Assam Rifles Recruitment 2021: అస్సాం రైఫిల్స్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. 1230 ఉద్యోగ ఖాళీల భర్తీ కొరకు తాజాగా జాబ్ నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. టెక్నికల్, ట్రేడ్స్‌మ్యాన్ ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారని సమాచారం. ఏపీలో 64, తెలంగాణలో 48 ఉద్యోగ ఖాళీలు ఉండగా ఆసక్తి, అర్హత ఉనావాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
http://assamrifles.gov.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్ లైన్ లో ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. పదో తరగతి, ఐటీఐ పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 18 నుంచి 23 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులు. ఫిజికల్ టెస్ట్, రాతపరీక్ష ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.
2021 సంవత్సరం అక్టోబర్ 25 ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖ చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. ఇంటర్, డిగ్రీ పాసైన వాళ్లు కూడా ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. వెబ్ సైట్ ద్వారా టెక్నికల్, ట్రేడ్స్‌మ్యాన్ పోస్టులకు సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే నివృత్తి చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు పోటీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది.
ఈ ఉద్యోగ ఖళీలకు ఎంపికైన వాళ్లకు మంచి వేతనం లభించనుంది. అర్హత, అనుభవం ఆధారంగా వేతనం పెరిగే అవకాశాలు ఉంటాయి. ఇప్పటికే ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైన సంగతి తెలిసిందే.