దస్త్ లేటెస్ట్ ప్రోమో విడుదల కాగా నవ్వులు పూయించే విధంగా ఉంది. ఇందులో ఇమ్మానుయేల్ స్కిట్ హైలెట్ గా నిలిచింది. ఆటో రాంప్రసాద్ రోహిణి తో కలిసి కామెడీ పండించాడు. బుల్లెట్ భాస్కర్, రాకింగ్ రాకేష్ తమదైన కామెడీతో ఆకట్టుకున్నారు. కాగా ఈ ఎపిసోడ్ వచ్చే శుక్రవారం ప్రసారం కానుంది. ఎక్స్ట్రా జబర్దస్త్ ప్రోమో వైరల్ అవుతుంది.

Written By:
  • NARESH
  • , Updated On : April 24, 2024 / 07:48 PM IST

    Rashmi Gautam

    Follow us on

    Jabardasth -Rashmi Gautam : యాంకర్ రష్మీ కి ఘోరంగా అవమానం జరిగింది. పబ్లిక్ లో ఓ జబర్దస్త్ కమెడియన్ ఆమె పరువు తీశాడు. వివరాల్లోకి వెళితే .. టిల్లు స్క్వేర్ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో తెలిసిందే. వరల్డ్ వైడ్ టిల్లు స్క్వేర్ రూ. 125 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. టిల్లు స్క్వేర్ చిత్రంలో సిద్ధూ జొన్నలగడ్డ వన్ మ్యాన్ షో చేశాడు. ఆయన డైలాగ్స్, మేనరిజమ్స్ నవ్వులు పూయించాయి. ఆడియన్స్ తెగ ఎంజాయ్ చేశారు.

    తాజాగా టిల్లు స్క్వేర్ మూవీ స్పూఫ్ చేసాడు జబర్దస్త్ కమెడియన్ ఇమ్మానుయేల్. ఈ క్రమంలో ఇమ్మానుయేల్ టీం లోని ఓ కమెడియన్ రష్మీ ని ఇన్సల్ట్ చేశాడు. ఈ స్కిట్ డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ చిత్రాలను కలిపి చేశారు. ఈ నేపథ్యంలో ఇమ్మానియేల్, మరో కమెడియన్ టిల్లు గా యాక్ట్ చేశారు. సదరు కమెడియన్ టిల్లు స్క్వేర్ మూవీలో హీరో హీరోయిన్ ని ఫ్లర్ట్ చేసినట్లే రష్మీ ని ఫ్లర్ట్ చేసాడు. రష్మీని ఉద్దేశిస్తూ… ‘ఎక్కడో మనుసు విరిగినట్టుంది… ఉన్నాడా బాయ్ ఫ్రెండ్’ అంటాడు.

    సమాధానంగా రష్మీ… నీకెందుకు అని మండిపడింది. దీనికి కమెడియన్ అదిరిపోయే పంచ్ వేశాడు. ‘ఆ ఏం లేదు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడంటే నా షూ నేను వేసుకుని వెళ్ళిపోతా .. లేదంటే ఈ షూ నీ మీద వేసి పోతా’ అని షూ విసురుతాడు. దాంతో రష్మీకి ఏం చెప్పాలో తెలియక నోరు వెళ్ళబెట్టింది. చూస్తూ షాక్ లో ఉండిపోయింది. సదరు కమెడియన్ ఇలా చెప్పడం హైలెట్ గా నిలిచింది. వర్ష రాధిక పాత్రలో కనిపించింది. లిల్లీ గా మరో లేడీ కమెడియన్ చేసింది. అయితే ఇదంతా ఫన్ లో భాగమే.

    ఎక్స్ట్రా జబర్దస్త్ లేటెస్ట్ ప్రోమో విడుదల కాగా నవ్వులు పూయించే విధంగా ఉంది. ఇందులో ఇమ్మానుయేల్ స్కిట్ హైలెట్ గా నిలిచింది. ఆటో రాంప్రసాద్ రోహిణి తో కలిసి కామెడీ పండించాడు. బుల్లెట్ భాస్కర్, రాకింగ్ రాకేష్ తమదైన కామెడీతో ఆకట్టుకున్నారు. కాగా ఈ ఎపిసోడ్ వచ్చే శుక్రవారం ప్రసారం కానుంది. ఎక్స్ట్రా జబర్దస్త్ ప్రోమో వైరల్ అవుతుంది.