Homeప్రవాస భారతీయులుMegha Sudhareddy: న్యూయార్క్ ఫ్యాషన్ షోలో మెరిసిన మేఘా కృష్ణారెడ్డి సతీమణి

Megha Sudhareddy: న్యూయార్క్ ఫ్యాషన్ షోలో మెరిసిన మేఘా కృష్ణారెడ్డి సతీమణి

అంతర్జాతీయ ఫ్యాషన్ వేదికపై హైదరాబాద్ కు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త మేఘా కృష్ణారెడ్డి సతీమణి సుధారెడ్డి తళుక్కుమన్నారు. న్యూయార్క్ నగరంలో సోమవారం రాత్రి జరిగిన ప్రతిష్ఠాత్మక ఫ్యాషన్ వేడుక మెట్ గాలా-2021లో ప్రత్యేకంగా డిజైన్ చేసిన గౌనులో మెరిశారు. ఇప్పటివరకు ఈ షోలో బాలీవుడ్ హీరోయిన్లు ప్రియాంక చోప్పా, దీపికా పదుకొనే, ఇషా అంబానీ తదితరులు పాల్గొన్నారు. ఈ ఏడాది థీమ్ అమెరికన్ ఇండిపెండెన్స్ కు తగ్గట్లు అమెరికా జెండాలోని రంగులను తలపించేలా భారతీయ ఫ్యాషన్ డిజైనర్లు ఫల్గుని, షేక్ పీకాక్ ప్రత్యేకంగా తీర్చిదిద్దిన గౌనును ఆమె ధరించారు.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Exit mobile version