Homeప్రవాస భారతీయులుNRI Aadhaar: ఎన్‌ఆర్‌ఐల ఆధార్‌కు కొత్త నిబంధనలు.. ఏం మారాయో తెలుసా?

NRI Aadhaar: ఎన్‌ఆర్‌ఐల ఆధార్‌కు కొత్త నిబంధనలు.. ఏం మారాయో తెలుసా?

NRI Aadhaar: ఎన్‌ఆర్‌ఐలు, ఓసీఐ కార్డు హోల్డర్ల ఆధార్‌ కార్డు పొందడానికి భారత ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకు వచ్చింది. దీనికోసం యూఐడీఏఐ ప్రత్యేక ఫామ్‌లను ప్రవేశపెట్టింది. వీటిని ఉపయోగించి నాన్‌ రెసిడెంట్‌ ఇండియన్స్‌(ఎన్‌ఆర్‌ఐ), ఓవర్సీస్‌ సిటిజన్స్‌ ఆఫ్‌ ఇండియా(ఓసీఐ)వారు ఆధార్‌ ఎన్‌రోల్‌ యచేసుకోవచ్చు.

ఇలా అప్లై చేసుకోవాలి..
ఎన్‌ఆర్‌ఐగా మీకు లేదాన మీ పిల్లలకు ఆధార్‌ కావాలనుకుంటే స్వదేశానికి తిరిగి వెళ్లినప్పుడు అప్లై చేసుకోవచ్చు. రిజిస్రే‍్టషన్‌, బయోమెట్రిక్‌ ధ్రువీకరణ ప్రక్రియ పూర్తి చేయడానికి ఆధార్‌ సేవా కేంద్రానికి వెళ్లాలి. దరఖాస్తు చేసుకునేవారు వారి పాస్‌పోర్టును ప్రూఫ్‌గా చూపించాలి‍్స ఉంటుంది. కొత్త నిబంధనల ప్రకారం 2023, అక్టోబర్ 1 తర్వాత పుట్టిన దరఖాస్తుదారులకు జనన ధృవీకరణ, ఆధార్ కార్డు పొందిన తరువాత కూడా వ్యక్తిగత సమాచారం అప్‌డేట్‌ చేయడం అవసరం. పదేళ్లకు ఒకసారి ఎన్‌ఆర్‌ఐలు మాత్రమే కాకుండా ఆధార్‌ ఉన్న ప్రతి ఒక్కరూ చిరునామా డేటాబేస్‌లో తప్పనిసరిగా అప్‌డేట్‌ చేయలి. దీనిని ఆన్‌లైన్‌లో లేదా ఆఫ్‌లైన్‌లో పూర్తి చేసుకోవచ్చు.

ఎన్ఆర్‌ఐల ఆధార్ ఎన్‌రోల్‌మెంట్‌/అప్‌డేట్‌ ఫామలు..
యూఐడీఏఐ ఇప్పుడు విదేశీ భారతీయుల కోసం ఫామ్స్ ప్రవేశపెట్టింది. ఇందులో భారతదేశం చిరునామాగా ఉన్నవారికి, చిరునామా భారతదేశం వెలుపల ఉన్న వారికి, వయసును దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకించి ఫామ్స్ ఉన్నాయి.

• ఫారమ్ 1 అనేది 18 ఏళ్లు పైబడిన వారి కోసం.. ఫారం 3 అనేది 5 నుంచి 18 సంవత్సరాల మధ్య వయస్సు గల పిల్లలను నమోదు చేసుకోవడానికి.

– భారతదేశం వెలుపల చిరునామా కలిగిన వారి కోసం ఫామ్ 2, ఫామ్ 4 ప్రత్యేకంగా పరిచయం చేశారు. ఫారమ్ 2 అనేది 18 ఏళ్లు పైబడిన వారి కోసం.. ఫారం 4 అనేది 5 నుంచి 18 సంవత్సరాల మధ్య వయస్సు గల పిల్లలను నమోదు చేసుకోవడానికి.

– ఐదేళ్ల కన్నా వయసు తక్కువ ఉన్న పిల్లలకు నమోదు చేసుకోవాలంటే ఫామ్‌ 5(చిరునామా భారతదేశంలో ఉంటే), ఫామ్‌ 6 ( చిరునామా భారతదేశం వెలుపల ఉంటే) ఉపయోగించాలి.

ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా కార్డు హోల్డర్ల కోసం..

– నిజానికి ఇంతకుముందు భారతదేశంలోని విదేశీ పౌరులు ఆధార్ కార్డు పొందటానికి అర్హులు కాదు. ఆధార్ పౌరసత్వాన్ని ధ్రువీకరించదని ప్రభుత్వం స్పష్టం చేసిన తర్వాత, ఆధార్‌కు అర్హులైన విదేశీ భారతీయుల వర్గాలకు ఏసీఐలను యాడ్ చేశారు. భారత్‌లో ఆధార్‌ కార్డు దరఖాస్తు చేసుకోవడానికి క్యాలెండర్‌ ఇయర్‌లో కనీసం 182 రోజులు భారతదేశంలో ఉండాలి.

– 18 ఏళ్లు పైబడిన దరఖాస్తుదారులు ఆధార్ ఎన్‌రోల్‌మెంట్‌ కోసం ఫామ్ 7ని ఉపయోగించాలి. వయసు 18 ఏళ్లకన్నా ఎక్కువ ఉంటే ఫామ్‌ 8ని ఉపయోగించాల్సి ఉంటుంది.

వివరాలు సరైనవి ఇవ్వాలి..
ఆధార్ కార్డు అప్లై చేసుకున్న వారు సరైన ఇమెయిల్ అందించాలి. చెల్లుబాటు కానీ ఇమెయిల్ పేర్కొంటే అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది. యూఐడీఏఐ అంతర్జాతీయ నంబర్లను అనుమతివ్వదు, కాబట్టి భారతీయేతర ఫోన్‌ నంబర్‌ను అందిస్తే మీ ఆధార్‌ కార్డుకు సంబంధించిన ఎస్‌ఎంఎస్‌/టెక్ట్స్ నోటిఫికేషన్‌ను అందుకోలేదు. ఇవన్నీ నాన్-రెసిడెంట్ ఇండియన్స్, ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియన్స్ గమనించాలి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular