TANA: తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా(తానా)లో కొత్త సభ్యుల ఎన్నికపై ప్రతిష్టంభన వీడింది. కొత్త సభ్యుల ఎన్నికకు బోర్డు ఆమోద ముద్ర వేసింది. దీంతో ఎన్నికపై నెలకొన్న వివాదం సమసిపోయింది.
ఫిర్యాదులపై చర్చ..
తానా బోర్డు సభ్యుల ఎన్నికలపై వచ్చిన ఫిర్యాదులపై బోర్డు సమావేశంలో చర్చించారు. ఫిర్యాదులను బోర్డు తోసిపుచ్చింది. కొత్తగా ఎన్నికైన బోర్డు సభ్యులను, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుల నియామకానికి బోర్డు ఆమోద ముద్ర వేసింది. మార్చి 1వ తేదీ నుంచి కొత్త బోర్డు, కొత్త పాలకవర్గం బాధ్యతలు స్వీకరిస్తుందని తానా బోర్డు చైర్మన్ హనుమయ్య బండ్ల తెలిపారు.
ఓటింగ్‌పై ఫిర్యాదులు..
తానా ఎన్నికల్లో ఓటింగ్‌పై అనేక ఫిర్యాదులు వచ్చాయి. వీటిపై ఫిబ్రవరి 29న నిర్వహించిన బోర్డు సమావేశంలో చర్చించారు. ఫిర్యాదులన్నీ తోసిపుచ్చారు. ఎన్నికల కమిటీ పంపిన ఫలితాలను పరిగణనలోకి తీసుకున్నట్లు హనుమయ్య తెలిపారు. కొత్తగా ఎన్నికైన సభ్యులకు బోర్డు ఆమోద ముద్ర వేసిందని పేర్కొన్నారు. బోర్డు నిర్ణయంతో ప్రెసిడెంట్‌గా ఎలక్ట్ అయిన నరేన్ కొడాలి, ఆయన టీం బాధ్యతలు చేపట్టనుంది.